రోహిత్‌ వార్నింగ్‌.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న సర్ఫరాజ్‌! | Rohit Sharma's Advice, Safaraz Khan Averts Major Injury Threat | Sakshi
Sakshi News home page

IND vs ENG: రోహిత్‌ వార్నింగ్‌.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న సర్ఫరాజ్‌! వీడియో

Published Sun, Mar 10 2024 8:57 AM | Last Updated on Sun, Mar 10 2024 10:53 AM

 Rohit Sharmas Advice, Safaraz Khan Averts Major Injury Threat - Sakshi

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కాస్త సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. హెల్మెట్‌ ధరించకుండా సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేయడానికి సిద్దమైన సర్ఫరాజ్‌ను రోహిత్‌ మందలించాడు.

'నువ్వు ఏమైనా హీరో అవ్వాలనుకుంటున్నవా' అని సర్ఫరాజ్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. వెంటనే శ్రీకర్‌ భరత్‌ హెల్మెట్‌ తీసుకువచ్చి సర్ఫరాజ్‌కు ఇచ్చాడు.  అయితే రోహిత్‌ సలహానే ఇప్పుడు సర్ఫరాజ్‌ను పెను ప్రమాదం నుంచి తప్పించింది.

ఏమి జరిగిందంటే?
ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 38 ఓవర్‌ వేసిన కుల్దీప్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ షార్ట్ లెగ్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని కుల్దీప్‌.. బ్యాటర్‌ షోయబ్ బషీర్‌కి షార్ట్ బాల్‌ సంధించాడు.

ఈ క్రమంలో బషీర్‌ లెగ్‌ సైడ్‌ బలంగా ఫ్లిక్‌ చేశాడు. వెంటనే బంతి నేరుగా సర్ఫరాజ్‌ హెల్మెట్‌కు వచ్చి తాకింది. అయితే హెల్మెట్‌ ఉండడంతో ఈ ముంబైకర్‌ గాయపడకుండా తప్పించుకున్నాడు. ఒకవేళ హెల్మెట్‌ లేకపోయింటే తీవ్రమైన గాయం అయి ఉండేది. ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement