సర్ఫరాజ్ ఖాన్.. తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో సర్ఫరాజ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
అయితే టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ కాస్త తన సహనాన్ని కోల్పోయాడు. భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ సీరియస్ అయ్యాడు. అయితే సర్ఫరాజ్ అగ్రహానికి కారణం లేకపోలేదు. అస్సలు ఏమి జరిగిందో ఓసారి పరిశీలిద్దాం.
కుల్దీప్ యాదవ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. జైశ్వాల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 తరహాలో బౌండరీలు వర్షం కురిపించాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 94 ఓవర్ వేసిన రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో మూడో బంతిని సర్ఫరాజ్ డీప్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. ఫీల్డర్ దూరంగా ఉండటంతో ఈజీగా రెండు పరుగులు సాధించవచ్చు.
కానీ అప్పటికే 196 పరుగులతో డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న జైశ్వాల్ రెండో పరుగుకు ఆసక్తి చూపలేదు. సర్ఫరాజ్ రెండో పరుగు కోసం పిచ్ సగం వరకు పరిగెత్తినా జైశ్వాల్ నిరాకరించాడు. వెంటనే సర్ఫరాజ్ వెనక్కి పరిగెత్తి నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు చేరుకున్నాడు. దీంతో సర్ఫరాజ్ అసహనం వ్యక్తం చేశాడు. అక్కడ ఈజీగా రెండు పరుగులు తీయవచ్చని జైస్వాల్‌పై అరిచాడు.
ఈ సమయంలో డ్రెసింగ్ రూమ్ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ సైతం జైశ్వాల్ తీరును తప్పుబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో జడేజా తప్పిదానికి సర్ఫరాజ్ రనౌట్ రూపంలో బలైన సంగతి తెలిసిందే. ఇక రాజ్‌కోట్ టెస్టులో 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అదే విధంగా యశస్వీ జైశ్వాల్ సైతం అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.
— Jas Pope (@jas_pope93438) February 18, 2024
Comments
Please login to add a commentAdd a comment