వింబుల్డన్-2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి రౌండ్ ఆఫ్ 16కు (మూడో రౌండ్) చేరుకున్నాడు. ఈ ఇండో-ఆస్ట్రేలియన్ ద్వయం కేవలం 69 నిమిషాల్లోనే ఇంగ్లీష్ జోడీ, వైల్డ్ కార్ట్ ఎంట్రీ అయిన జాకబ్ ఫియర్న్లీ-జోహన్నస్ జోడీపై వరుస సెట్లలో (7-5, 6-3) విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీకి శుభారంభం లభించనప్పటికీ.. ఆతర్వాత బలంగా పుంజుకుంది. ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న ద్వయం.. తదుపరి రౌండ్‌లో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)-రీస్ స్టాల్డర్ (యూఎస్‌ఏ) జోడీతో తలపడనుంది. ప్రస్తుతం వింబుల్డన్‌లో భారత్ తరఫున బోపన్న మాత్రమే బరిలో ఉన్నాడు. ఈ టోర్నీలో బోపన్న 2013, 2015లో అత్యుత్తమంగా సెమీస్ వరకు (డబుల్స్) చేరుకున్నాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన బోపన్న జోడీ
మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న జోడీ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్‌లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది.
పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment