నకిలీ ఐటీ అధికారి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

నకిలీ ఐటీ అధికారి అరెస్ట్‌

Published Fri, Dec 1 2023 1:52 AM

దీప   - Sakshi

కొరుక్కుపేట: ఐటీ అధికారిగా నమ్మించి రూ.లక్ష దోపిడీ చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా హొసూరు, పొదుగైనగర్‌కు చెందిన బాలాజి భార్య శ్రుతిలయ (29). గ్రాడ్యుయేట్‌ అయిన ఈమె రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఆమె పేరుతో ఆడిటింగ్‌ కార్యాలయాన్ని నడపుతున్నారు. ఈక్రమంలో ఓ యువతి బుధవారం రాత్రి ఐటీ అధికారిగా దుస్తులు ధరించి అసోసియేట్స్‌ కార్యాలయానికి వచ్చింది.

ఐటీ కార్యాలయం నుంచి వస్తున్నట్టు శ్రుతిలయకు చెప్పింది. రూ.లక్ష ఇవ్వాలని బెదిరించింది. దీంతో శ్రుతిలయ భయపడి, ఆఫీసులో ఉన్న డబ్బు తీసుకుని మహిళకు ఇచ్చింది. అయితే ఆమె తీరుపై అనుమానం వచ్చిన శ్రుతిలయ ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లో హొసూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వచ్చిన పోలీసులు రంగంలోకి దిగి యువతిని విచారించారు.

డిపార్టుమెంట్‌ కార్యాలయం నుంచి వస్తున్నానని చెప్పిన మహిళ హొసూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఈ–సేవా కేంద్రం నిర్వహిస్తున్న దీప (33)అని, ఐటీ అధికారిగా నటిస్తునట్టు తేలింది. పోలీసులు దీపను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement