Ambedkar Statue Inauguration: Hyd Police Announced Traffic Diversions, Check Details - Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ: రేపు ఏడు గంటలపాటు ట్రాఫిక్‌ డైవర్షన్‌.. ఏయే రూట్‌ మళ్లింపు అంటే.. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఇచ్చిన పోలీసులు

Published Thu, Apr 13 2023 7:15 PM | Last Updated on Thu, Apr 13 2023 7:28 PM

Ambedkar Statue Inauguration: Hyderabad Police Announce Traffic diversions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నగరం వేదిక కానుంది. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా.. అంబేద్కర్‌ మనువడు ప్రకాష్‌ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు ప్రకటించారు హైదరాబాద్‌ పోలీసులు. 

రేపు అంటే ఏప్రిల్‌ 14 శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంత్లాలో ఆంక్షలు అమలు చేయనున్నారు. దీంతో వాహనాల దారి మళ్లింపు ఉండనుంది. నెక్సెస్ రోడ్డు, ఖైరతాబాద్, లకిడీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు అమలు కానున్నాయి. 

  • నెక్లెస్ రోడ్డు - ఎన్టీఆర్ మార్గ్ - తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ
  • పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు
  • సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు
  • లక్డీకాపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు
  • ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లింపు
  •  మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత
  • ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత

ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం. ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని నెటిజన్స్‌కు సూచిస్తున్నారు.  ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement