ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లకు జాతీయ పురస్కారాలు  | National Awards For Two TSRTC Drivers | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లకు జాతీయ పురస్కారాలు 

Published Sun, Feb 26 2023 3:28 AM | Last Updated on Sun, Feb 26 2023 4:25 PM

National Awards For Two TSRTC Drivers - Sakshi

సోమిరెడ్డి, రంగారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఇద్దరు డ్రైవర్లకు జాతీయ పురస్కారాలు దక్కాయి. తమ సర్వీసు కాలంలో ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా బస్సులు నడిపినందుకు రహదారి భద్రత కేటగిరీలో వీరికి ‘హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌’ పురస్కారం దక్కింది.

కుషాయిగూడ డిపోకు చెందిన రంగారెడ్డి, సూర్యాపేట డిపోకు చెందిన సోమిరెడ్డిలకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) పురస్కారాన్ని ప్రకటించింది. ఏప్రిల్‌ 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వీరికి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement