ఉర్సా భూ రచ్చపై సుప్రీంకోర్టు న్యాయవాది కామెంట్స్
Breaking News
నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు
Published on Sat, 04/19/2025 - 16:49
తెలుగులోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఇతడు దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీగా ఉన్నాడు. సినిమాల గురించి పక్కనబెడితే ఇప్పుడు నాన్న కల నెరవేర్చాడు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
తరుణ్ భాస్కర్ తల్లి గీత గురించి ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. ఫిదా, ఈ నగరానికి ఏమైంది, హిట్ 2 తదితర చిత్రాల్లో ఈమె నటించింది. తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చాన్నాళ్ల క్రితమే చనిపోయారు. సొంతిల్లు కట్టుకోవాలనేది ఆయన కల. ఇప్పుడు దాన్ని నెరవేర్చానని చెబుతూ.. గృహ ప్రవేశం చేసిన ఫొటోలని తరుణ్ పోస్ట్ చేశాడు.
'కల నెరవేర్చాను నాన్న, నువ్వు చూస్తున్నావనే అనుకుంటున్నా' అని తరుణ్ భాస్కర్ రాసుకొచ్చాడు. ఇది చూసిన పలువురు నెటిజన్స్.. తరుణ్ భాస్కర్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బాతో కలిసి ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)


Tags : 1