Breaking News

‘ఏం రాహుల్‌.. విషం నింపుతున్నావ్‌’

Published on Wed, 06/16/2021 - 08:19

లక్నో: ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడికి పాల్పడిన ఘటన యూపీని కుదిపేసింది. ఇది మత కోణానికి సంబంధించిన క్రూర ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. మతానికి, మానవత్వానికి ఇది సిగ్గుచేటంటూ స్పందించారు. ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ రాహుల్‌కి స్ట్రాంగ్‌ బదులిచ్చారు. 

‘‘రాముడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు. ఆ పాఠం నీకు తెలియదు. నువ్వు జీవితంలో ఎప్పుడూ నిజాలు మాట్లాడవ్‌. ఈ ఘటనలో పోలీసులు ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా.. నువ్వు అబద్ధపు ప్రచారంతో సొసైటీలో విషం నింపాలని చూస్తున్నావ్‌‌. అధికార దాహంతో మానవత్వాన్ని అవహేళన చేస్తున్నావ్‌. ఉత్తర ప్రదేశ్‌ ప్రజల్ని అవమానించడం ఇకనైనా ఆపేయ్‌’’.. అంటూ ట్విట్టర్‌లో యోగి రాహుల్‌ ట్వీట్‌ ఫొటోకి ఘాటుగానే బదులిచ్చారు.

జూన్‌ 5న లోని ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ సమద్‌ అనే వ్యక్తిని ఓ గ్రూప్‌ ఎత్తుకెళ్లి.. కత్తులతో బెదిరించడం, పాకిస్తాన్‌ స్పై అంటూ తిట్టడం, గడ్డం తీసేసిన ఘటన వైరల్‌ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఇది మతకోణంలోని ఘటన కాదని స్పష్టం చేశారు. ఆ దాడిలో హిందు, ముస్లిం ఇరువర్గాల వాళ్లు ఉన్నారని, తాయెత్తులు అమ్మే సమద్‌ తీరు బెడిసి కొట్టడంతోనే వాళ్లు ఆ దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.  
చదవండి: ఆమె ట్వీట్‌తో ఇరకాటంలో యోగి

Videos

Pahalgam Terror Attack: తాడేపల్లి YSRCP కేంద్ర కార్యాలయంలో క్యాండిల్ ర్యాలీ

KTR: తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్..

వినయ్ మృతదేహం వద్ద బోరున విలపించిన భార్య హిమాన్షి

ఉగ్రదాడికి ప్రతీకారం.. భారత్ భారీ ఆపరేషన్

Asaduddin Owaisi: పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రమూకకు గుణపాఠం చెప్పాలి

నారా లోకేష్ బినామీలు, ఫేక్ కంపెనీలు సృష్టించి భూములు కొట్టేస్తున్నారు

Margani Bharat: కూటమి పాలనలో స్కీమ్ లు కాదు.. స్కామ్‌లు పెరిగాయి

రఘురామ కృష్ణంరాజు పై సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు

Pahalgam Attack: ఎవరీ సైఫుల్లా కసూరి?

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ రియాక్షన్

Photos

+5

SRH Vs MI : ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)

+5

పెద్దమ్మ తల్లి గుడిలో బుల్లితెర జంట దావత్‌.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న విష్ణుప్రియ (ఫోటోలు

+5

నెత్తురోడిన కశ్మీర్‌ మినీ స్విట్జర్లాండ్‌.. చూపు తిప్పుకోనివ్వని పహల్గాం బైసరన్‌ వ్యాలీ ప్రకృతి అందాలు (ఫొటోలు)

+5

'సోదరా' మూవీ హీరోయిన్ ఆరతి గుప్తా (ఫొటోలు)

+5

ప్రేమలు హీరో 'జింఖానా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్‌.. విజయం ఎవరిదో (ఫొటోలు)

+5

హీరోయిన్ ప్రణీత కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)

+5

ఓ ఈవెంట్‌లో సందడి చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంక జైన్‌ (ఫొటోలు)