నిత్యనూతనం... ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ! | Fashion designing industry is a global industry | Sakshi
Sakshi News home page

నిత్యనూతనం... ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ!

Published Sun, Apr 12 2015 1:10 AM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

నిత్యనూతనం... ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ! - Sakshi

నిత్యనూతనం... ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ!

మీరే పారిశ్రామికవేత్త: దుస్తులు ధరించడం నాగరికత. అది అధునాతనంగా రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో వస్త్రాలలో వచ్చినన్ని మార్పులు... బహుశా మరి వేటికీ రావేమో! ఆ కొత్త పోకడల హవాలో గార్మెంట్ మేకింగ్ ఇండస్ట్రీ ఏకంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ పరిశ్రమ ప్రారంభించాలంటే...
 
యంత్రాలు, ఇతర సామగ్రి:
 కుట్టు మిషన్లు (ఇండస్ట్రియల్ మెషీన్లు)- 3(ఒక్కొక్కటి 20 వేల వరకు ఉంటుంది)
 గది - వెయ్యి చదరపు అడుగుల జాగా కావాలి (అద్దె, అడ్వాన్సు వంటి ఖర్చులు ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి)
 కటింగ్ టేబుల్ - 1 (మూడు వేలు)
 కత్తెరలు - 4 (మాస్టర్ సిజర్స్ ఒక్కొక్కటి ఎనిమిది వందలవుతుంది. మామూలు కత్తెర 250కి వస్తుంది)
 మెజరింగ్ టేపు, స్కేళ్లు, బాబిన్స్, దారాలు, ఐరన్‌బాక్సు, ఐరన్ చేయడానికి టేబుల్ వంటి ఇతర సామగ్రి పదివేల లోపు అవుతుంది.
 ఈ వసతులతో ఐదుగురు పని చేసుకోవచ్చు. కాబట్టి పరిశ్రమ స్థాపించిన వారితోపాటు నలుగురు ఉద్యోగులు అనుకుంటే నలుగురికి జీతాలు (ఒక్కొక్కరికి కనీసంగా నెలకు ఐదు వేలు, మాస్టర్‌కి పదివేల రూపాయలు ఉంటుంది). శిక్షణ తీసుకున్న నలుగురైదుగురు కలిసి నిర్వహించునేటప్పుడు ఈ వేతనాల ఖర్చు ఉండదు.  
 
 ముడిసరుకు...
 చొక్కాలు, నైట్‌సూట్, నైటీ, చుడీదార్, లేడీస్ టాప్స్... వంటివి కుట్టడానికి తగిన మెటీరియల్ కొనుక్కోవాలి. సాధారణంగా నైట్‌సూట్స్‌కి, నైటీలకు కాటన్, టాప్స్‌కి జార్జెట్, షిఫాన్ వంటివి ఉపయోగిస్తారు. అలాగే నెట్టెడ్ మెటీరియల్, గుండీలు, లేసుల వంటివి కూడా టోకుగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ చార్మినార్ సమీపంలోని దుకాణాల్లో లభిస్తాయి. ముడిసరుకు కొనుగోలుకు రెండు లక్షలు అనుకుంటే మొత్తం యూనిట్ ప్రారంభించడానికి మూడు - నాలుగు లక్షల ఖర్చవుతుంది.
 ఇదే యూనిట్‌ని భారీ స్థాయిలో 30 ఇండస్ట్రియల్ మెషీన్లతో ప్రారంభించవచ్చు. అప్పుడు పాతిక లక్షలవుతుంది. స్కూలు యూనిఫామ్ వంటి భారీ ఆర్డర్లు తెచ్చుకోగలిగితే సాఫీగా నడిపించవచ్చు. చాలా స్కూళ్లు మెటీరియల్ ఇచ్చి కుట్టించుకుంటాయి కాబట్టి ముడిసరుకు కొనుగోలు శ్రమ తప్పుతుంది.
 మరో మార్గం ఏమిటంటే... ఇంట్లోనే ఉంటూ ఒక సాధారణ కుట్టు మిషన్ (పదివేలకు వస్తుంది)తో వర్క్ చేసుకోవచ్చు. పరిశ్రమ స్థాపించిన వారికి పని చేసి పీస్ లెక్కన డబ్బు తీసుకోవచ్చు.
 యూనిట్ పెట్టాలనుకునే వారికి ఆ రకమైన గైడ్‌లైన్స్ కూడా శిక్షణలోనే ఇస్తాం. ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్ కాబట్టి శిక్షణ తరవాత బ్యాంకు నుంచి రుణాలు పొందడానికి మార్గం సులువవుతుంది.
 శిక్షణలో... బ్లవుజ్, స్కర్టు, టాప్, షర్ట్, నిక్కర్, ఫ్రాక్, సల్వార్ కమీజ్, చుడీదార్‌లు డ్రాఫ్టింగ్, కటింగ్, స్టిచింగ్ నేర్పిస్తారు.
 శిక్షణ కాలం... రెండు నెలలు. రా మెటీరియల్‌ఉచితంగా ఇస్తారు. శిక్షణ తర్వాత పరీక్ష పెట్టి ఉత్తీర్ణులైన వారికి ‘మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్’ నుంచి సర్టిఫికేట్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ కోసం: 1800 123 2388 (ఉ॥10 ॥నుంచి సా॥5 ॥మధ్య), 88866 65895 నంబర్లలో సంప్రదించవచ్చు.
 - ఎలీప్ ఇచ్చిన వివరాలతో...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement