కాంగోలో 60 మంది సజీవ దహనం | 60 Killed, Scores Burnt in DR Congo Road Disaster | Sakshi
Sakshi News home page

కాంగోలో 60 మంది సజీవ దహనం

Published Sun, Oct 7 2018 3:38 AM | Last Updated on Sun, Oct 7 2018 3:38 AM

60 Killed, Scores Burnt in DR Congo Road Disaster - Sakshi

కిన్షాసా: డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో 60 మంది సజీవ దహనమయ్యారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కిన్షాసా– మతాడి ఓడరేవును కలిపే జాతీయ రహదారిపై కిసాంతు నగరం సమీపంలో ఆయిల్‌ ట్యాంకర్, మరో వాహనం ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇతర వాహనాలకు, చుట్టుపక్కల నివాసాలకు అంటుకున్నాయి. అగ్నికీలల్లో చిక్కుకుని దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement