న్యూయార్క్ : టెడ్డీబేర్‌లు అనగానే సాధరణంగా చిన్నపిల్లలు గుర్తొస్తారు. ఎందుకంటే వారే వాటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా అది చూశారో తమకు కావాల్సిందేనని గోల పెడతారు. కానీ, అమెరికాలో ఓ 68 ఏళ్ల మహిళ దగ్గర ఒకటి కాదు రెండు కాదు వేలల్లో టెడ్డీబేర్‌లు ఉన్నాయి. వాటితో ఆమె ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. జాకీ మిల్లే అనే మహిళ తొలిసారి 2000 సంవత్సరంలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఓ టెడ్డీబేర్ బొమ్మను గెలుచుకుంది. అప్పటి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లినా వాటిని కలెక్ట్ చేస్తూ ప్రస్తుతం 8,026 టెడ్డీబేర్‌లను పోగేసింది.
ఇళ్లు మొత్తం వాటితో నింపేసింది. దీంతో ఆమె చేసిన వినూత్న పనిని గుర్తించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు ఆమెను అందులో చేర్చారు. ఈ సందర్భంగా జాకీ మిల్లే మాట్లాడుతూ 'నేను చిన్నపిల్లలా ఉన్నప్పుడు నా వద్ద ఒక్క టెడ్డీ బేర్ కూడా ఉండేది కాదు.. అంతేకాదు అదంటే ఏమిటో కూడా నాకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు తెలియదు. ఒకసారి మాత్రం ఓ బొమ్మను మిన్నెసోటాలో జరిగే కార్యక్రమంలో చూశాను' అంటూ చెప్పుకొచ్చింది. సరదాగా తాను చేసిన పని తనకు గుర్తింపునచ్చిందంటూ మురిసిపోయింది.
కొత్త ప్రపంచ రికార్డు కొట్టేసింది
Published Mon, Oct 2 2017 5:47 PM | Last Updated on Fri, Aug 24 2018 5:25 PM
Advertisement