నీకు నాకు మధ్యలో ఏదో ఉంది | Sakshi
Sakshi News home page

నీకు నాకు మధ్యలో ఏదో ఉంది

Published Mon, Feb 5 2018 2:26 AM

Dalapathi Movie Song Making Neeku Naaku Madhya Edo Undey  - Sakshi

‘‘మనం చాలా పాటలు వింటుంటాం. కొన్ని పాటలు మన చెవుల వరకే పరిమితం అయితే కొన్ని పాటలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. ‘దళపతి’ చిత్రంలో ‘నీకు నాకు మధ్య ఏదో ఉంది’  పాట అలాంటిదే’’ అంటున్నారు సదా. సదా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దళపతి’. కవితా అగర్వాల్‌ హీరోయిన్‌.

‘నీకు నాకు ఏదో ఉంది’ అనే పాట యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌తో సంచలనం చేస్తుండటంతో దర్శకుడు సదా మాట్లాడుతూ – ‘‘ఫాస్ట్‌ బీట్‌ పాటలకు లైఫ్‌ చాలా తక్కువ. మెలోడీ పాటలే ఎక్కువ కాలం శ్రోతల మదిలో మెదులుతాయి. ఈ పాట కూడా ఇలాంటిదే. త్వరలో రానున్న ‘దళపతి’ సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణ. ఈ పాటను కంపోజ్‌ చేసి, పాడిన యాజమాన్యకు, శ్రేయా ఘోషల్‌కు, పాటను రచించిన రాంబాబు గోసాలకు చాలా థ్యాంక్స్‌. ఇంత హిట్‌ అయిన ఈ పాట పేరునే నా నెక్ట్స్‌ సినిమాకు టైటిల్‌గా పెట్టుకుంటాను’’ అని అన్నారు. ఈ సినిమాను బాబురావు పెద్దపుడి నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement