మా జంట బాగుందని మీరే అంటారు! | Our couple is good to yourself! | Sakshi
Sakshi News home page

మా జంట బాగుందని మీరే అంటారు!

Published Fri, Apr 18 2014 11:44 PM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

మా జంట బాగుందని మీరే అంటారు! - Sakshi

మా జంట బాగుందని మీరే అంటారు!

‘‘నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. నేనింకా చిన్నదాన్నే’’ అంటున్నారు తాప్సీ. బ్యాడ్‌మింటన్ ఆటగాడు మథియాస్ బోతో ఆమె ప్రేమలో పడ్డారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే ఊహాగానాలకు ఈ విధంగా సమాధానం చెప్పారు తాప్సీ. ఆ విషయాన్ని అలా ఉంచితే, హిందీలో ఆమె నటించిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వం వహించనున్న ఓ చిత్రంలో కథానాయికగా నటించడానికి ఆమె అంగీకరించిన విషయం తెలిసిందే.

అక్షయ్ వయసు 46 ఏళ్లు. తాప్సీకేమో 26 ఏళ్లు. ఇద్దరి మధ్య ఇరవయ్యేళ్ల వయసు వ్యత్యాసం ఉంది కాబట్టి, అక్షయ్ సరసన చిన్నపిల్లలా కనిపిస్తారేమో? అనే ప్రశ్న తాప్సీ ముందు ఉంచితే - ‘‘సినిమా చూస్తే మా జంట ఎలా ఉంటుందో తెలుస్తుంది. కుర్ర హీరోల సరసన ఒదిగిపోయినట్లుగానే అక్షయ్ సరసన కూడా ఒదిగిపోగలుగుతాను. తనకు సరిజోడీ అనిపించుకుంటాను. సినిమా చూసినవాళ్లు మా జంట బాగుందని కచ్చితంగా అంటారు.
 
దాదాపు ప్రతి సినిమాలోనూ హీరోల పాత్రకు ఉన్నంత నిడివి హీరోయిన్లకు ఉండదు. ఈ సినిమాలో కూడా నా పాత్ర నిడివికన్నా అక్షయ్‌ది ఎక్కువగా ఉండొచ్చు. కానీ, నిడివి గురించి ఆలోచించలేదు. కథానాయికగా కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టే, ఈ సినిమా అంగీకరించాను’’ అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement