Satya Nadella
-
‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
ఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ— Satya Nadella (@satyanadella) February 24, 2025 -
సీఈవో... జీతాలు అదరహో
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్‌బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్‌కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్‌కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్ అమెరికాలోని టాప్–20 సీఈఓల్లో ఒకరు. ఎందుకంత అధిక వేతనాలు? భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్ బాస్ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.భారత్‌లో సగటు నెల వేతనం 10 కోట్లుభారత్‌లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం. -
ఒక్క మ్యాథ్స్ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు (AI) సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. ఏఐకి పునాదుల్లాంటి ఫౌండేషన్ మోడల్స్‌ను సొంతంగా రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఒక్క కొత్త మ్యాథ్స్ సూత్రం, అల్గోరిథంలాంటిది కనుగొన్నా ఏఐ స్వరూపం మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయని నాదెళ్ల పేర్కొన్నారు.కృత్రిమ మేథను ఉపయోగించి, పరిశ్రమల పనితీరును మెరుగుపర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, అధునాతనమైన ఏఐ సిస్టమ్స్ మీద కసరత్తు చేయాలంటే పెట్టుబడుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంటోందని ఆయన చెప్పారు. కానీ పరిశోధనలతో వ్యయాల భారాన్ని తగ్గించుకోవచ్చని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇండియా ఏఐ టూర్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల వివరించారు.ప్రస్తుతం ఓపెన్ఏఐ, గూగుల్‌లాంటి టెక్ దిగ్గజాలు తయారు చేసిన ఏఐ ఇంజిన్లనే (ఫౌండేషన్ మోడల్స్) దేశీయంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కార్యక్రమం సందర్భంగా రైల్‌టెల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా గ్రూప్ మొదలైన సంస్థలతో మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది.ఈ ఒప్పందాల కింద క్లౌడ్, ఏఐ ఆవిష్కరణల ద్వారా ఆయా సంస్థల సిబ్బంది, కస్టమర్లు ప్రయోజనం పొందేందుకు కావాల్సిన తోడ్పాటును మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. అటు దేశీయంగా ఏఐ, కొత్త టెక్నాలజీలను మరింతగా అభివృద్ధి చేసేందుకు, సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియా ఏఐతో కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణఇండియాఏఐతో భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. -
2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్‌స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl— Satya Nadella (@satyanadella) January 6, 2025ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లు!మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు. -
అగ్రగామిగా హైదరాబాద్.. సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐ, జెన్ (జెనరేటివ్) ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ నేపథ్యంలో వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. సీఎం సోమవారం.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై చర్చించారు. రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్తగా మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ వంటి అంశాలను వివరించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను పెంచడంపై రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో టాప్ ఫిఫ్టీకి: సత్య నాదెళ్ల తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని సత్య నాదెళ్ల ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగిన రీతిలో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచే అంశంలో ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహద పడతాయని, హైదరాబాద్‌ను ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి నగరాల జాబితాలో చేర్చుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి సాంకేతిక సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఇక్కడ పది వేల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెట్టామని గుర్తుచేశారు. సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేయండి: శ్రీధర్‌బాబు సీఎం భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సత్య నాదెళ్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఇటీవల కొత్తగా మరో 4వేల ఉద్యోగాల కల్పనకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చందనవెల్లిలో రెండు, మేకగూడ, షాద్‌నగర్‌లో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తంగా 600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల ఏర్పాటును స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించే ఏఐ సిటీలో ‘ఏఐ సాంకేతికత’కు సంబంధించి ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ), ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఏఐ, జెన్ ఏఐ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ: ఈ అంశాలపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెక్ సీఈఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఇదే మొదటిసారి. స్కిల్ యూనివర్సిటీ (Skill University), ఏఐ క్లౌడింగ్ (AI Clouding) కంప్యూటింగ్ వంటి వాటి మీద చర్చలు జరపనున్నారు.రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి.. సత్య నాదెళ్లను కోరనున్నారు. తెలంగాణలో మొత్తం 6 డేటా సెంటర్లను కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్ ద్వారా 4,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఒప్పందాలు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.స్కిల్ యూనివర్సిటీరంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేట్లో స్కిల్ డెవలప్మెంట్ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సుమారు 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ వర్సిటీకి ఆగస్టు 1న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఇదీ చదవండి: ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. ఇందులో మెషీన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐ అండ్ రోబోటిక్స్, ఐవోటీ, ఇండస్ట్రియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటాసైన్స్ అండ్ అనలిస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, 5జీ కనెక్టివిటీ మొదలైన కోర్సులు ఉండనున్నట్లు సమాచారం. -
మైక్రోసాఫ్ట్‌కు, గూగుల్‌కు తేడా అదే..
మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్‌లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల మాటకేమంటారు..?పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్‌కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్‌ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్‌ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్‌కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్కు ఆడబోమంటూ బదులిచ్చారు. -
భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం 2024 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. తనకు అందించే స్టాక్ అవార్డులు ఏకంగా గతంలో కంటే 63 శాతం వృద్ధి చెందాయి. దాంతో తన వేతనం 79.1 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.665 కోట్లు)కు చేరింది. అయితే సంస్థ ద్వారా తనకు బోనస్ రూపంలో అందే వేతనాన్ని మాత్రం తగ్గించాలని కోరడం గమనార్హం.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ దాఖలు చేసిన నివేదిక ప్రకారం..2024 ఆర్థిక సంవత్సరంలో సీఈఓ సత్య నాదెళ్ల మొత్తం పరిహారం సుమారు 79.1 మిలియన్లు (సుమారు రూ.665 కోట్లు)గా ఉంది. ఆయన వేతనం మైక్రోసాఫ్ట్ స్టాక్ పనితీరుతో ముడిపడి ఉంటుంది. తనకు స్టాక్ అవార్డుల రూపంలో కంపెనీ అధికంగా వేతనం చెల్లిస్తుంది. దాంతో కంపెనీ షేర్లు పెరిగితే తన సంపద సైతం అధికమవుతుంది. తనకు కంపెనీ ఇచ్చిన వేతనం వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్టాక్ అవార్డులు: 71,236,392 డాలర్లు (సుమారు రూ.600 కోట్లు)నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్: 52 లక్షల డాలర్లు (సుమారు రూ.44 కోట్లు)మూల వేతనం: 25 లక్షల డాలర్లు (రూ.21 కోట్లకు పైగా)ఇతర అవవెన్స్లతో కూడిన పరిహారం: 1,69,791 డాలర్లు (సుమారు రూ.15 లక్షలు)బోనస్ పెంపు వద్దనుకున్న సత్యజీతం పెరిగినప్పటికీ తనకు అందే కొంత వేతనాన్ని వద్దనుకున్నట్లు కంపెనీ తెలిపింది. అతను తనకు అందే బోనస్ 10.66 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.89 కోట్లు) నుంచి 5.2 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ.43 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో కంపెనీపై తన నిబద్ధతను చాటుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మైక్రోసాఫ్ట్ ఆర్థిక వృద్ధినాదెళ్ల సీఈఓగా నియమితులైనప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వేగంగా వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగి 245.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.20.4 లక్షల కోట్లు) చేరుకుంది. అయితే నికర ఆదాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 88.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.7.3 లక్షల కోట్లు) చేరుకుంది. కంపెనీ వృద్ధితో నాదెళ్ల పరిహారం కూడా అధికమైనట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..కొంతమంది భారతీయ సంతతి సీఈఓల వేతన వివరాలు..సుందర్ పిచాయ్(గూగుల్): దాదాపు రూ.1,846 కోట్లుసత్యనాదెళ్ల(మైక్రోసాఫ్ట్) రూ.665 కోట్లుశంతను నారాయణ్ (అడోబ్): రూ.300 కోట్లుసంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ): రూ.206 కోట్లుఅరవింద్ కృష్ణ (ఐబీఎం): రూ.165 కోట్లు -
కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్మన్తో ముచ్చటించారు. ఈ సందర్భంలో కంపెనీలో నెలకొన్న సమస్య గురించి ప్రస్తావించారు. ఉత్పాదకలో సమస్యలున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు.కరోనా సమయంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అంకితమయ్యారు. మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత రిమోట్ వర్క్ అమల్లోకి వచ్చింది. ఇది ఉత్పాదకలో సమస్యలకు కారణమవుతోంది. కంపెనీలోని మేనేజర్లు 85 శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో 85 శాతం ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు.ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెబుతున్నారు. మేనేజర్లు ఉద్యోగులు పనిచేయలేదు అంటుంటే.. ఉద్యోగులు చేయాల్సిన పనికంటే ఎక్కువ పని చేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి డేటా మరో కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది. దీనిని పరిష్కరించడానికి ఒకటే మార్గం. అదేమిటంటే.. మేనేజర్లు ముందున్న లక్ష్యాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను అర్థం చేసుకోవాలి. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొత్త ప్లాన్స్ వేసుకోవాలి, అవి సాధ్యం కాకపోతే కొత్తవాటిని అమలు చేయాలనీ సత్య నాదెళ్ల అన్నారు.ఇదీ చదవండి: ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్ఎలాంటి సమయంలో అయినా.. ప్రపంచానికి నాయకులు చాలా అవసరమని నేను విశ్వసిస్తున్నానని సత్య నాదెళ్ల అన్నారు. నాయకులు తమ ఉద్యోగులను బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలని వెల్లడించారు. -
క్యూట్ కుర్రాడిగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. అరుదైన ఫొటోలు
-
ఎక్కువ.. తక్కువ.. నిర్ణయాత్మకంగా..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల(57)నేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి’ అనే నియామాన్ని సత్య ఎక్కువగా నమ్ముతారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్‌లో ఆగస్టు 19, 1967లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు రూ.251 లక్షల కోట్లు (3 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు(రూ.8.3 లక్షలు) పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు(రూ.95 లక్షలు) అయ్యేది.బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే సత్యకు పెద్ద సవాలే. ఆయన సీఈఓ అవ్వడానికంటే 22 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. దాంతో చాలామంది సత్య సుధీర్ఘ ప్రస్థానంలో సాధించలేనిది సీఈఓగా బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. నాదెళ్ల చేసే ప్రతి పనిని గత సీఈఓల పనితీరుతో పోల్చేవారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దాంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వచ్చే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!పేరు: సత్య నారాయణ నాదెళ్లతండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్తల్లి: ప్రభావతిభార్య: అనుపమ నాదెళ్లపిల్లలు: 3కుమారుడు: జైన్ నాదెళ్లకుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్లజన్మస్థలం: హైదరాబాద్వయసు: 57 (2024)జాతీయత: భారతీయుడుపౌరసత్వం: యూఎస్ఏచదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీవృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
విండోస్‌లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్‌స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్‌స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్‌లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్‌లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్‌అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్‌లను బ్యాకప్ చేశాం. విండోస్‌లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్‌సైట్‌ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
ఇదో డిఫరెంట్ ఇంటెలిజెన్స్.. 'ఏఐ'పై సత్యనాదెళ్ళ
టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టింస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ఆ పదమే నచ్చదని అన్నారు. దీనికి ఓ కొత్త పేరు కూడా ప్రతిపాదించారు. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే, దాన్ని మనుషులతో పోల్చడం సరికాదని అన్నారు.1950లలో పుట్టుకొచ్చిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే పదం పట్ల సత్య నాదెళ్ల అయిష్టతను వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన పేర్లలో ఒకటి 'కృత్రిమ మేధస్సు' అని నేను అనుకుంటున్నాను, మనం దానిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని పిలువవచ్చు. ఎందుకంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది, కాబట్టి ఏఐ అవసరం లేదని సత్య నాదెళ్ల అన్నారు.టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ మేధస్సుకు సరికాదు. ఎందుకంటే మనిషికి అపారమైన తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలామంది మనిషి సృష్టించినదాన్ని మనిషి కంటే గొప్పదని అనుకుంటున్నారు. ఏఐ కేవలం ఒక టూల్ మాత్రమే. ఇలాంటి టెక్నాలజీలు భవిష్యత్తులో లెక్కకు మించి రావొచ్చు. ఆ ఘనత మొత్తం మనిషికే చెందుతుంది. ఎందుకంటే వాటిని రూపొంచేది మనిషే కాబట్టి.ఏఐ ఇలా పనికొస్తుందిఏఐ మానవ పరిభాషలో కావలసిన విషయాలను వెల్లడిస్తుందని అంగీకరించారు. సాఫ్ట్వేర్ పనితీరును వివరించడానికి "లెర్నింగ్" వంటి సాపేక్ష పదాలను ఉపయోగించి సాఫ్ట్వేర్ వెనుక ఉన్న అల్గారిథమ్‌లను అర్థం చేసుకోవడానికి ప్రజలు మార్గాలను అన్వేషిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏఐ మరింత బలపడే అవకాశం ఉందన్నారు. -
సత్య నాదెళ్ల సక్సెస్ అయింది ఇలాగేనా..?
మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా యాపిల్‌ను అధిగమించేలా మైక్రోసాఫ్ట్‌ను సత్య నాదెళ్ల విజయవంతంగా నడిపించారని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.తనను విజయపథంలో నడపడానికి దోహదపడిన అంశాల గురించి సత్య నాదెళ్ల పలు సందార్భాల్లో వెల్లడించారు. వాటిలో 10 మేనేజ్మెంట్, కెరీర్ టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం..ఏదీ లేనప్పుడు స్పష్టతను సృష్టించగలగడం ఏ నాయకుడికైనా ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం.విషయాలు ఎల్లప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కాబట్టి మన చుట్టూ శక్తిని సృష్టించుకునే నైపుణ్యాలను పెంచుకోవాలి.నాయకుడనే వాడు మితిమీరిన నియంత్రిత ప్రదేశంలోనూ విజయాన్ని సృష్టించగలగాలి.ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. సమయం వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి.విధుల్లో మానసిక భద్రతను పెంపొందించడంలో తాను పెద్దవాడినని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ప్రశ్నలు అడిగినందుకు, ఆందోళనలను పంచుకున్నందుకు లేదా తప్పులు చేసినందుకు ఉద్యోగులు శిక్షకు భయపడని వాతావరణాన్ని సృష్టిస్తుంది.సత్య నాదెళ్ల సహానుభూతిని మృదువైన నైపుణ్యంగా పరిగణించరు. వాస్తవానికి ఇది మనం నేర్చుకునే కఠినమైన నైపుణ్యమని ఆయన నమ్ముతారు.ఎవరూ "పరిపూర్ణ" నాయకుడు కారు. కానీ వారు తమ ఉద్యోగులకు మరింత స్పష్టత, శక్తి లేదా స్వేచ్ఛను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించే వారు ఎల్లప్పుడూ మెరుగుపడతారు.మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి. మీ ప్రస్తుత బాధ్యతల నుంచి నేర్చుకుంటూ ఉండండి. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు సీఈవో అవుతానని సత్య నాదెళ్ల ఎప్పుడూ అనుకోలేదు. తనకు ఇచ్చిన ఏ పాత్రలోనైనా రాణించడంపైనే దృష్టి పెట్టారు.అడాప్టబుల్గా ఉండండి. మైక్రోసాఫ్ట్ లో పనిచేసినంత కాలం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తాను పనిచేసిన బృందాలు, తాను నిర్వహించిన విభాగాలను బట్టి నిరంతరం మారాల్సి వచ్చిందని సత్య నాదెళ్ల చెప్పారు.మీ లక్ష్యం.. మిమ్మల్ని నడిపించేది ఏమిటో తెలుసుకోండి. మనం ఉద్యోగాలలో ఎక్కువ సమయం గడుపుతున్నందున, పనికి లోతైన అర్థం గురించి ఆలోచించడం అవసరం. -
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్‌డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
‘భళా భారత్’.. జపాన్ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం
భారత్ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్ టెక్ కంపెనీ కోఫౌండర్ ఫిదా అయ్యారు. భారత్ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్‌లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు. ఆశ్చర్యపోయా‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లు.. వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల విజయాల్ని ఉదహరించారు. భారత్ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్‌ను కొనియాడుతూ పోస్ట్ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్‌పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
రూ.14వేలకోట్లతో డేటా సెంటర్లు ప్రారంభం.. ఎక్కడంటే..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇండోనేషియా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి 1.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటాంచారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్‌ఫ్లడ్‌తో సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలుగ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీ చేసిన పరిశోధనలో 2030 నాటికి ఆగ్నేయాసియా జీడీపీలో ఏఐ ద్వారా 1 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ దృష్టి సారిస్తోందని టిమ్ చెప్పారు. -
టైమ్స్ జాబితాలో 'సత్య నాదెళ్ల'కు చోటు
ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు మెరుగైన సేవలిందించేందుకు కృషిచేస్తోంది. సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరితో పదేళ్లు ముగిసింది. ఈ కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఈ సమయంలో ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీపై ఆధారపడటాన్ని తగ్గించారు. ఇదీ చదవండి: గూగుల్‌లో రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: ముగ్గురు కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, బిలియనీర్ భార్య, కానీ బిడ్డలు మాత్రం.. ఎవరీమె?
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, హైదరాబాద్‌లోనే చదువుకుంది. టెక్ దిగ్గజం భార్య. భర్తకు 450 కోట్ల జీతం. ఆమె స్వయంగా ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్. అయినప్పటికీ, ఉద్యోగంలో రాణించేందుకు అన్ని అర్హతులున్నా పిల్లలు, భర్త కోసం ఇంటికే పరిమితమైంది. వారి బాధ్యతలే ప్రధానంగా భావించింది. ఇంతకీ ఎవరీమె? తెలుసుకుందాం రండి! అమె మరెవ్వరో కాదు ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ప్రియదర్శిని నాదెళ్ల. అనుగా పాపులర్ అయిన ఈమె.. ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కుమార్తె. అనుపమ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సత్య నాదెళ్ల తండ్రి, అనుపమ తండ్రి కేఆర్ వేణుగోపాల్ ఇద్దరూ బ్యాచ్‌మేట్స్. వీరిద్దరి స్నేహం వియ్యానికి దారి తీసింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరిన ఏడాదిలోనే (1992)అనుపమ నాదెళ్లను వివాహం చేసుకున్నారు. పెళ్లి నాటికే సత్యనాదెళ్ల అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. అయినా అనుపమ వీసా దరఖాస్తును యుఎస్ తిరస్కరించింది. దీంతో పర్యాటక వీసాతో కొంతకాలం కలసి ఉండాల్చి వచ్చింది. అయితే అనుపమను అమెరికా తీసుకెళ్లేందుకు, ఇమ్మిగ్రేషన్ వ్యవహరాలను సులభంగా పూర్తి చేసుకుందుకుగాను గ్రీన్ కార్డును వదులుకొని, తిరిగి హెచ్-1బీ వీసా తీసుకున్నారు. చివరికి ఇద్దరూ అక్కడ శాశ్వత నివాసితులయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. బిడ్డల కోసం అత్యసవరస్థితిలో సిజేరియన్ ద్వారా తొలి చూరు కాన్పులో మగబిడ్డ జైన్‌కు జన్మనిచ్చింది. కానీ ఈ దంపతుల సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. గర్భాశయ శ్వాసలోపం కారణంగా శిశువుగా ఎదగలేదు, తీవరమైన సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ క్వాడ్రిప్లెజియాతో జైన్ బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. తరువాత ఇద్దరు కుమార్తెలు తారా,దివ్య పుట్టారు. వీరిలో కూడా ఒకరి లెర్నింగ్ సమస్యలు తలెత్తాయి. దీంతో బిడ్డల కోసం ఆర్కిటెక్ట్‌గా తన కెరీర్ నుండి తప్పుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అనుపమ నాదెళ్ల సానుకూలంగా తీర్చిదిద్దుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2022లో 26 ఏళ్ల కుమారుడు జైన్ మరణం వారి జీవితాల్లో పెద్ద విషాదం. అప్పటినుంచి ఆమె సీటెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భాగస్వామ్యంతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించారు. అంతేకాదు భర్త సత్యకు దీర్ఘకాల భాగస్వామిగా, నాదెళ్ల కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డారు. సమస్యలతో ఉన్న బిడ్డల్ని సాదుకుంటూ, వారిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వారి అభివృద్ధికి కృషి చేశారు. మైక్రోసాఫ్ట్ బిలియనీర్ సీఈవో భార్యగా ప్రపంచంలోనే అత్యత్తుమ కంపెనీ సీఈవో భార్యగా భర్తకు వెన్నంటి ఉంటూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ జనవరి 11న 2.87 ట్రిలియన్లడాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2024 ఫిబ్రవరి నాటికి సత్య నాదెళ్ల నికర విలువ 974 మిలియన్ డాలర్లు. కాగా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతు కూలీలను ఆదుకునేందుకు అనుపమ పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం కేంద్రంగా నడుస్తోన్న యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేసిన సంగతి తెలిసిందే. -
మస్క్, జుకర్‌బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత..
చెన్నైలో పుట్టి అమెరికాలోని అగ్ర కంపెనీలలో పనిచేసిన 'శ్రీరామ్ కృష్ణన్' ఇటీవల యూఏఈలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఫేస్బుక్ సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్', మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల', ఎక్స్ (ట్విటర్) అధినేత 'ఇలాన్ మస్క్'తో సహా టాప్ సిఇఓలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. యుక్త వయసులోనే కోడింగ్ నేర్చుకున్నట్లు, అదే తనను టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసిందని శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు. 2007లో మైక్రోసాఫ్ట్‌లో చేరి కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశారు, అప్పటికే సత్య నాదెళ్ల సీఈఓ కాలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన తరువాత ఫేస్బుక్లో చేరి 'మార్క్ జుకర్‌బర్గ్'తో కూడా కలిసి పనిచేశారు. ఇలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసిన సమయంలో శ్రీరామ్ అక్కడే పనిచేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాన్ మస్క్, జుకర్‌బర్గ్‌లు చిన్న చిన్న విషయాలను సైతం వారే చూసుకుంటారని, ఇతరులకు అప్పగించరని చెబుతూ.. మెటా సీఈఓ ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఒక ప్రాజెక్టు తీసుకున్న తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కంటే ఆయనే ఎక్కువ తెలుసుకుంటారని శ్రీరామ్ చెప్పారు. నా భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం మెటాలో పనిచేసింది, జుకర్‌బర్గ్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని ఆమె నాకు చెప్పిందని అన్నారు. ఇలాన్ మస్క్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లు ఎక్కువ సమయంలో ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేయడానికి సమయం కేటాయించరని, ఆయనతో నేను ఉన్నప్పుడు 95 శాతం మీటింగులు జూనియర్ ఇంజనీర్లతో జరిగాయని తెలిపారు. ఆయన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారని అన్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు! -
సత్య నాదెళ్ల జీతం ఆస్తులు ఎంతో తెలుసా..?
-
Generative AI: ఏఐలో అమెరికాను ఢీకొట్టేది భారతీయులే..!
ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో భారతీయుల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలోని పలు టెక్నాలజీ దిగ్గజాలకు అధితులుగా భారతీయులే ఉండి నడిపిస్తున్నారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడంలో ఇండియన్ డెవలపర్ కమ్యూనిటీ కీలక పాత్రను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఈ టెక్నాలజీతోనే ముడిపడింది. జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లు ఇప్పటికే అనేకం వస్తున్నాయి. వీటిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ముఖ్యంగా ఉత్పాదక ఏఐ ప్రాజెక్ట్‌ల్లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు భారత డెవలపర్లు గట్టి పోటీ ఇస్తున్నారు. 2027 నాటికల్లా.. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని సాఫ్ట్వేర్ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ అయిన గిట్‌హబ్ (GitHub)లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. 1.32 కోట్ల మంది డెవలపర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. 2027 నాటికి గిట్‌హబ్‌లో భారత్ అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అమెరికాను అధిగమిస్తుందని భావిస్తున్నారు. గిట్‌హబ్‌లో అత్యధిక సంఖ్యలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కార్యకలాపాలు, పనితీరును తరువాతి తరం ఏఐ పూర్తిగా మార్చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత డెవలపర్ కమ్యూనిటీ మన టెక్నాలజీ, టూల్స్‌తో భారత్‌తోపాటు ప్రపంచ భవిష్యత్తు కోసం కృషి చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
భారత్‌లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్‌లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్‌కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
Microsoft: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. శ్రామికశక్తి అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలను పెంపొందించడం అనేది ఒక సంస్థ చేయగలిగే అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నాదెళ్ల భారత్‌లో అడుగుపెట్టారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం సాంకేతికత వృద్ధిని సమానంగా పంపిణీ చేయగలదని అన్నారు. శక్తివంతమైన సాధారణ ప్రయోజన సాంకేతికతగా ఏఐని పేర్కొన్న ఆయన.. ఏఐ నిబంధనల విషయంలో ఏకాభిప్రాయం బహుపాక్షిక స్థాయిలలో కూడా చాలా అవసరమని నాదెళ్ల తెలిపారు. జీడీపీ వృద్ధిలో ఏఐ.. సాంకేతికత వేగంగా విస్తరించడం వల్ల ఆర్థిక వృద్ధిలో సమాన పంపిణీకి సహాయపడుతుందని సత్య నాదెళ్ల అన్నారు. జీడీపీ వృద్ధిని పెంచడంలో ఏఐ సహాయపడుతుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యధిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో ఏఐ జీడీపీ 500 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న మినిస్ట్రీ ఆఫ్ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ కూడా గ్రిడ్ స్థిరత్వంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను తాను కలిశానని, ఎయిర్ ఇండియా ఏఐ వినియోగాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఐటీసీ, అరవింద్, లాభాపేక్ష లేని ఇతర భారతీయ సంస్థలు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలు అనేక సంస్థాగత కార్యక్రమాల కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నాయని నాదెళ్ల వివరించారు. -
నాదెళ్ల పదేళ్ల ప్రయాణం..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఆయన బాధ్యతలు ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకున్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ కూడా శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఐటీ పరిశ్రమ ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయానికి బదులుగా సంస్కరణలను నమ్ముతుంది. అందులో భాగంగా పరిశోధనలను అందిపుచ్చుకుంటుదని సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు సత్య మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో తెలిపారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికే 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా కంపెనీలోనే ఉన్నారు కదా..కొత్తగా ఏమి ఆవిష్కరిస్తారని చాలామంది అనుమానించారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు సీఈఓ కావడం అంటే పెద్ద సవాలే. సత్య నాదెళ్ల చేసే ప్రతి పనిని, ప్రతి కదలికను ఆ ఇద్దరితో పోలుస్తారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్‌తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బి.డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అంతర్గతంగా ఉత్తమ ఫలితాలు సాధించడం కంటే, ప్రజలు-పరిశ్రమలో బ్రాండ్ బిల్డింగ్ వైపు మైక్రోసాఫ్ట్ ఎక్కువగా మొగ్గుచూపేది. ఆ వైఖరిని ఆయన పూర్తిగా మార్చారు. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: 3 కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
డీప్‌ఫేక్ ఆందోళనకరం
వాషింగ్టన్: ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దురి్వనియోగం చేస్తూ కృత్రిమ మేథ(ఏఐ)తో సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోల ధోరణి అత్యంత భయంకరమైనదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ నకిలీ అసభ్య ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రముఖుల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల సృష్టి, వ్యాప్తికి అడ్డుకట్ట పడాల్సిందే. ప్రభుత్వాల, సోషల్‌మీడియా సంస్థల తక్షణ స్పందన అవసరం. సురక్షితమైన, వాస్తవిక సమాచారం మాత్రమే ఆన్లైన్లో లభించేలా సాంకేతికతను, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు నిబంధనలను సవరించి కట్టుదిట్టంచేయాలి. ఇది మనందరి బాధ్యత’’ అని అన్నారు. -
త్వరలో భారత పర్యటన..మోదీతో భేటీ కానున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7, 8 రెండు రోజుల పర్యటనలో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు, ఈ టెక్నాలజీ వినియోగంతో వచ్చే అవకాశాల గురించి మాట్లాడనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు ఈ రెండు రోజుల పర్యటనలో సత్యనాదెళ్ల ఏఐ గురించి ఏం మాట్లాడుతారా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వెలుగులోకి వచ్చిన మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చాందక్ ఇంటర్నల్ మెయిల్స్ ఆధారంగా ‘మైక్రోసాఫ్ట్ భారత్‌లో ఆయా టెక్నాలజీల వినియోగం, అవకాశాల్ని మరింత విస్తరించనుందని’ తెలుస్తోంది. సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ 2023లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెక్ దిగ్గజ కంపెనీలైన యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోస్టాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఆ భేటీలో భారత్ టెక్నాలజీ వినియోగం, అవకాశాల గురించి సీఈఓలతో మోదీ మాట్లాడారు. ఆ చర్చలకు కొనసాగింపుగా.. భారత్‌లో పర్యటించనున్న సత్యనాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ అవుతారంటూ మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన స్టేట్మెంట్లో తెలిపింది. వీరిరువురి భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశ సామర్థ్యాల గురించి చర్చకు వస్తాయని పేర్కొంది. టెక్నాలజీలో భారత్ భళా ‘భారతీయుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడే టెక్నాలజీలలో కృత్రిమ మేధస్సు ఒకటి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన డెవలపర్, స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థలకు నిలయం. మైక్రోసాఫ్ట్ భారతీయ సాంకేతికత వృద్ధికి కట్టుబడి ఉంది. ఇది భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లను ప్రభావితం చేస్తుంది’ మైక్రోసాఫ్ట్ ప్రకటనలో హైలెట్ చేసింది. ఏడాది క్రితం భారత్‌లో పర్యటన ఏడాది క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల భారత్‌లో నాలుగు రోజుల అధికారిక పర్యటన చేశారు. తన పర్యటనలో కస్టమర్లు, స్టార్టప్‌లు, డెవలపర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులను కలిశారు. భవిష్ అగర్వాల్ సైతం పలు నివేదికల ప్రకారం.. భారత్ పర్యటకు రానున్న సత్యనాదెళ్లతో ముంబై, బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్స్ ఫౌండర్లు ఆయనతో భేటీ కానున్నారు. వారిలో సర్వం ఏఐ సంస్థ అధినేతలు, ఏఐ స్టార్టప్ కృత్తిమ్ ఫౌండర్ భవిష్ అగర్వాల్‌లు ఉన్నట్లు సమాచారం. -
ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
ఆస్ట్రేలియాను ఇపుడు కొంటారా? సత్య నాదెళ్ల షాకింగ్ స్పందన
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు పలు వేదికల మీద ప్రకటించారు. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ, తనకు టీం కృషిని, నాయకత్వాన్ని నేర్పిందని, అది కార్పొరేట్ ప్రపంచంలో కీలక మలుపులను అధిగమించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను, అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ చూశాంటూ ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఫైనల్లో ఇండియా ఓటమి కోట్లాదిమంది అభిమానులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా టైటిల్ చేజార్చుకున్న రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కృషిని ప్రశంసించిన నాదెళ్ల కప్ గెలుచుకున్న ఆసీస్‌ను అభినందించారు. అలాగే అయితే తాజాగా ఒక పోడ్కాస్ట్లో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కారా స్విషర్ పోడ్కాస్ట్లో మాట్లాడిన సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశం ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అని కారా సరదాగా ప్రశ్నించాడు. దీనికి నాదెళ్ల మాట్లాడుతూ ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదు. అయితే ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే చాట్‌జీపీటీ సృష్టికర్త శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పరిశోధనా సంస్థ OpenAI, సామ్ ఆల్ట్‌మన్‌ను ఆకస్మికంగా తొలగించింది. దీంతో ఆల్ట్మాన్ ఆహ్వానం పలికిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని, అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను ముందుండి నడిపిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరో కీలక పరిణామం, ‘ఓపెన్ఏఐ’లోకే శామ్ ఆల్ట్‌మన్?
ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో పనిచేయడం కంటే శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ఏఐకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఓపెన్ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ని తొలగించడం.. ఆ తర్వాత ఆయన భవితవ్యంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఓపెన్ఏఐలో ఆల్ట్‌మన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. నేను అతనిమీద, అతని నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాను. కాబట్టే మేం అతనిని మైక్రోసాఫ్ట్‌లోకి స్వాగతించాలనుకుంటున్నాము’ అని సత్యనాదెళ్ల ఇంటర్వ్యూలో చెప్పారు. ఆల్ట్‌మన్ తమ కంపెనీ కొత్త ఏఐ రీసెర్చ్ బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ సైతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. అయితే, ఓపెన్ఏఐలోని పెట్టుబడి దారులు శామ్ ఆల్ట్‌మన్‌ని సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో శామ్ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో చేరడం కంటే, తిరిగి ఓపెన్ఏఐకి వెళితే బాగుండేదన్న సంకేతాలిచ్చారు సత్యనాదెళ్ల. మరి ఈ వరుస పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్ఏఐకి ఎదురు దెబ్బ! -
అప్పుడు షాక్‌కి గురయ్యా..! ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) 2014లో సీఈఓ అవుతానని తెలిసినప్పుడు ఎలా అనిపించిందో ఇటీవల బెర్లిన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు అందుకున్న సత్య నాదెళ్ల తన కెరీర్ గురించి, నాయకత్వం గురించి చాలా విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైక్రోసాఫ్ట్‌లో స్టీవ్ బాల్మెర్ కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుసుకుని షాక్‌కి గురైనట్లు, ఆ తరువాత మైక్రోసాఫ్ట్ బోర్డు సీఈఓ పదవికి ఎంపికైన నలుగురు టాప్ అభ్యర్థుల్లో నాదెళ్ల కూడా ఉన్నట్లు తెలిపాడు. బోర్డు సభ్యులలో ఒకరు నన్ను మీరు CEO అవ్వాలనుకుంటున్నారా? అని అడిగిన విషయం స్పష్టంగా గుర్తుందని.. నేను ఎప్పుడూ సీఈఓ కావాలనుకునే విషయం గురించి ఆలోచించలేదని, అయితే నా మీద నమ్మకంతో సీఈఓ బాధ్యతలు అప్పగించారని వివరించారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇంజినీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం కలిగిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని బిల్ గేట్స్ ప్రకటించాడు. ఆ తరువాత సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. 1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి నాయకత్వం వహించిన ముగ్గురు వ్యక్తులలో తెలుగు తేజం సత్య నాదెళ్ల ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. అంతకు ముందు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహించారు. -
గూగుల్ - యాపిల్ మధ్య భారీ డీల్.. సత్యనాదెళ్ల పోరాటం ఫలించేనా?
ఆన్లైన్ సెర్చింగ్ విభాగంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యాంటీ ట్రస్ట్ కేసుల్ని ఎదుర్కొంటుంది. ఇతర సంస్థల్ని ఎదగనీయకుండా గూగుల్ గుత్తాదిపత్యం వహిస్తుందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతుంది. ఓ వైపు ఆ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుండగా.. ఐఫోన్లలో డీపాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండేలా గూగుల్ మరో టెక్ దిగ్గజం యాపిల్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? యాపిల్ వెబ్‌బ్రౌజర్ సఫారీలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్ ఉంచేందుకు గాను గూగుల్ యాజమాన్యం 10 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్ల మధ్య చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఆ డీల్ విలువ 18 బిలియన్ డాలర్లు అంటూ ఓ నివేదికను విడుదల చేసింది. 2021లో గూగుల్ ఈ మొత్తాన్ని యాపిల్‌కు చెల్లించిందని స్పష్టం చేసింది. స్పాట్‌లైట్‌తో పాటు సఫారీలో సైతం రెండు దిగ్గజ టెక్ కంపెనీల మధ్య ఒప్పందం పూర్తయితే.. యాపిల్ సంస్థ తయారు చేసే ఐమాక్లలో స్పాట్లైట్ అనే ఫీచర్ ఉంది. ఆ ఫీచర్లో గూగుల్ సెర్చింజన్ ఆప్షన్ కనిపించడంతో పాటు, మనం ఏదైనా సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో.. అలాంటి ఫలితాలే యాపిల్ బ్రౌజర్ సఫారీ యూజర్లకు కనిపిస్తాయి. యాపిల్ భయపడుతోంది ఐఫోన్ల కోసం తన సొంత వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా స్పాట్లైట్ వినియోగాన్ని తగ్గించే మార్గాల్ని గూగుల్ అన్వేషిస్తుంది. యాపిల్ సఫారీ బ్రౌజర్‌కి బదులు ఐఫోన్ యూజర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను వినియోగించేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తుంది. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల న్యూయార్క్ టైమ్స్(nyc)తో మరో విధంగా స్పందించారు. గూగుల్ తన సెర్చ్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై యాపిల్ ఆందోళన వ్యక్తం చేస్తుందని అన్నారు. యాపిల్ యూజర్లు గూగుల్ క్రోమ్‌ని వినియోగించేలా గూగుల్ జీమెయిల్‌తో పాటు ఇతర సేవల్ని ఉపయోగించడంపై యాపిల్ భయపడుతుందని అర్ధం వచ్చేలా నాదెళ్ల వ్యాఖ్యలు చేశారు. మేం 15 బిలియన్ డాలర్లు చెల్లిస్తాం మేము (మైక్రోసాఫ్ట్) సైతం యాపిల్ డివైజ్‌లలో డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు సత్యనాదెళ్ల తెలిపారు. కానీ భారీ మొత్తంలో చెల్లించేందుకు తాము సంసిద్ధంగా లేమని న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాపిల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా మారేందుకు మైక్రోసాఫ్ట్ 15 బిలియన్ల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉందని న్యూ యార్క్ టైమ్స్ నివేదిక హైలెట్ చేసింది. గూగుల్ పై సత్యనాదెళ్ల న్యాయపోరాటం ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? గూగుల్ - యాపిల్ మధ్య జరిగిన ఈ ఒప్పందం గతంలో యాపిల్- మైక్రోసాఫ్ట్‌ల మధ్య జరిగింది. కానీ గూగుల్ తన గుత్తాధిపత్యంతో మైక్రోసాఫ్ట్‌ను వద్దనుకుని తనతో పనిచేసేలా పావులు కదిపింది. చివరికి అనుకున్నది సాధించింది. మైక్రోసాఫ్ట్‌ను వద్దనుకున్న యాపిల్ .. గూగుల్‌తో జతకట్టింది. ఇప్పుడు ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల యూఎస్‌లోని ఓ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం, గూగుల్ మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. సెర్చింజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని సత్య నాదెళ్ల ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ,గూగుల్‌పై సత్యనాదెళ్ల చేస్తున్న న్యాయ పోరాటం ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి. చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు! -
నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్ఫోన్లో కంప్యూటర్ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ మొబైల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు. 2014లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లను విండోస్‌కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. -
‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!
ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గణనీయమైన లాభాల్ని సాధించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ స్టాక్స్ సరికొత్తగా ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్ల వద్దకు చేరుకుంది. కానీ ఉద్యోగులే జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈవో సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ సాధించిన ఫలితాలపై సత్య నాదెళ్ల ఉద్యోగులకు ఇంటర్నల్ మెసేజ్ పంపించారు. అందులో ఈ ఏడాదిలో ఉద్యోగుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థ సాధించిన ఫలితాలకు ఉద్యోగుల వినూత్నం, సృజనాత్మకత వల్లే సాధ్యమైందని కొనియాడారు. క్లయింట్లను, భాగస్వాములను సైతం అభినందనలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది సైతం మెరుగైన ఫలితాలు సాధించేలా కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని అధిగమించేలా అందరూ బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. థ్యాంక్యూ నోట్‌పై అసహనం సత్యనాదెళ్ల పంపిన ఈ ఇంటర్నల్ మెసేజ్‌ను 2లక్షల మందికి పైగా వీక్షించే అవకాశం ఉంది. అయితే, సీఈవో తమకి అభినందనలు తెలపడంపై 130కి మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించారు. మరికొంత మంది సీఈవో థ్యూంక్యూ నోట్‌పై అసహనం వ్యక్తం చేశారు. కృతజ్ఞతలు తెలపడం అంటే ఇలాగేనా ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపడం అంటే జీతాలు పెంచకుండా ఉండటం కాదని ఓ ఉద్యోగి అంటుంటే..సంస్థ గడించిన లాభాల గురించి మాట్లాడుతూ.. జీతాలు పెంచకుండా అడ్డుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులపై సదరు ఉద్యోగి విమర్శలు గుప్పించారు. కంపెనీ, ఉన్నతస్థాయి ఉద్యోగులు రికార్డ్ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నప్పుడు ఉద్యోగులు మాత్రం వేతనాల కోతను ఎదుర్కొంటున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఇది సరికాదు, వేరే మార్గం లేదా? అని ప్రశ్నించారు. సంస్థను నమ్ముకుంటే మిగిలేది ఇదే.. పెరగకుండా స్తబ్దుగా ఉన్న వేతనాల గురించి ప్రస్తావిస్తూ మండిపోతున్న ధరలు.. పెరిగిపోతున్న ఖర్చులతో అల్లాడుతుంటే సంస్థ భారీ లాభాల్ని మూటగట్టుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ పట్ల అంకితభావంతో ఉన్నప్పటికీ తమకు పెరగాల్సి జీతాలు పెరగలేదని అన్నారు. ‘రికార్డు లాభాలు ఎక్కడ నుండి వస్తాయని ఆశ్చర్యపోతున్నాను? ఇక్కడ (ఆఫీస్‌లో) అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి కష్టపడి పనిచేసినందుకు నాకు ఎలాంటి ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు మరో ఉద్యోగి. జాబ్‌కు రిజైన్ చేస్తాం.. సత్యనాదెళ్ల పంపిన థ్యాంక్యూ మెసేజ్‌పై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేయడంపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం సందిగ్ధంలో పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఉద్యోగుల మధ్య జరిగిన ఇంటర్నల్ పోల్ సంభాషణల్లో ఎక్కువ మంది..తాము కోరుకున్న ఉద్యోగం దొరికితే..మైక్రోసాఫ్ట్‌ను వదిలివెళ్లేందుకు సిద్ధపడ్డట్లు నివేదికలు హైలెట్ చేశాయి. అయితే, ఉద్యోగుల అసంతృప్తి, రిజైన్ల అంశంపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి👉 ‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’ -
ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రముఖ గేమ్ క్యాండీ క్రష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చాలా మందిలాగే క్యాండీ క్యాష్ ఆడతానని వెల్లడించారు. ఇటీవల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంస్ ధోని విమానంలో ఆడుతున్న వీడియో నెట్టింట్ వైరల్ కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం, యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేమిటంటే క్యాండీ క్రష్ గేమ్ గురించి అభిప్రాయం ఏమిటని సత్య నాదెళ్లను న్యాయమూర్తి అడిగారు. దీనికి స్పందించిన నాదెళ్ల ధోనీలాగానే తాను కూడా ఈ గేమ్‌ను ఆస్వాదిస్తానని, దీంతో పాటు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటానని చెప్పారు. దీంతోపాటు కన్సోల్ గేమ్స్, పీసీ గేమ్స్ అంటే ఇష్టమని, ప్రత్యేకంగా మొబైల్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని నాదెళ్ల చెప్పుకొచ్చారు. దీంతో కోర్టు హాలులో నవ్వుల పువ్వులు పూసాయి. (ఆధార్-ఫ్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) వరల్డ్ వైడ్‌గా క్యాండీ క్రష్ గేమ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గత కొన్నేళ్లుగా ఈ సాగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల ధోనీ క్యాండీ క్రష్ దెబ్బకి కేవలం మూడే మూడు గంటల్లోనే మూడున్నర లక్షలమంది డౌన్ లోడ్స్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వైరల్ వీడియోలో, ఇండిగో ఎయిర్ హోస్టెస్ ధోనీకి విమానంలో చాక్లెట్లు, స్వీట్లను అందించడం, ధోనీ సీరియస్‌గా గేమ్‌లో మునిగి పోవడం చూడొచ్చు. దీంతో ధోనీ క్యాండీ క్రష్‌లో మునిగిపోయాడని నెటిజన్లు కమెంట్స్ చేశారు. అంతే క్షణాల్లో ఈ గేమ్ ట్విటర్లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. -
టెక్ బుడగ పేలుతోందా?
ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు... అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక దిగ్గజ ఐటీ కంపెనీల తాజా పరిస్థితి సైతం ఇదే. వరుసగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఒక్కసారిగా వేలాది మందిని తొలగిస్తున్నాయి. కోవిడ్ కాలంలో శరవేగంగా విస్తరించిన ఐటీ, ఆన్లైన్ సేవలతో లాభాలు పిండుకున్న టెక్ కంపెనీల అభివృద్ధి బుడగ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? బేజారెత్తిన టెక్ కంపెనీల పరిస్థితికి కారణం ఏమిటి? భవిష్యత్తులో వాటి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందా? ‘‘రెండో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. ప్రతి కంపెనీ, ప్రతి పరిశ్రమ ఆన్లైన్ సేవల వైపు మొగ్గుతోంది. ఇది మా కంపెనీకి లాభాలను ఒనగూర్చుతోంది’’ – ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షల వేళ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల్ల వ్యాఖ్య ‘‘కోవిడ్ తర్వాత పరిస్థితులను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తోంది’’ - కోవిడ్ వ్యాప్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో సత్య నాదెళ్ల చేసిన తాజా ప్రకటన ఉద్వాసనల పర్వం.. కోవిడ్ కాలంలో అనుకోకుండా వచ్చి పడిన అవకాశంతో అభివృద్ధి పుంతలు తొక్కిన టెక్ సంస్థలు శరవేగంగా విస్తరణపర్వం మొదలుపెట్టాయి. ప్రపంచం నలుమూలలకు విస్తరించే క్రమంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అమెజాన్ ఒక్కటే 2022 సెప్టెంబర్ నాటికి ఏడాది మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించాయి. గతేడాది చివరికి వచ్చే సరికి పరిస్థితులు మారడం మొదలైంది. లాభాల్లో కోత పడతుండటంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఒక్క 2022లోనే టెక్ కంపెనీలన్నీ కలిపి 1,64,411 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్ ఎఫ్‌వైఐ అనే సంస్థ సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 658 టెక్ కంపెనీలు 1,91,416 మంది ఉద్యోగులను తొలగించాయి. కేవలం టెక్ స్టార్టప్ కంపెనీలకు మాత్రమే నిధులు సమాకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ఈ ఏడాది మార్చిలో కుప్పకూలడం ఐటీ కంపెనీలకు మరో శరాఘాతంగా పరిణమించింది. నిధుల కొరతతో అనేక కంపెనీలు మూతపడటమో, ఉద్యోగాలను తొలగించడమో చేశాయి. గతేడాది నవంబర్‌లో 11,000 ఉద్యోగాల కోతపెట్టిన మెటా... మళ్లీ ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని తొలగించింది. అమెజాన్ 2022 నవంబర్‌లో 10,000 మంది, 2023 జనవరిలో 8 వేల మంది, మార్చిలో 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. యాక్సెంచర్ ఈ ఏడాదిలో ఇప్పటికే తన ఉద్యోగుల్లో 2.5 శాతం అంటే దాదాపు 19 వేల మందిని తొలగించింది. ట్విట్టర్‌ను కైవశం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని 80 శాతం మంది ఉద్యోగులను తొలగించామని ఎలాన్ మస్క్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించారు. కాగ్నిజెంట్ ఈ నెల 4న 3,500 మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్ గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అత్యల్ప ఆదాయం ఆర్జించింది. అమ్మకాలు 14 శాతం పడిపోయినట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. (వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?) ఎందుకీ పరిస్థితి టెక్ కంపెనీల తిరోగమ నానికి ఒక్కసారిగా వచ్చిపడ్డ అనేక పరిణామాలు కారణం. కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఒక కారణమైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య వంటి కారణాలు టెక్ ప్రపంచాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమేణా విస్తరిస్తూ ద్రవ్యోల్బణానికి ఆపై అధిక వడ్డీలకు దారితీశాయి. ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఉప్పెనలా వచ్చిపడి టెక్నాలజీ సంస్థల అభివృద్ధికి గండికొడుతున్నాయి. ఏఐ అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలను సృష్టిస్తూ శరవేగంగా అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేస్తున్న టెక్ కంపెనీల ఉత్పాదనలను కృత్రిమ మేధ క్షణాల్లో అతిచౌకగా రూపొందిస్తుడటంతో ఆయా కంపెనీల ఆదాయంపై దెబ్బపడుతోంది. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. టెక్ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుత ధరల స్థాయి గత 40 ఏళ్లలోనే అత్యధికం. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్ కంపెనీల ఉత్పాదనలు, సేవలను భరించలేని స్థాయికి చేరుకుంటున్నారు. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండటం టెక్ కంపెనీలకు దెబ్బమీద దెబ్బగా పరిణమిస్తోంది. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోతుండటం కంపెనీలు నడపడానికి రుణాలు తీసుకోలేక ఉద్యోగుల ఉద్వాసనకు ఉపక్రమించాయి. కరోనా వేళ మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక, తమ అభివృద్ధి శాశ్వతమని భావించి అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్‌బర్గ్, సేల్స్‌ఫోర్స్ అధినేత మార్క్ బెన్యాఫ్ ఒప్పుకున్నారు. టెక్ దిగ్గజాలకు భిన్నంగా యాపిల్ కంపెనీ మాత్రం ఉద్యోగ నియామకాల్లో సంయమనం పాటించింది. కోవిడ్ కాలంలో ఉద్యోగుల సంఖ్యను కేవలం 20 శాతమే పెంచుకుంది. దాంతో ఇంతవరకు ఉద్యోగులను తొలగించని టెక్ దిగ్గజం యాపిల్ ఒక్కటే. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు పాతికేళ్ల నాటి డాట్‌కామ్ బుడగను గుర్తుచేస్తోందని నిపుణులు అంటున్నారు. ఏమిటీ డాట్‌కామ్ బుడగ? గత శతాబ్దం చివర్లో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరుణంలో దాని ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఊహించని రీతిలో వృద్ధి చెందాయి. పేరు చివర డాట్‌కామ్ ఉన్న ప్రతి కంపెనీ విలువ వేలం వెర్రిగా పెరిగిపోయింది. 1995 నుంచి 2000 వరకు ఆన్లైన్ సేవల పేరిట వెలిసిన కంపెనీలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగి శతాబ్దం చివరికి వచ్చే సరికి గాలిబుడగలా పేలిపోయాయి. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) ముందున్న కాలమంతా డాట్‌కామ్ కంపెనీలదే అని నిమ్మన వ్యక్తులు, సంస్థలు ఆయా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఉదాహరణకు 1994లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పడిన నెట్‌స్కేప్ అనే సంస్థ 1995లో అంటే కేవలం ఏడాది తరువాత పబ్లిక్ ఫండింగ్‌కు వెళ్తే ఒక్క రోజులోనే దాని మార్కెట్ క్యాప్ 278 కోట్ల డాలర్లకు చేరుకుంది. జనరల్ మోటార్స్‌కు ఈ విలువ సాధించడానికి 40 ఏళ్లు పట్టింది. 2001 వచ్చే సరికి ఈ డాట్‌కామ్ కంపెనీల విలువ కేవలం ఊహాజనితమని అర్థమై అందరూ పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ‘నాస్డాక్’లో 1995 నుంచి 2000 వరకు క్రమేపీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 800 శాతం పెరిగితే 2002 వచ్చే సరికి పెరిగిన మొత్తంలో 790 శాతం పడిపోయి దాదాపు మొదటికి వచ్చింది. దాంతో డాట్‌కామ్ బుడగ పేలిపోయింది. (ఇలాంటి టెక్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్) - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
కృత్తిమ మేధ ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌ల వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మానవ వినాశనం కోరే కృత్తిమ మేధస్సు వినియోగాల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్‌జీపీటీ, బార్డ్ వంటి టూల్స్ వినియోగంలోకి వచ్చాయో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్‌జీపీటీ వల్ల ఏఐ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐలాంటి అధునాతన టెక్నాలజీ వినియోగం ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు స్థాన భ్రంశం కలుగుతుంది. అదే సాంకేతికత భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. అంతేకాదు మనుషులు రాసిన కంటెంట్‌ని చదవడం, సవరించడం, ఆమోదించడం వంటి విభాగాలకు కొత్త టెక్నాలజీ అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఏఐ’ సంతృప్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. ఉత్పాదకత పెరిగి కంపెనీల ప్రణాళికలతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని చెప్పారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమాని! -
ఇంద్రభవనం లాంటి సత్య నాదెళ్ల ఇల్లు.. చూసారా?
మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జన్మించి అగ్రరాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పగ్గాలు చేతపట్టుకుని భారతదేశానికి గొప్ప కీర్తి తెచ్చారు. గతంలో సత్య నాదెళ్ల జాబ్, ఆస్తులను గురించి కొన్ని కథనాల ద్వారా తెలుసుకున్నాం.. అయితే ఇప్పుడు బెల్లేవ్‌లోని సత్య నాదెళ్ల ఇంటి గురించి తెలుసుకుందాం. 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరీక్షలో ఉత్తీర్ణులయ్యే ప్రయత్నంలో విఫలమై ఆ తరువాత 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్.. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA చేశారు. (ఇదీ చదవండి: బిట్‌కాయిన్‌తో మహీంద్రా కార్లు కొనొచ్చా? ఆనంద్ మహీంద్రా సమాధానం ఏంటంటే..?) మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ళ బెల్లేవ్‌లో ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటి విలువ దాదాపు 7.5 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో రెండు అంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్, పెద్ద అవుట్డోర్ డెక్, హాట్ టబ్‌తో సహా అనేక సౌకర్యాలు మాత్రమే కాకుండా వైన్ సెల్లార్ కూడా ఉంది. ఆధునికమైన, అధునాతన సదుపాయాలు కలిగిన ఈ విలాసవంతమైన ఇంట్లో పెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యాలు, అద్భుతమైన బెడ్రూమ్లు, పెరట్లో కొలను, గేమ్ రూమ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. మొత్తానికి సత్యనాదెళ్ళ ఇల్లు భూలక స్వర్గాన్ని తలపిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. -
ఊహించని విధంగా.. 90 శాతం తగ్గిన అమెజాన్ సీఈవో వేతనం!
ప్రపంచంలో అత్యదిక వేతనం తీసుకుంటున్న సీఈవోల జాబితా ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్థానం మరింత దిగజారింది. స్వచ్ఛంద సంస్థ ‘As You Sow’ ఏడాదికి అత్యధిక జీతం తీసుకుంటున్న 100 మంది సీఈవోల జాబితా -2022 (100 Most Overpaid CEOs) ను విడుదల చేసింది. అందులో ఆండీ జెస్సీ స్థానం కిందకు పడిపోయింది. 2021లో 212 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం అమెజాన్ ఉద్యోగులకు ఇచ్చే యావరేజీ శాలరీ కంటే 6,474 రెట్లు ఎక్కువ. అయితే, 2022లో 99 శాతం వేతనం కోతను ఎదుర్కొన్నారు. కాబట్టే మోస్ట్ ఓవర్ పెయిడ్ సీఈవోలా జాబితాలో తన స్థానాన్ని కోల్పోయారు. 99 శాతం తగ్గింది 2021లో ఆండీ జెస్సీ శాలరీ 212 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు (సుమారు రూ. 10 కోట్లు) తగ్గిందని అమెజాన్ ఇటీవల దాఖలు చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయినప్పటికీ, జెస్సీ బేస్పే (జీతం మినహా ఇతర బెన్ఫిట్స్ ఉండవు) 175,000 డాలర్ల నుంచి 317,500తో 80 శాతం పెరిగింది. ఆండీ వేతనం తగ్గడానికి 2022లో స్టాక్ గ్రాంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021లో అందించిన అతని షేర్లలో కొంత భాగం ఈ సంవత్సరం అమెజాన్ అందించనుంది. మిగిలిన షేర్లను 2026 నుంచి 2031 చివరి నాటికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర టెక్ దిగ్గజాల సీఈవోల వేతనాలను పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఏడాది 55 మిలియన్లు పొందగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ సుమారు 99.4 మిలియన్లు, 2020లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది. -
కార్పొరేట్ రంగంలో సాహో భారత్! గ్లోబల్ కంపెనీలను ఏలుతోంది మనోళ్లే..
మైక్రోసాఫ్ట్.. గూగుల్.. అడోబ్.. ఐబీఎం.. నోవార్టిస్.. డెలాయిట్.. స్టార్‌బక్స్.. బాటా.. యూట్యూబ్.. గోడాడీ.. మైక్రాన్.. ఫెడ్ఎక్స్.. డీబీఎస్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది లిస్ట్! ఇంతకీ ఏంటీ లిస్ట్ అంటారా? వీటన్నింటిలోనూ కామన్ విషయం ఒకటుంది. అదేనండీ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో దుమ్మురేపుతున్న ఈ గ్లోబల్ కంపెనీలన్నింటినీ ఏలుతున్నది మనోళ్లే! మనదేశంలో పుట్టి.. సప్తసముద్రాలను దాటి కార్పొరేట్ రారాజులుగా తమ సత్తా ఏంటో చాటిచెబుతున్నారు భారతీయులు. టెక్నాలజీ.. ఫార్మా.. ఫ్యాషన్.. బ్యాంకింగ్.. రిటైల్.. తయారీ.. ఐటీ.. ఏ రంగంలోనైనా మనోళ్లు సరైనోళ్లు అనిపించుకుంటున్నారు. అందుకే ప్రపంచం ఇప్పుడు భారత్ లీడర్స్ వెంటపడుతోంది. ఫార్చూన్-500 టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీల డ్రైవింగ్ సీట్లో ఉన్నది భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. ఆయా కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే!! అంటే మన కరెన్సీలో 492 లక్షల కోట్ల రూపాయలన్న మాట! మనదేశ ఎకానమీ (జీడీపీ) దాదాపు 3.2 లక్షలకోట్లడాలర్లతో పోలిస్తే రెట్టింపు విలువ వీటి సొంతం. ఇతర రంగాల్లోనూ భారత సారథులు దూసుకుపోతున్నారు. అమెరికా వైస్‌ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఐఎంఎఫ్ డిప్యుటీ ఎండీ గీతా గోపీనాథ్‌తో పాటు తాజాగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్ బంగా దీనికి నిదర్శనం. అసలు కార్పొరేట్ ప్రపంచమంతా సారథ్యం కోసం భారత్ వైపు ఎందుకు చూస్తోంది? మనోళ్లకున్న ప్రత్యేకతేంటి? ఈ కథేంటో చూద్దాం రండి మరి!! అమెరికా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా. ఎందుకంటే అక్కడున్న అనేక టెక్నాలజీ, ఐటీ కంపెనీల్లో మన ఇంజినీర్లు లక్షల సంఖ్యలో (దాదాపు మూడో వంతు) పని చేస్తుండటమే కాదు.. ఏకంగా చాలా దిగ్గజ కంపెనీల్లో టాప్ పొజిషన్లను చేరుకుని భారత్ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేస్తున్నారు. శంతను నారాయణ్ దాదాపు 15 ఏళ్లుగా అడోబ్ సీఈఓ స్థానంలో పాతుకుపోయారు. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అనేక కంపెనీలు భారత సంతతికి చెందిన వారి వెంటపడి మరీ సారథ్యాన్ని అప్పగిస్తుండటం వారి ప్రతిభాపాటవాలను చాటిచెబుతోంది. 2004లో గూగుల్‌లో చేరిన సుందర్ పిచాయ్ దాదాపు పదేళ్లలోనే కంపెనీ టాప్ పొజిషన్‌కు చేరుకోవడం దీనికి నిదర్శనం. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ డ్రైవ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ వంటి ప్రాజెక్టుల సక్సెస్‌కు సుందర్ పిచాయ్ దూరదృష్టి అపారమైన నైపుణ్యాలే కారణం. అంతేకాదు, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే గూగుల్ షేర్ ధర ఏకంగా 76 శాతం ఎగబాకడం విశేషం. ఆయన హయాంలోనే ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) తొలిసారిగా 2020 జనవరిలో ట్రిలియన్ (లక్షకోట్ల) డాలర్ల మైలురాయిని చేరుకోగా, 2021 నవంబర్‌లో 2 ట్రిలియన్ డాలర్లను సైతం తాకింది. ఇక మన తెలుగు తేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ను పోటీదారులకు అందనంత ఎత్తులో నిలబెట్టి ప్రపంచ కార్పొరేట్లలో తన రూటే సెపరేటు అని చూపించారు. ఎందుకంటే 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల.. 2019లో కంపెనీని తొలిసారి ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించేలా చేశారు. అజూర్‌క్లౌడ్ బిజినెస్‌తో భవిష్యత్తు దిశగా కంపెనీని నడిపించడమే కాదు.. 2021లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్ దూసుకెళ్లేలా చేసిన ఘనత నాదెళ్లదే. తన హయాంలో 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు కనకవర్షం కురిపిస్తున్నాయి. వీటిలో లింక్డ్ఇన్, మోజాంగ్ (మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్), న్యూయన్స్, గిట్ హబ్ వంటివి ఉన్నాయి. గత సీఈఓ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ బామర్ 14 ఏళ్ల సారథ్యంలో కంపెనీ షేరు 32 శాతం పడిపోగా, ఆయన కొనుగోలు చేసిన అక్వాంటివ్, నోకియా మొబైల్ బిజినెస్ వంటివి కంపెనీకి నష్టాలు మిగల్చడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా, టాప్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న ఐబీఎం సారథిగా కూడా భారత్‌కు చెందిన అరవింద్ కృష్ణను నియమించడం విశేషం. తాజాగా గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన నీల్మోహన్ కూడా ఈ జాబితాలో చేరారు. లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ.. ఫార్చూన్-500 ప్రపంచ టాప్ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీలకు భారత సంతతికి చెందిన వారే సీఈఓలు. మనోళ్లు సారథ్యం వహిస్తున్న ఈ కార్పొరేట్ దిగ్గజాల మార్కెట్ విలువ ఏకంగా 6 లక్షలకోట్ల (ట్రిలియన్) డాలర్లకు పైగానే ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే ఈ విలువ దాదాపు రూ. 492 లక్షలకోట్లు. మన దేశ ప్రస్తుత జీడీపీ (స్థూలదేశీయోత్పత్తి) విలువ దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్లు కాగా, అంతర్జాతీయంగా భారతీయ గ్లోబల్ సీఈఓల నేతృత్వంలోని కంపెనీల మార్కెట్ విలువ దీనికి రెట్టింపు కావడం విశేషం. అంతేకాదు మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాల జీడీపీ (3.1 ట్రిలియన్ డాలర్లు)తో లెక్కగట్టినా ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు డబుల్ అన్నమాట. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోని ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ మొత్తం మార్కెట్ విలువలో 13 శాతం వాటా భారతీయ సీఈఓల నిర్వహణలో ఉన్న కంపెనీలదే. మనోళ్ల సత్తా అది మరి! ఇక ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాలదీ అదిరిపోయే రేంజే. నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 2022లో 202 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర లాభం 72 బిలియన్ డాలర్లు (రూ. 5 లక్షల కోట్లు). సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తున్న ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ) గతేడాది 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 60 బిలియన్ డాలర్ల నికరలాభాన్ని సంపాదించింది. ఇక మిగతా 60 కంపెనీల ఏడాది లాభాలను కూడా లెక్కేస్తే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీని మించి పోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు 4 మాత్రమే ఉండగా (యాపిల్, సౌదీ ఆరామ్కో, మైక్రోసాఫ్ట్, గూగుల్) వీటిలో రెండింటి పగ్గాలు మనోళ్ల చేతిలోనే ఉన్నాయి. ఇక టాప్-100 ప్రపంచ కంపెనీల్లో మన రిలయన్స్ ఇండస్ట్రీస్ (మార్కెట్ విలువ 196 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 47), టీసీఎస్ (149 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 74), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (126 బిలియన్ డాలర్లు, ర్యాంక్ 96) మాత్రమే ఉన్నాయి. ఏ రంగమైనా సై.. ఇందు గలరందు లేరని సందేహము వలదు, ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు అన్న చందాన.. మనోళ్లుఅన్ని రంగాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. టెక్నాలజీలో చేయి తిరిగిన భారతీయులు ఇతర రంగాలకు చెందిన అనేక గ్లోబల్ దిగ్గజాల సీఈఓలుగానూ దూసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫార్మా అగ్రగామి నోవార్టిస్. అమ్మకాలపరంగా ఫైజర్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా నిలుస్తున్న ఈ కంపెనీకి సారథిగా ఉన్నది కూడా భారత్‌కు చెందిన వసంత్ నరసింహన్. ఇక ప్రపంచంలోనే నంబర్‌వన్ కాఫీ రిటైల్ బ్రాండ్‌గా నిలుస్తున్న స్టార్‌బక్స్ ఘుమఘుమలు దశదిశలా వ్యాపించేలా చేస్తున్నది లక్ష్మణ్ నరసింహన్. గతంలో ఆయన బ్రిటిష్ కన్జూమర్ గూడ్స్ దిగ్గజం రెకిట్ బెన్కిసర్ సీఈఓగా కూడా పనిచేశారు. ప్రపంచ స్కాచ్ విస్కీ రారాజుగా వెలుగొందుతున్న బ్రిటిష్ కంపెనీ డియాజియో పగ్గాలు సైతం మన ఇవాన్మెనెజెస్ చేతిలోనే ఉన్నాయి. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 5 స్కాచ్ విస్కీ బాటిల్స్‌లో ఒకటి డియాజియోకు చెందిన ‘జానీవాకర్’ బ్రాండ్‌దే కావడం విశేషం. గ్లోబల్ మల్టీనేషనల్ కెమికల్ కంపెనీ.. లిండే సీఈఓగా గత ఏడాది సంజీవ్ లాంబా బాధ్యతలు చేపట్టారు. ఆదాయం, మార్కెట్ వాటా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్యాస్ కంపెనీగా వెలుగొందుతోంది. గ్లోబల్ కన్సల్టింగ్ వ్యాపార రంగంలో వరుసగా ఐదో ఏడాది కూడా నంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్న డెలాయిట్‌ను నడిపిస్తోంది భారతీయ సంతతికి చెందిన పునీత్ రంజన్. బిగ్ అంతర్జాతీయ అకౌంటింగ్ కంపెనీల్లో సైతం డెలాయిట్దే పైచేయి. ఇక మరో గ్లోబల్ ఫార్మాదిగ్గజం వెర్టెక్స్ సీఈఓ రేష్మా కేవలరమణి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీగా నిలుస్తున్న ఫెడెక్స్ చీఫ్ రాజ్ సుబ్రమణ్యం, మల్టీనేషనల్ ఇంజినీరింగ్ దిగ్గజం ఎమర్సన్ ఎలక్ట్రిక్ కంపెనీ చీఫ్ సురేంద్రలాల్ కర్సన్ భాయ్, గ్లోబల్ టాప్-10 ఇన్సూరెన్స్ కంపెనీల్లోఒకటైన ప్రుడెన్షియల్ సారథి అనిల్ వాధ్వానీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ దిగ్గజం అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింగపూర్ బ్యాంకింగ్ అగ్రగామి డీబీఎస్ గ్రూప్‌సీ ఈఓ పియూష్ గుప్తా, బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంక్ బార్క్లేస్ గ్రూప్ సీఈఓ సీఎస్ వెంకట కృష్ణన్, ప్రపంచ ఫుట్‌వేర్ దిగ్గజం బాటా కార్పొరేషన్ సీఈఓ సందీప్ కటారియా, డొమైన్ నేమ్ సర్వీసుల రంగంలో ప్రపంచ నంబర్ వన్ గోడాడీ సీఈఓ అమన్ భూటానీ సైతం తమ ప్రతిభాపాటవాలతో భారతీయ లీడర్స్‌గా అవతరించారు. ఇక బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘చానెల్’ను నడిపిస్తున్నది భారతీయ సంతితికి చెందిన లీనా నాయర్ కావడం మరో విశేషం. ప్రపంచ టాప్-5 లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో లూయీ విటోన్ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ‘చానెల్’ మూడో ర్యాంకును చేజిక్కించుకుందంటే అదంతా నాయర్ ఘనతే! ఇలా ఒకటేంటి కార్పొరేట్ ప్రపంచంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీలు ఇప్పుడు తమకు భారతీయ లీడర్లే కావాలంటూ వెంట పడుతున్నారు!! మాజీ గ్లోబల్ సీఈఓలు పెప్సీకో ఇంద్రానూయీ, వొడాఫోన్ అరుణ్ శరీన్, నోకియా రాజీవ్ సూరి, సన్ మైక్రోసిస్టమ్స్ వినోద్ ఖోస్లా, హార్మన్ ఇంటర్నేషనల్ దినేష్ పలివాల్, సిటీ బ్యాంక్ విక్రమ్ పండిట్, ట్విటర్ పరాగ్ అగర్వాల్ కూడా ఈ కోవకు చెందినవారే. మన మూలాలే బలం.. భారతీయులు గ్లోబల్ కంపెనీల్లో లీడర్‌షిష్ స్థానాలకు చేరుకోవడానికి కారణం మన మూలాలే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన విద్యా వ్యవస్థ. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారిలో చాలామంది దాదాపు భారత్‌లోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవడం.. ముఖ్యంగా ఐఐటీలు, ఇతర అత్యున్నత కాలేజీల్లో ఇంజినీరింగ్ చేయడం గమనార్హం. మనకున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేసి, అమెరికా, యూరప్ తదితర దేశాల్లో మరింత ఉన్నత చదువులు చదవడం కూడా వారి ఎంపికకు దోహదం చేస్తోంది. అంటే ప్రాథమికస్థాయిలో వారికి బలమైన నాయకత్వ పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లిష్ భాషపై మనోళ్లకున్న పట్టు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోందని సింగపూర్ బ్యాంకింగ్ దిగ్గజం డీబీఎస్ గ్రూప్ సీఈఓ పియూష్ గుప్తా విశ్లేషించారు. చాలా వరకు మధ్యతరగతి బ్యాగ్రౌండ్ నుంచి రావడం కూడా సాధించాలన్న పట్టుదలకు ప్రధాన కారణమనేది ఆయన అభిప్రాయం. చొచ్చుకుపోయే తత్వం, ఎలాంటి సవాళ్లనైనా అధిగమించ గల ఆత్మవిశ్వాసం, నిర్వహణ సామర్థ్యం, పరిస్థితులకు అనువుగా మారగల నైజం, కుటుంబ విలువలు, తోటివారికి చేయూతనందించడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్నిరంగాల్లోనూ అగ్రస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాయని అంటున్నారు ఫైర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స. భారతీయులు సహజంగానే పొదుపరులు. కంపెనీ చీఫ్లుగా అనవసర వ్యయాలను తగ్గించి, లాభాలను పెంచడంలో తమకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు. ఇది కూడా వారికి సారథ్యాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు, మన ఆర్థికవ్యవస్థ పురోగతి సైతం భారతీయుల నాయకత్వానికి దన్నుగా నిలుస్తోంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3.2 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న జీడీపీ 2028 కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు, 2036 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు, 2045 నాటికి 20 ట్రిలియన్ డాలర్లను అధిగమించనుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదికలో అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తూ నవకల్పనలకు పెద్దపీట వేస్తుండటం కూడా ఎంట్రప్రెన్యూర్స్, నాయకత్వలక్షణాలకు దోహదం చేస్తోందనేది పరిశ్రమ నిపుణుల మాట. దేశంలో యూనికార్న్‌లుగా (బిలియన్ డాలర్ల విలువను అధిగమించినవి) ఆవిర్భవించిన స్టార్టప్స్ సంఖ్య ఇప్పటికే 100కు చేరింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్‌లో కూడా 25 శాతం సంస్థల సారథ్యం భారతీయుల చేతిలోనే ఉండటం భవిష్యత్తులో మనోళ్ల జోరుకు అద్దం పడుతోంది. దక్షిణాది దూకుడు.. తెలుగు వెలుగులు! అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న మెజారిటీ భారత సంతతి సీఈఓలు దక్షిణ భారతావనికి చెందిన వారే కావడం మరో విశేషం. సందర్ పిచాయ్, వసంత్ నరసింహన్, లక్ష్మణ్ నరసింహన్, రాజేష్ సుబ్రమణ్యం, రంగరాజన్ రఘురామ్, గణేష్ మూర్తి, రవి కుమార్, సీఎస్ వెంకట కృష్ణన్ ఇంకా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ, కేవియం సీఈఓ సయ్యద్ అష్రాఫ్ అలీ, కెనడా ఆటోమొబైల్ కాంపొనెంట్ దిగ్గజం మ్యాగ్నా కార్పొరేషన్ సీఈఓ సీతారామ (స్వామి) కోటగిరి వీళ్లంతా తెలుగు రాష్ట్రాల్లో జన్మించారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కాబోతున్న అజయ్‌పాల్ సింగ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) పూర్వ విద్యార్థులు. కెనడా ఆర్థిక సేవల దిగ్గజం ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్ వత్స సైతం హెచ్‌పీఎస్‌లోనే హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లు. ఏడాదికి రూ. 2,300 కోట్లు! ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే! 2022లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీలు అందుకున్న టాప్-10 సీఈఓల్లో సుందర్ కూడా ఒకరు. ఆయన ఏకంగా 28 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 2,300 కోట్లు. ఏంటీ ఈ సొమ్ముతో ఏకంగా ఒక కంపెనీయే పెట్టేయొచ్చు అనుకుంటున్నారా.. అట్లుంటది మరి మన సుందర్తోని! అంతేకాదు ప్రస్తుతం సుందర్ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లడాలర్ల (రూ.12,300 కోట్లు) పైనే అని అంచనా. ఒక మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సుందర్ పిచాయ్ తన కలలను సాకారం చేసుకున్న తీరు, ఆయన లైఫ్ జర్నీ భారతీయ యువతకు నిజంగా గొప్ప స్ఫూర్తిదాయక పాఠం. చిన్నప్పుడు తామంతా హాల్లో ఒకే చోట కిందే పడుకునేవారిమని.. మొదటిసారి ఇంట్లోకి ఫ్రిజ్ వచ్చినప్పుడు కలిగిన ఆనందం ఇంకా తన కళ్లముందే కదలాడుతోందంటూ పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో నెమరువేసుకున్న తీపిగుర్తులు ఆయన ఏ స్థాయి నుంచి టెక్నాలజీ ఎవరెస్ట్‌ను అధిరోహించారనేందుకు చిన్న ఉదాహరణ మాత్రమే! మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లదీ దాదాపు ఇలాంటి సక్సెస్ జర్నీయే. ఆయన 2022లో అందుకున్న మొత్తం ప్యాకేజీ 5.5 కోట్లడాలర్లు (రూ. 451 కోట్లు). నాదెళ్ల నెట్‌వర్త్ సుమారు 81 కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)గా అంచనా. ఐబీఎం చీఫ్ అరవింద్ కృష్ణ, పాలో ఆట్లో సీఈఓ నికేష్ అరోరా, స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ ఇలా భారత సంతతికి చెందిన గ్లోబల్ సీఈఓలు అందరూ ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల స్థాయిలో వార్షిక వేతన ప్యాకేజీలను అందుకుంటుండటం వారి ప్రతిభకు దక్కుతున్న ప్రతిఫలానికి నిదర్శనం. అపూర్వసహోదరులు.. ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవి సైతం భారతీయుడినే వరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవలే నామినేట్ చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయుడిగా బంగా రికార్డ్ సృష్టించారు. మాస్టర్‌కార్డ్ సీఈఓగా 12 ఏళ్ల పాటు పని చేసిన అజయ్ బంగా కోవిడ్ సమయంలో కూడా కంపెనీలో ఉద్యోగాల కోత అనేది లేకుండా చూశారు. 50 కోట్లమంది డిజిటల్ ఎకానమీలో భాగస్వామ్యం అయ్యేలా తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బంగా పీఈ సంస్థ జనరల్ అట్లాంటిక్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. అంతేకాదు, అజయ్ సోదరుడు ఎంఎస్ బంగా సైతం ప్రపంచ ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్లో టాప్ పొజిషన్లలో పని చేశారు. అంతక్రితం ఆయన హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓగా ఉన్నారు. అంతేకాదు, నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్, కాఫీ కింగ్ స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ కూడా స్వయానా అన్నదమ్ములే. మరో సోదరుల జంట కూడా గ్లోబల్ సీఈఓలుగా ‘మా ఆట సూడు నాటు.. నాటు.. నాటు’ అంటూ దుమ్ము రేపుతున్నారు. హైబ్రీడ్ క్లౌడ్ డేటా సర్వీసుల గ్లోబల్ కంపెనీ నెట్‌యాప్ సీఈఓ జార్జ్ కురియన్, గూగుల్‌క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఇద్దరూ ఒకే రంగంలోని రెండు దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్నారు. ఈ అపూర్వసహోదరులు... ప్రపంచ కార్పొరేట్రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటూ భారత్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు. -శివరామకృష్ణ మిర్తిపాటి -
కోడింగ్ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్ మరో సంచలనం!
సాఫ్ట్వేర్ కొలువు అంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి.. అనుకుంటాం. కానీ ఇవేవీ అక్కర్లేకుండానే ఐటీలో కొన్ని కొలువులు కొట్టేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోడింగ్‌తో పనిలేకుండా యాప్స్‌ను తయారు చేసేలా కొత్త టూల్‌ను విడుదల చేయనుంది. మైక్రోసాఫ్ట్ తన సొంత సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’లో ఏఐ చాట్‌జీపీటీతో పాటు మరో ఏఐ టూల్ ‘పవర్ ప్లాట్‌ఫామ్’(Power Platform) ను ఇంటిగ్రేట్ చేయనుంది. ఒక్కసారి ఈ టూల్ అందుబాటులోకి వస్తే.. ఏమాత్రం కోడింగ్(coding) అవసరం లేకుండా వివిధ రకాలైన అప్లికేషన్ల(apps)ను డెవలప్ చేయొచ్చని తెలిపింది. ఆఫీస్‌లో ఆటోమెషిన్ సాయంతో చేసే పనులన్నీ ఈ టూల్‌తో చేసుకోవచ్చు. డేటాను విశ్లేషించడం (analyze),ఈమెయిల్ క్యాంపెయిన్, చాట్‌బోట్స్ తయారీ, వీక్లీ వర్క్ రిపోర్ట్స్ ,కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు సమ్మరీ తయారు చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చెప్పారు. వీటితో పాటు ఏఐ బిల్డర్ (AI Builder) అనే మరో టూల్‌ను సైతం యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఏఐ బిల్డర్ అనేది బిజినెస్ వర్క్ ఫ్లోలను ఆటోమేట్ (Workflow automation) చేయడానికి అనుమతిస్తుంది. కంపెనీ తన బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫారమ్ డైనమిక్స్ 365 కోపిలాట్ (Dynamics 365 Copilot) కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త వెర్షన్ సాయంతో కొన్ని పనులను ఆటోమేట్ చేసేందుకు ఏఐని జత చేసింది. సత్యనాదెళ్ల ప్రకటన ఏఐతో ప్రొడక్టవిటీ పునరుద్ధరించడం(reinventing productivity with AI) అనే అంశం గురించి చర్చించేందుకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మార్చి 16న ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కంపెనీ తన పాపులర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సెర్చ్ ఇంజిన్ బింగ్ కోసం ఏఐ అప్డేట్లను ప్రకటించినప్పటికీ, వర్డ్ -ఎక్సెల్ సహా దాని ఆఫీస్ ప్రొడక్టివిటీ సూట్ కోసం ఇంకా ఏఐని విడుదల చేయలేదు. వీటి గురించి ఆ కార్యక్రమంలో సత్యనాదెళ్ల ప్రకటన చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. -
గూగుల్‌కు గుబులు.. చాట్‌జీపీటీతో సత్య నాదెళ్ల మరో మాస్టర్ ప్లాన్!
కృత్తిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) విభాగంలో గూగుల్‌ను మరింత వెనక్కి నెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల మరింత వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాబోయే వారాల్లో ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఔట్‌లుక్‌లలో ఏఐ చాట్‌జీపీటీ డెమో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ది వెర్జ్ నివేదిక ప్రకారం, మార్చి నెలలో ఏఐ టెక్నాలజీపై సత్యా నాదెళ్ల భవిష్యత్ ప్రణాళికల్ని వివరించనున్నారు. ఇందులో భాగంగా ఓపెన్ ఏఐలో మరిన్ని పెట్టుబడులు పెట్టి అన్నీ ప్రొడక్ట్‌లలో మైక్రోసాఫ్ట్ ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా దాని ప్రొడక్టీవ్ యాప్స్‌ను ఎంత త్వరగా తిరిగి ఆవిష్కరించాలనుకుంటుందో వచ్చే నెలలో చేసే ప్రకటనలో మైక్రోసాప్ట్ హైలైట్ చేస్తుంది’అంటూ వెర్జ్ నివేదిక తెలిపింది. ఇప్పటికే చాట్‌జీపీటీని ఔట్‌లుక్‌లో మెయిల్స్‌కు రిప్లయ్ ఇచ్చేలా సెర్చ్ రిజల్ట్స్ మరింత అందంగా తీర్చిదిద్దేలా చాట్‌జీపీటీని టెస్ట్ చేసినట్లు పేర్కొంది. దీంతో పాటు వర్డ్ డాక్యుమెంట్ ఇంటిగ్రేషన్‌ని మెరుగుపరచడం కోసం జీపీటీ మోడల్‌ను పరీక్షించినట్లు గతంలో నివేదించింది. ఈ తరుణంలో పోటీగా గూగుల్ బార్డ్ రావడంతో మరింత దూకుడుగా ముందుకు సాగేందుకు సిద్దమయ్యారు సత్యనాదెళ్ల. బార్డ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ ప్రకటన చేసిన వారం రోజుల వ్యవధిలో మైక్రోసాఫ్ట్ వివా సేల్స్‌లో ఏఐ ఎక్స్పీరియన్స్ అందించనుంది. దీని సాయంతో సేల్స్ ఈమెయిల్స్‌ను రూపొందించడానికి అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్, జీపీటీని ఉపయోగించుకోవచ్చు. ఇది ఔట్‌లుక్‌లో మైక్రోసాఫ్ట్ పరీక్షిస్తున్న కొన్ని ఫీచర్లను పోలి ఉంటుందని సమాచారం. -
Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం
ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని కమలా హారిస్ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి గత నవంబర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్‌గా ఉన్నఎస్.ఆర్.నాథన్ (1999–2011), దేవన్ నాయర్ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన పరాగ్ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..! - కోరాడ శ్రీనివాసరావు ప్రభుత్వాధికారి, ఏపీ (జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా) -
సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించా : మంత్రి కేటీఆర్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన సత్యనాదెళ్లతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇద్దరు హైదరాబాదీల భేటీతో ఈ రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్ & బిర్యానీతో గురించి మాట్లాడుకున్నాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS — KTR (@KTRTRS) January 6, 2023 ఇక సత్యనాదెళ్లతో జరిపిన భేటీలో కేటీఆర్ హైదరాబాద్‌లో పెట్టుబడులు, టీహబ్ విస్తరణ, ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చాట్ జీపీటీతో సత్యనాదెళ్ల బిర్యానీ ముచ్చట్లు బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఛాట్ రోబో ‘చాట్ జీపీటీ’, సత్య నాదెళ్ల మధ్య హైదరాబాద్ బిర్యానీ గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏంటని చాట్ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీ టిఫిన్ కాదని, దాని గురించి నాకు బాగా తెలుసని రిప్లయి ఇవ్వడంతో చాట్ జీపీటీ క్షమాపణలు చెప్పింది. -
డిజిటైజేషన్లో భారత్ భేష్
ముంబై: డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో భారత్ అసాధారణ రీతిలో కృషి చేస్తోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల ప్రశంసించారు. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి సాధనలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) గణనీయంగా తోడ్పాటునివ్వగలవని ఆయన తెలిపారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్షిప్ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు. 2025 నాటికి చాలా మటుకు అప్లికేషన్లు ..క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలతో రూపొందుతాయని, సుమారు 90 శాతం డిజిటల్ పని అంతా క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్‌పైనే జరుగుతుందని ఆయన చెప్పారు. ‘ఈ నేపథ్యంలోనే మేము ప్రపంచవ్యాప్తంగా 60 పైగా రీజియన్లు, 200 పైగా డేటా సెంటర్లపై ఇన్వెస్ట్ చేస్తున్నాం. భారత్‌లో మరింతగా విస్తరిస్తున్నాం. హైదరాబాద్‌లో మా నాలుగో రీజియన్ ఏర్పాటు చేస్తున్నాం. క్లౌడ్‌ను అంతటా అందుబాటులోకి తేవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని నాదెళ్ల చెప్పారు. భారత్‌లో క్లౌడ్ వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. క్లయింట్ సర్వర్ శకంతో పోలిస్తే ప్రస్తుతం అంతా మారిపోయిందని .. అన్ని వ్యాపారాల్లోనూ క్లౌడ్ వినియోగం పెరుగుతోందని నాదెళ్ల వివరించారు. 2020 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల .. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. కస్టమర్లు, స్టార్టప్‌లు, డెవలపర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు మొదలైన వారితో సమావేశం కానున్నారు. కృత్రిమ మేధ హవా.. ఆటోమేషన్ గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ చాలా కీలకంగా మారగలదని నాదెళ్ల చెప్పారు. ‘ముందుగా మనకు భారీ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది లేకుండా ఏఐ ప్రయోజనాలను పొందలేము. అందుకే మేము మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేస్తున్నాం‘ అని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండటం, మార్కెట్ శక్తులు దానికి తగ్గ ప్రోత్సాహాన్ని అందిస్తుండటం వంటి అంశాలు భారత్‌కు సానుకూలమైనవని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. రీసెర్చ్ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల మార్కెట్ 2026 నాటికి 13 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2021–26 మధ్య కాలంలో ఏటా 23.1 శాతం వృద్ధి నమోదు చేయనుంది. భారత్‌లోని టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసు ప్రొవైడర్లలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ ఉన్నాయి. -
హైదరాబాద్‌కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్‌తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్‌ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
క్రికెట్‌పై కన్నేసిన సత్యనాదెళ్ల, రూ.930కోట్లతో..!
అమెరికాలో క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు త్వరలో తొలి ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు ఇండో-అమెరికన్ వ్యాపార వేత్తలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 100 కోట్లకు మందికి పైగా ప్రజలు క్రికెట్‌ను అభిమానిస్తున్నప్పటికీ, కొన్ని దేశాల్లో మాత్రమే ఇది పాపులర్ అయ్యింది. అలాంటి జెంటిల్ గేమ్ క్రికెట్ మ్యాచ్‌లు ఇకపై అమెరికాలో జరగనున్నాయి. ఇందుకోసం సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్లుగా పలు దిగ్గజ కంపెనీలకు చెందిన యజమానులు, సీఈవోలు సంయుక్తంగా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)ను ప్రారంభించారు. ఈ లీగ్ సంస్థలో సత్య నాదెళ్ల ప్రధాన పెట్టుబడిదారుడిగా ఉన్నారు. 📡 Investment secured to #BuildAmericanCricket 📡 MLC plans to deploy $120 million to launch world class T20 cricket league and transform cricket infrastructure in the USA 🏏🇺🇸 Read full press release ➡️ https://t.co/mTvWu6LQg1 pic.twitter.com/oJWbcTxpG1 — Major League Cricket (@MLCricket) May 18, 2022 120 మిలియన్ డాలర్ల ఫండ్ అమెరికాలో వరల్డ్ క్లాస్ టీ20 క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ, అందుకు కావాల్సిన ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ కోసం నిర్వాహకులు ఏ అండ్ ఏ1 ఫండ్ రైజింగ్ పేరుతో నిధుల్ని సమీకరించారు. ఇప్పటివరకు 44మిలియన్ డాలర్లను సేకరించగా..మరో 12నెలల్లో 76మిలియన్ డాలర్లు సేకరించడానికి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి.మొత్తంగా 120మిలియన్ (రూ.9,32,30,10,000) డాలర్లను ఫండ్‌ను సేకరించేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నారు నిర్వాహకులు. చదవండి👉మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు భారీగా పెరుగుతున్నాయంటే! -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు భారీగా పెరుగుతున్నాయంటే!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఉద్యోగుల శాలరీలను డబుల్ చేస్తున్నట్లు తెలిపారు. సత్య నాదెళ్ల ప్రకటనతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని నట్టేట ముంచారు. మీరొద్దు. మీరిచ్చే జీతాలొద్దు. కరోనా పేరు చెప్పి ఉద్యోగాలు ఊడబీకారు. నష్టాలంటూ శాలరీల్లో కోత విధించారు. డబుల్ హైక్‌లు, ప్రమోషన్లు ఇస్తామంటే మేం ఎందుకు పనిచేస్తాం. కరోనా తెచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నామంటూ..ఉద్యోగస్తులు.. వారు చేస్తున్న ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నాం". ఇదిగో ఇలా పుట్టుకొచ్చిందే ఈ దిగ్రేట్ రిజిగ్నేషన్. ఇప్పుడీ ఈ అంశం ప్రపంచ దేశాలకు చెందిన అన్నీ సంస్థల్ని కలవరానికి గురిచేస్తుండగా..మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక ప్రకటన చేస్తూ ఉద్యోగులకు మెయిల్ పెట్టారు. 'నియర్లీ డుబల్డ్ ది గ్లోబల్ మెరిట్'. ముఖ్యంగా మిడ్ కెరియర్ (35 నుంచి 45 మధ్య వయస్సు) ఉద్యోగుల శాలరీలు మరింత పెరగనున్నాయి. అంతేకాదు క్లయింట్లకు, భాగస్వాములకు మీరందించిన అసమాన సేవలతో మన నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉందని మరోసారి నిరూపణ అయింది. నా తరుపున మీ అందరికి కృతజ్ఞతలు.అందుకే మీ అందరిపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యామని సత్య నాదెళ్ల తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్స్‌లో పేర్కొన్నారు. చదవండి👉నాకొద్దీ ఉద్యోగం.. భారత్‌లో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ! -
ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్నింగ్!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. పెరిగిపోతున్న పనిగంటలతో అర్ధరాత్రి వరకు మెలుకువతో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 'వార్టన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కాన్ఫరెన్స్'లో సీఈఓ సత్య నాదెళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వర్క్‌స్పేస్ 'మైక్రోసాఫ్ట్ టీమ్స్'పై రిమోట్ వర్క్ ఎలాంటి ప్రభావం చూపిందో గుర్తించామని తెలిపారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌ను ఉదహరిస్తూ.. వైట్ కాలర్ ఉద్యోగుల్లో 3వ వంతు మంది అర్ధరాత్రి వరకు వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ప్రొడక్టివిటీ భోజనానికి ముందు, తర్వాత పెరుగుతుంది. కానీ ఈ 'ట్రిపుల్ పీక్ డే' రిమోట్ వర్క్ (అంటే అర్ధరాత్రి వరకు పనిచేయడం) మన ఇంటి జీవితాల్ని ఎలా విచ్ఛిన్నం చేసిందో వివరిస్తుందన్నారు. అందుకే సంస్థలు, ఉద్యోగులకు స్పష్టమైన సమయ పాలన పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. అలా చేస్తే ఉద్యోగులు మెయిల్స్ విషయంలో ఒత్తిడి గురువ్వరని చెప్పారు. Microsoft CEO Satya Nadella warns that employee well-being could suffer from an ever-expanding workday that often now creeps well into the night https://t.co/JC7rCZWInI — Bloomberg (@business) April 7, 2022 "మేం వర్క్ ప్రొడక్టివిటీని కొలాబరేషన్, అవుట్‌పుట్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటాం. అయితే ప్రొడక్టివిటీలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఉద్యోగుల శ్రేయస్సు ఒకటి" అని సత్యనాదెళ్ల చెప్పారు. ఒత్తిడి ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసు. అందుకే ఆ ఒత్తిడిని జయించేందుకు సాఫ్ట్ స్కిల్స్, ఓల్డ్ ఫ్యాషనేడ్ స్కీల్స్ ను(పాత కాలపు నిర్వహణ పద్ధతుల్ని) నేర్చుకోవాలి. ఇక వర్క్ మన వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావితం చూడకుండా ఉండాలంటే జాగ్రత్త వహించాలని ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఉద్యోగులకు హితబోధ చేశారు. చదవండి: దటీజ్ సత్య నాదెళ్ల.. సక్సెస్‌కి కారణాలివే! -
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సత్య నాదేళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) మరణించాడు. చిన్నప్పటి నుంచి సెలెబ్రల్ పాల్సీ అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు జైన్ నాదెళ్ల. సోమవారం ఉదయం జైన్ నాదెళ్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లినట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. జైన్ నాదెళ్ల మృతితో సత్యనాదెళ్ల, అను నాదెళ్ల దంపతులు శోకసముద్రంలో మునిగిపోయారు. తన కుమారుడు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు 2017 అక్టోబరులో తొలిసారిగా సత్యనాదెళ్ల బయటి ప్రపంచానికి వెల్లడించారు. 1996 ఆగస్టు 13న జైన్ నాదెళ్ల జన్మించాడు. -
దటీజ్ సత్య నాదెళ్ల.. సక్సెస్‌కి కారణాలివే!
ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ‘అన్నీ తెలుసు’ అనే ధోరణిని తిరస్కరించే ఏకైక బాస్‌గా సత్య నాదెళ్లకి ఓ పేరుంది. అవసరమైన విషయాలకు దూరంగా.. మిస్టర్ కూల్ ఆటిట్యూడ్‌తో, ఆవిష్కరణలకు-టాలెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే నాదెళ్ల అంటే అందరికీ ఇష్టం. అదీ ప్రత్యర్థి కంపెనీలతో సహా. అదే ఆయన్ని ప్రపంచంలోనే ‘మోస్ట్ అడ్మయిర్డ్’ సీఈవోగా నిలిపింది. మరి ఆయన సక్సెస్‌కి కారణాలు ఏంటో ఓ లుక్కేద్దాం.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ఫార్చ్యూన్(బిజినెస్ మ్యాగజైన్) నిర్వహించే సర్వేలో మరోసారి మోస్ట్ అడ్మయిర్డ్ సీఈవోగా ఎన్నికయ్యారు. విశేషం ఏంటంటే.. ఇప్పుడున్న దానికంటే ఆయనకు మరింత ఉన్నత స్కోరింగ్ ఇవ్వాలన్నది చాలామంది కోరిక కూడా. అంతేకాదు ఈ ఏడాది ఓటింగ్‌లో మోస్ట్ అండర్రేటెడ్ సీఈవోగానూ(వరుసగా ఆరో ఏడాది కావడం విశేషం) నిలిచారు. ఫార్చ్యూన్ వరల్డ్స్ మోస్ట్ అడ్మయిర్డ్ కంపెనీస్ లిస్ట్‌లో సత్య నాదెళ్లకు ఈ ఘనతలు దక్కాయి. ప్రోత్సాహకరమైన నాయకత్వ శైలి, వినయం, విజన్‌తో నాదెళ్ల ఈ గౌరవాన్ని సాధించగలిగారు. ఆ బుక్‌తోనే మొదలైన మార్పు.. ►నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాక.. కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ అందరినీ మార్షల్ రోసెన్‌బర్గ్ రాసిన Nonviolent Communication పుస్తకం చదవమని కోరాడట. ఆ పుస్తకం.. విమర్శ, తీర్పు వంటి వాటిని నిరుత్సాహపరుస్తుంది. అదే సమయంలో మరింత ప్రోత్సాహకరంగా ఎలా ఉండాలనే సూచనలను అందిస్తుంది. అలా ఆ పుస్తకం కంపెనీ సక్సెస్‌లో తొలి భాగం అయ్యింది. ►నాదెళ్ల సమకాలీకులంతా కఠినాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంటే.. నాదెళ్ల మాత్రం మరో దారిలో ముందుకు వెళ్లారు. మంచి అలవాట్లతో కామ్‌గా ఉంటూ.. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌పై ఫోకస్ పెడుతూ టీంను ప్రేరేపిస్తూ ముందుకు తీసుకెళ్లారు. సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించే క్రమంలో.. దూకుడు ప్రవర్తనను సహించేది లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారాయన. ‘‘అన్నీ తెలుసు అనే ధోరణిని కాస్త.. అన్నీ నేర్చుకో’’ అని మార్చేసి మైక్రోసాఫ్ట్‌కు సక్సెస్ బాటలో నడిపించారు. ►ఆవిష్కరణలకు ఆస్కారం ఇస్తూ.. అవసరమైతే దగ్గరగా మాట్లాడేందుకు పరిశోధకులకు సైతం అవకాశం కల్పించారు. బహుశా కార్పొరేట్ సెక్టార్లో ఇంత ఫ్రెండ్లీ బాస్ మరొకరు ఉండరేమో. వాస్తవానికి ఆయన సీఈవోగా బాధ్యతలు స్వీకరించే నాటికి కంపెనీ లాభాల్లోనే ఉంది. కాకపోతే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పెట్టుబడుల ఆధిపత్యంలో మాత్రం కాస్త వెనుకబడి పోయింది. ►ఈ తరుణంలో.. బండిని మళ్లీ పట్టాలు ఎక్కించడానికి మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్లలోనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు స్వయంగా ప్రకటించారాయన. అంతేకాదు.. ఇగోలను పక్కనపెట్టి.. ఇతర టెక్ కంపెనీలతో కలిసి పని చేయాలంటూ ఎగ్జిక్యూటివ్స్‌ను ప్రోత్సహించాడు. మైక్రోసాఫ్ట్‌ను మళ్లీ.. ►మైక్రోసాఫ్ట్ నాయకత్వం చేపట్టాక ఆయన చేసిన మొదటి పని.. గతంలో బ్లాక్ చేసిన ప్రసిద్ధ ప్రత్యర్థి ఆపిల్‌తో కలిసి ఐఫోన్ కోసం ఆఫీస్ ప్రొడక్టివిటీని విడుదల చేయడం. అంతేకాదు మైక్రోసాఫ్ట్‌ను దాని సాఫ్ట్వేర్, సేవలను Linux మరియు Google మరియు Apple వంటి ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తీసుకురావడం ద్వారా విస్తరించాడు. నేడు, కంపెనీ సేల్స్‌ఫోర్స్ మరియు Red Hat వంటి పోటీదారులతో భాగస్వామిగా కొనసాగుతోంది. ►పోటీ ప్రపంచంతో లీనమైన సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రయత్నాలు నష్టపోయాయని కూడా అతను గుర్తించాడు. వెంటనే నోకియా కొనుగోలును రద్దు చేశాడు. కంపెనీని కొత్త దిశలో నడిపిస్తూ, అతను 2016లో $26 బిలియన్లకు లింక్డ్ఇన్ కొనుగోలును పర్యవేక్షించాడు. 2018లో, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను పంచుకోవడంలో తన నిబద్ధతను చూపించడానికి కంపెనీ $7.5 బిలియన్లకు GitHubతో మరో పెద్ద కొనుగోలు చేసింది. గత సంవత్సరం, Xbox Series S, Series X మరియు PCలలో ఆడటానికి మరియు Sony యొక్క ప్లేస్టేషన్ 5తో నేరుగా పోటీ పడేందుకు బెథెస్డా యొక్క మాతృ సంస్థ ZeniMax కొనుగోలును కంపెనీ మరో $7.5 బిలియన్లకు పూర్తి చేసింది. ఇదంతా సత్య నాదెళ్ల హయాంలో సాధించిన ప్రగతే. ►మైక్రోసాఫ్ట్ CEOగా, నాదెళ్ల కంపెనీ మార్కెట్ క్యాప్‌ను సుమారు 300 బిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు పెంచాడు. ప్రస్తుతం Microsoft షేర్లు Google(ఆల్ఫాబెట్), Apple, Meta కంటే ఎక్కువగా ఉన్నాయి. ►తోటి ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులు.. సత్య నాదెళ్లను ఆరాదిస్తారు. ఎందుకంటే.. ఆయన సంప్రదించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. కలుపుగోలుతనం.. చివరకు పోటీదారులను సైతం ఆయనకు ఫిదా అయ్యి అభిమానులుగా మార్చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ ►మైక్రోసాఫ్ట్ చైర్మన్ కమ్ సీఈవోగా సత్య నాదెళ్ల సుపరిచితుడే. హైదరాబాద్(తెలంగాణ)లో పుట్టి, పెరిగిన నాదెళ్ల.. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ, విస్కోన్సిన్: మిల్వాకీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్, చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్‌లో విధేయమైన ఉద్యోగి. పాతికేళ్ల వయసులో(1992)లో నాదెళ్ల మైక్రోసాప్ట్లో చేరారు. ఏడేళ్ల తర్వాత బీసెంట్రల్కి(చిన్న వ్యాపారాలకు వెబ్‌సర్వీసులు అందించడం) ప్రెసిడెంట్ అయ్యారు. 2014లో ఏకంగా సీఈవో అయ్యారు. ►భార్య అనుపమతో పాటు సత్య నాదెళ్లకు ముగ్గురు పిల్లలు. సాహిత్యం మీద ఆసక్తి ఉన్న నాదెళ్ల తరచూ ఈవెంట్లలో పాల్గొనడమే కాదు.. కవితలు సైతం రాస్తారు. క్రికెట్‌కు వీరాభిమాని అయిన నాదెళ్ల.. 2019లో సీటెల్ సౌండర్స్ సాకర్ క్లబ్‌ను ప్రమోట్ కూడా చేశారు. తీసుకోవడమే కాదు.. తిరిగి ఇచ్చేయడంలోనూ సత్య నాదెళ్లది మంచి మనసే. సీటెల్ పిల్లల ఆస్ప్రతి కోసం 15 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చాయారాయన. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే సత్య నాదెళ్లకు.. తాజాగా స్వదేశం తరపున ఆయనకు పద్మభూషణ్ గౌరవం దక్కిన విషయం తెలిసిందే. :::సాక్షి, వెబ్‌స్పెషల్ -
భారత ప్రజలారా.. మీకు కృతజ్ఞతలు.. ఎమోషనలైన సత్య నాదెళ్ల
మాతృదేశాన్ని, ఇక్కడి ప్రజలను తలుచుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భావోద్వేగానికి లోనయ్యారు. గణతంత్రదినోత్సవ వేడుకల వేళ భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎమెషనల్ అయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిలతో ఇక్కడి ప్రజలకు కృతజ్ఞనతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులతో పాటు ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ చెప్పారు. It’s an honor to receive a Padma Bhushan Award and to be recognized with so many extraordinary people. I’m thankful to the President, Prime Minister, and people of India, and look forward to continuing to work with people across India to help them use technology to achieve more. — Satya Nadella (@satyanadella) January 27, 2022 సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్‌కి సైతం కేంద్రం పద్మభూషన్ అవార్డును ప్రకటించింది.. దీనిపై ఆయన స్పందిస్తూ వివిధ రంగాల్లో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తులతో కలిసి ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా విండోస్ 11 యూజర్లు ఎంతో తెలుసా ?
స్మార్ట్ఫోన్లు జన జీవితంలోకి ఎంతగా చొచ్చుకువచ్చినా.. ఆకాశమే హద్దుగా గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ దూసుకుపోతున్నా.. చాపకింద నీరులా మాక్‌పాడ్ ప్రపంచాన్ని చుట్టేస్తున్నా... ఇప్పటికీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు విండోస్ సాఫ్ట్వేర్లే ప్రధాన అండ. విండోస్ 8 ఓస్ నుంచి మైక్రోసాఫ్ట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది,. ఐప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి నమ్మకం ఇంకా మైక్రోసాఫ్ట్ - విండోస్ మీదనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పిన వివరాలే అందుకు తార్కాణం. విండోస్ యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల మంది విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల వెల్లడించారు. ఇందులో ఫస్ట్, థర్డ్ పార్టీవి కూడా ఉన్నాయని వెల్లడించారు. విండోస్ 10తో పోల్చితే విండోస్ 11 వేగం మూడింతలు ఎక్కువ అని తెలిపారు. వీటిని మినహాయిస్తే విండోస్ 7, విండోస్ 8లపై కూడా ఇదే సంఖ్యలో యూజర్ల ఉంటారని అంచనా. దీంతో ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌గా విండోస్ నిలిచింది. టీమ్‌దే ఆధిపత్యం ఇక కోవిడ్ సంక్షోభం తర్వాత వర్చువల్ మీటింగ్స్ సర్వసాధారణం అయ్యాయి. అనేక రకాల యాప్‌లు జనం నోళ్లలో నానుతున్నాయి. అయితే బిజినెస్ వరల్డ్ మాత్రం వర్చువల్ మీటింగ్స్‌కి ఎక్కువగా మైక్రోసాఫ్ట్‌కి చెందని టీమ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. సత్య నాదెళ్ల తెలిపిన వివరాల ప్రకారం ఫార్చున్ 500 కంపెనీల్లో 90 శాతం టీమ్‌పైనే ఆధారపడుతున్నాయి. చదవండి:భవిష్యత్తులో ఇవే కీలకమన్న సత్య నాదెళ్ల -
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్!) -
వర్క్‌ఫ్రం హోం లేకపోతే ఏం.. సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉద్యోగులు ఎప్పటి నుంచి కార్యాలయాలకు రావాలనే విషయంలో స్పష్టమైన విధానం అంటూ ఏదీ రూపొందించుకోలేదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అనేక అంశాలపై ఆయన స్పందించారు. క్లిష్టపరిస్థితుల్లో ఆఫీసులకు రావడం ఎందుకనే భావన ఉద్యోగుల్లో నెలకొంది. 73 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది. ఆఫీస్ వర్క్ ఒత్తిడి పెరిగితే ఉద్యోగులు కంపెనీలు మారేందుకు వెనుకాడటం లేదు. గతంలోనే ఉన్నడూ లేనంతగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఉద్యోగుల ఆందోళన పరిగణలోకి తీసుకుని ప్లెక్లిబులిటీ ఉండే హైబ్రిడ్ పని విధానం వైపు మైక్రోసాఫ్ట్ మొగ్గిందని ఆయన తెలిపారు. టెక్నాలజీతో ఉత్పాదకత పెంపు టెక్నాలజీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వివిధ స్థాయుల్లోని వ్యాపార సంస్థలు తమ ఉత్పాదకతను మరింతగా పెంచుకోవచ్చని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తద్వారా తమ ఉత్పత్తులు, సర్వీసులను చౌకగా అందించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు డిజిటల్ బాట పడుతున్నాయని ఆయన వివరించారు. హైబ్రిడ్ పని ధోరణి పెరుగుతోందని, వ్యాపారాలు మరింత లోతుగా అనుసంధానమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య విశ్వసనీయమైన సంబంధాలు నెలకొనాలంటే ఎల్లలు లేని డిజిటల్ వ్యవస్థ అవసరం అవుతుందని నాదెళ్ల తెలిపారు. ‘ద్రవ్యోల్బణం పెరిగే ఆర్థిక వ్యవస్థలో.. ధరలను కట్టడి చేసే శక్తి డిజిటల్ టెక్నాలజీకి ఉంది. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు టెక్నాలజీ ఊతంతో తమ ఉత్పత్తులు, సర్వీసుల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. చౌకగా అందించవచ్చు‘ అని నాదెళ్ల పేర్కొన్నారు. చిప్‌ల డిజైనింగ్‌లో అవకాశాలు: చంద్రశేఖర్ వచ్చే 5–7 ఏళ్లలో సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల్లో భారత్ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఆర్. చంద్రశేఖర్ చెప్పారు. కంప్యూటింగ్‌కు సంబంధించి రాబోయే రోజుల్లో ఇవి కీలకంగా ఉండనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కంపెనీల్లో టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వినియోగించడం మరింతగా పెరిగిందని ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. వ్యాపార సంస్థలు ఉత్పాదకత పెంచుకోవడానికి, నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, పోటీ పడటానికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు. మరింత పటిష్టంగా భారత్ వృద్ధి: టీసీఎస్ చంద్రశేఖరన్ భారత్ దీర్ఘకాల వృద్ధి గతిపై కరోనా మహమ్మారి ప్రభావం పెద్దగా లేదని దేశీ దిగ్గజం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. కొన్ని ప్రాథమిక అంశాల కారణంగా కాస్త జాప్యం మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఎకానమీ పూర్తి స్థాయిలో పుంజుకున్నాక.. ఈ దశాబ్దంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసే దేశాల్లో భారత్ ముందు ఉంటుందని చెప్పారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ 2022.. నచ్చిన చోట నుంచి పనిచేసే వెసులుబాటు! -
ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీలకు కూడా భారతీయులే సీఈఓలు..!
Here’s a Look at 10 Indian-Origin CEOs: నవంబర్ 29న సీఈఓగా పరాగ్ అగ్రవాల్(45)ను ట్విటర్ కంపెనీ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అరడజనుకు పైగా గ్లోబల్ టెక్ కంపెనీలు భారతీయ-అమెరికన్ల నేతృత్వంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి సంస్థలను భారతీయులు అద్భుతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్ చేరారు. ఇప్పుడు ఎక్కడ చూసిన భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఎలన్ మస్క్ స్పందించారు. భారతీయుల టాలెంట్‌ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ చేసిన ఆసక్తికరమైన ట్వీట్‌కు రీట్వీట్ చేశాడు. పరాగ్ నియామకంతో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇతర ప్రసిద్ధ సంస్థలకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయుల వివరాలు చూద్దాం. సుందర్ పిచాయ్: తమిళ నాడులో జన్మించిన సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్, సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తర్వాత సంస్థ మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుందర్ పిచాయ్ ఎన్నికయ్యారు. అలాగే, 2019 డిసెంబరులో పిచాయ్ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు కూడా సీఈఓ అయ్యారు. సత్య నాదెళ్ల: హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆయన ఆ కంపెనీ చైర్మన్‌గానూ ఎదిగారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్ సంస్థకు ఛైర్మన్, సీఈఓగా కొనసాగుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. అరవింద్ కృష్ణ: భారతీయ సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అరవింద్ కృష్ణ అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబిఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 2020 జనవరిలో జనవరి ఎంపికయ్యారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదువు పూర్తి చేశారు. 1990లలో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఐబీఎంలో చేరారు. గిన్ని రోమెట్టి ఐబీఎం సీఈఓ పదవి నుంచి తప్పుకోవడంతో జనవరి 2020లో ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ట నియమితులయ్యారు. శంతను నారాయణ్: భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ శంతను నారాయణ్ డిసెంబర్ 2007 నుంచి అడోబ్ ఇంక్ చైర్మన్, అధ్యక్షుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. అంతక ముందు 2005 నుంచి కంపెనీ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. శంతను నారాయణ్ భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించాడు. సృజనాత్మక డిజిటల్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ ఫ్రాంచైజీలను పెంచేస్తూ కంపెనీని బాగా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రంగరాజన్ రఘురామ్: భారత సంతతికి చెందిన రంగరాజన్ రఘురామ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ విఎంవేర్ కొత్త సీఈఓగా 2021 జూన్ నెలలో ఎంపికయ్యారు. 2003లో కంపెనీలో చేరిన రఘురామ్ జూన్ 1న సీఈఓ పదివిని చేపట్టారు. విఎమ్ వేర్ ప్రధాన వర్చువలైజేషన్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయశ్రీ ఉల్లాల్: జయశ్రీ వి. ఉల్లాల్ ఒక అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త. జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్వర్క్స్ సీఈఓగా 2008 నుంచి కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆమె ఏఎండీ, సిస్కో కంపెనీల్లోనూ సేవలు అందించారు. లక్ష్మణ్ నరసింహన్: గతంలో పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబర్ 2019లో రాకేష్ కపూర్ తర్వాత రెకిట్ బెంకిసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ సూరి: 1967 అక్టోబరు 10న జన్మించిన రాజీవ్ సూరి ఒక సింగపూర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్చి 1 2021 నుంచి ఇన్మార్శాట్ సీఈఓగా పనిచేస్తున్నారు. అతను గతంలో 31 జూలై 2020 వరకు నోకియా సీఈఓగా ఉన్నారు. దినేష్ సి. పాల్వాల్: పాల్వాల్ 2007 నుంచి 2020 వరకు హర్మన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా పనిచేశారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అతను సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డుకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. పరాగ్ అగ్రవాల్: ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఐఐటీ ప్రవేశ పరీక్షలో 77వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు. -
Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో అనూహ్య పరిణామం
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కంపెనీలో తన పేరిట ఉన్న సగం షేర్లను అమ్మేసుకున్నారు. సుమారు 285 మిలియన్ డాలర్ల విలువైన 8,38,584 షేర్లను గత వారమే సత్య నాదెళ్ల అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తిగా వ్యక్తిగత కారణాలతో ఆయన షేర్లను అమ్మేసుకున్నారని మైకక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే మైకోసాఫ్ట్ ధరలు కొంతకాలంగా యూఎస్ స్టాక్ మార్కెట్లో స్వల్ఫ క్షీణతను చవిచూస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత సీఈవో హోదాలో సత్య నాదెళ్ల తన షేర్లను అమ్మేసుకోవడం విశేషం. అందుకేనా.. ఇదిలా ఉంటే వివాదాస్పద ‘క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్’ నేపథ్యంలోనే నాదెళ్ల షేర్లు అమ్మేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ చట్టం ప్రకారం.. దీర్ఘకాలిక క్యాపిల్ గెయిన్స్ 2,50,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే.. వాళ్లు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్, బిజినెస్ ఓనర్షిప్ అమ్మకాల మీద ఏడు శాతం ట్యాక్స్ విధిస్తుంది ప్రభుత్వం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘సోషల్ స్పెండింగ్ ప్లాన్’ కోసం సెనేటర్లు ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం.. స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయొచ్చు. జనవరి 1, 2022 నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సత్య నాదెళ్ల షేర్లు అమ్మేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. కానీ, మైక్రోసాఫ్ట్ మాత్రం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో భాగంగానే ఆయన అమ్మేసుకున్నట్లు చెబుతోంది. సత్య నాదెళ్ల మాత్రమే కాదు.. ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్లు సైతం కొత్త చట్టం ఎఫెక్ట్‌తో షేర్లను(టెస్లా షేర్లు) అమ్మేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 22, 23వ తేదీల్లో షేర్ల అమ్మకానికి సంబంధించిన ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు తెలుస్తోంది. తాజా షేర్ల అమ్మకంతో ప్రస్తుతం ఆయన దగ్గర మైక్రోసాఫ్ట్‌కి సంబంధించి 8,30,791 షేర్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: ఎలన్ మస్క్ షేర్ల అమ్మకం.. ఫలితం ఇదే! -
నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా పనిచేసిన సత్య నాదెళ్ల ఆ కంపెనీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో వైవిధ్య భరితమైన నిర్ణయాలతో సంస్థను లాభాల దిశగా నడిపించిన నాదేళ్ల తన కెరియర్లో టిక్‌టాక్ ఒప్పందం విచిత్రమైన ఒప్పందం నేనుఇప్పటికీ దాని మీదే పనిచేస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ గతేడాది సోషల్ మీడియా యూప్ టిక్‌టాక్‌ని స్వాధీనం చేసుకునే ఒప్పందం విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: వలలో పడ్డ భారీ షార్క్.. పాత రికార్డులన్నీ బ్రేక్) ఈ మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో టిక్‌టాక్ మాతృక సంస్థ బైట్ డ్యాన్స్‌ను వినియోగదారుల డేటా భద్రత దృష్ట్య యూఎస్ వర్షన్ నుంచి తొలగించమన్న సంగతిని గుర్తు చేశారు. దీంతో గతేడాది ఆగస్టు 2020లో ట్రంప్ ప్రభుత్వంతో కుదుర్చకున్న ఒప్పందం కాస్త ఆయన పదవీచ్యుతుడు కావడంతోనే రద్దు అయ్యిపోయిందని అన్నారు . అంతేకాదు చైనాకు చెందిన టిక్‌టాక్, విచాట్‌లను నిషేధిస్తూ గతంలో దేశాధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో కోడ్ సమావేశంలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.... "మైకోసాఫ్ట్ సెక్యూరిటీ, పిల్లల భద్రత, క్లౌడ్ నౌపుణ్యాలను టిక్‌టాక్ యాప్‌లోకి తీసుకురావడం కోసం ఎదురుచూస్తున్నాం. తాను చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చకున్నాను గానీ టిక్‌టాక్ విషయంలో ఇలా జరగడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను. టిక్ టాక్ జోలికి మేము వెళ్లలేదు అదే మా వద్దకు వచ్చింది. తాము అభివృద్ధి చేసిన చైల్డ్ భద్రతకు సంబంధించిన ఎక్స్‌బాక్స్ వీడియో గేమింగ్ టూల్స్, బిజినెస్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ ఇన్ వంటి ఆత్యాధునిక టెక్నాలజీ సేవల పట్ల టిక్‌టాక్ మాతృక సంస్థ బైట్‌డ్యాన్స్ సీఈవో జాంగ్ యిమింగ్ని కూడా ఆకర్షితులయ్యారని చెప్పారు. ఆ ఒప్పందం విషయంలో జో బెడెన్ ప్రభుత్వ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చెప్పలేను. అయితే జోబైడెన్ ప్రభుత్వం ఆ యాప్‌లు అమెరికా జాతీయ భద్రతకు విసిరే సవాళ్లపై స్వయంగా సమీక్ష చేస్తున్నట్లు మాత్రమే తెలిపింది. అంతేకాదు క్రిప్టోకరెన్సీ నిబంధనల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికీ మద్దతిస్తున్నాం. ప్రస్తుతం నేను చేస్తున్నదాంతో సంతోషంగా ఉన్నా" అని పేర్కొన్నారు. (చదవండి: బూస్టర్ డోస్ తీసుకున్న బైడెన్) -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్‌బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్‌బెల్.. మొదట్లో ఫుట్‌బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్‌బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్‌బెల్. ►మార్క్ జుకర్‌బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్‌గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్‌ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్‌తో దగ్గరగా ఎలన్‌మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్‌గేట్స్‌కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్‌కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్‌ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్‌గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
ఐటీ శిఖరం పై తెలుగోడు
-
ఏమా మంత్ర మహిమ?
‘సత్య నాదెళ్ల’ సమకాలీన ఐటీ జగత్తులో, ముఖ్యంగా కెరీర్ దృక్పథం గల ఆశావహ యువతరానికి రెండు పదాల మంత్ర స్మరణ! వృత్తిలో ఎదుగుతున్న యువకులకైతే, ఆ పేరు తలచుకుంటేనే ఒళ్లు ఒకింత గగుర్పాటు కలిగే ప్రేరణ! భారత దేశం నుంచి వెళ్లి అమెరికన్ ఆయిన సత్య, దాదాపు అన్ని వయసుల వారికీ నిలువెత్తు స్ఫూర్తి. దిగ్గజ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉంటూనే ఇప్పుడు చైర్మన్ స్థాయికి ఎదగడంతో ఆయన పేరు మళ్లీ ప్రపంచమంతా మార్మోగుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ తర్వాత, కంపెనీలో కీలకమైన ఈ జోడు పదవులు చేపడుతున్నది సత్యనే! భారతదేశానికి చెందిన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు సుమారు పదిలక్షల మంది వరకు అమెరికాలో ఉంటారనేది అంచనా! కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి కాగానే అమెరికా వెళ్లాలని, ఉన్నత చదువులు చదివి వీలయితే అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి, క్రమంగా పైకెదగాలనీ కలలు కంటుంటారు. ఇవేం కొత్త కాదు! వాటికి ‘డాలర్ డ్రీమ్స్’ అనే ముద్దు పేరూ ఉంది. కొందరి కలలు కల్లలవుతున్నా, నిజం చేసుకునే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. అవకాశాల్లాగే, ఎదుగుదలకు ఎదురవుతున్న సవాళ్లు కూడా ఇటీవల అదే స్థాయిలో పెరిగాయి. పేరున్న పెద్ద విశ్వవిద్యాలయాలతో పాటు సాధారణ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు దక్కించుకోవడం, డిగ్రీలు పొందడం భారతీయ యువతకు పెద్ద కష్టమేం కాదు. కానీ, ఉద్యోగాలకు పోటీ బాగా పెరిగింది. అక్కడి కంపెనీల్లో చేరే క్రమంలో మధ్యవర్తులుగా వ్యవహరించే ‘కన్సల్టెన్సీ ఎజెన్సీ’ ప్రాయోజిత తాత్కాలిక ఉద్యోగ దశ దాటి, పూర్తికాలపు ఉద్యోగం దక్కించుకోవడమే గగనం. ముఖ్యంగా చైనా వంటి ఇతర ఆసియా దేశాల ఔత్సాహిక యువతరమే భారతీయులకు పెద్ద పోటీ! ఇక కంపెనీల పైస్థాయి ఉద్యోగాల్లోకి ఎదగడం ఇంకా కష్టం. అయినప్పటికి, గత దశాబ్ద కాలంలో భారత దేశానికి, భారత సంతతికి చెందిన మెరికల్లాంటి వారు బహుళజాతి ఐటీ, ఇతర అనుబంధ కంపెనీలకు అధిపతులుగా ఎదుగుతున్న తీరు ప్రపంచాన్నే విస్మయ పరచింది. తెలివితేటలతో పాటు నిబద్దత, క్రమశిక్షణ, కష్టపడే తత్వమే వారి గెలుపు రహస్యం. ఆ క్రమంలో, ఏడేళ్ల కిందట మైక్రోసాఫ్ట్‌కి సత్య సీఈవో కావడమే విశేషమంటే, ఇప్పుడు చైర్మన్ కూడా కావడం పెద్ద ముందడుగు. 143 బిలియన్ డాలర్ల వార్షిక రాబడి. 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విస్తరణ కలిగిన మైక్రోసాఫ్ట్, ఆపిల్ తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ. చరిత్ర సృష్టించడమే గొప్ప అంటే, చరిత్రను తిరగరాయడం కొందరికే సాధ్యం. దాదాపు మూడు దశాబ్దాల కింద మైక్రోసాఫ్ట్‌లో చేరి మొదలెట్టిన ప్రయాణంతో సత్య చేసిందదే! దశాబ్దాల తరబడి భారతీయ ఇంజనీర్లు అమెరికా చేరి డిజైన్, డెవలప్మెంట్ వంటి పాత్రలకే పరిమిత మయ్యారు. అక్కడక్కడ ఒకరిద్దరి మెరుపులు మినహా... చాలా కాలం జరిగిందదే! సత్య నాదెళ్ల (ఎమ్మెస్), సుందుర్ పిచ్చయ్య (గూగుల్–ఆల్ఫబెట్), అజయ్‌పాల్ సింగ్ భంగ (మాస్టర్‌కార్డ్), శంతను నారాయణ్ (అడోబ్) వంటి వారు చరిత్రను తిరగ రాశారు. మారే పరిస్థితుల్ని బట్టి, మార్కెట్ అవసరాల్ని గుర్తెరిగి అసాధారణ ప్రజ్ఞాపాటవాలు చూపించడం ద్వారా అంచెలంచెలు ఎదిగారు. ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలను పైస్థాయికి తీసుకువెళ్లారు. సీఈవోలయ్యారు. కొందరు చైర్మన్లు కూడా అయి, జోడుపదవుల్లో ఉన్నారు. భారతదేశం బయట కేంద్ర కార్యక్షేత్రం ఉన్న సుమారు 60 (వందకోట్ల డాలర్ల పైబడి మార్కెట్ విస్తరణ గల) అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలకు భారతీయ, భారత సంతతి నిపుణులే నేతృత్వం వహిస్తున్నారు. నికేష్ అరోరా (పాలో ఆల్టో నెట్వర్క్), అర్వింద్ కృష్ణ (ఐబీఎం), వివేక్ శంకరన్ (ఆల్బెర్ట్సన్స్), వసంత్ నర్సింహ (నోవర్టిస్), ప్రేమ్ వత్స (ఫెయిర్‌ఫాక్స్), సంజయ్ మెహంత్ర (మైక్రాన్ టెక్), లక్ష్మీ నర్సింహన్ (ఆర్బీ), సోనియా సింజల్ (జీఏపీ), థామస్ కురియన్ (గూగుల్ క్లౌడ్), జార్జి కురియన్ (నెట్ యాప్), సందీప్ మెత్రానీ (వీవర్క్) లాంటి వాళ్లు ఆయా కంపెనీలకు నేతృత్వం వహిస్తూ భారత జయ పతాకాన్ని ఐటీ, మార్కెట్ విశ్వవీధుల్లో రెపరెపలాడిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన భారతదేశ యువతరం సత్య నాదెళ్ల నుంచి ఎంతో నేర్చుకోవాలి. నిరాడంబరం, నిగర్విగా ఉండే సత్య సదా నగుమోముతో విజయానికే ఓ ప్రతీకలా కనిపిస్తారు. మాట తీరులోనూ వినయం–పరిపక్వత పోటీ పడతాయి. తన పని పట్ల, తమ సేవల్ని వాడుకునే వినియోగదారుల పట్ల, పెట్టుబడి భాగస్వాములైన షేర్ హోల్డర్ల పట్ల ఆయనకు అవ్యాజమైన నిబద్ధత, ప్రేమ. తాను సీఈవోగా బాధ్యత చేపట్టేనాటికి ఇబ్బందుల్లో ఉన్న కంపెనీ ప్రాధాన్యతలను మార్చి క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిఖరస్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనది. ఉద్యోగుల పట్ల ప్రేమను రంగరించి, పని సంస్కృతినే మార్చివేశారు. అందుకు తాజా సర్వే ఫలితాలే నిదర్శనం. పోల్డాటా ప్రకారం 95 శాతం మంది, ‘మైక్రోసాఫ్ట్ ఉద్యోగులమైనందుకు గర్విస్తున్నామ’న్నారు. ‘బోర్డుకు సత్య ఎజెండా ఏర్పరుస్తారు. తన లోతైన అనుభవంతో.. కంపెనీ ఎదుగుదల అవకాశాలు వెతికి, వ్యూహాలు ఖరారు చేయడమే కాక సమస్యల్ని పరిష్కరించే మార్గాలు చూపుతారు’ అని నియామక సమయంలో కంపెనీ చేసిన ప్రకటనే ఆయన ప్రతిభకు నిదర్శనం. అదీ సత్య నాదెళ్ల! -
సత్య నాదెళ్లకు ‘డబుల్’ ఆనందం
న్యూయార్క్: భారతీయ అమెరికన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పనితీరుకు పదోన్నతి లభించింది. ఏడేళ్లుగా సీఈఓ బాధ్యతల్లో ఉన్న ఆయనకు కంపెనీ చైర్మన్‌గానూ బాధ్యతలను అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చైర్మన్ బాధ్యతల్లో ఉన్న జాన్ థామ్సన్ ముఖ్య ఇండిపెండెంట్ డైరెక్టర్ బాధ్యతల్లోకి తిరిగి వెళ్లనున్నారు. బోర్డు స్వతంత్ర డైరెక్టర్లు ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2014లో మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు థామ్సన్ ముఖ్య స్వతంత్ర డైరెక్టర్ బాధ్యతలనే నిర్వహించడం గమనార్హం. టెక్నా లజీ ఎగ్జిక్యూటివ్‌గా థామ్సన్‌కు దశాబ్దాల అనుభవం ఉంది. 2014లో సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా ప్రకటించిన బిల్‌గేట్స్.. చైర్మన్ పదవికి థామ్సన్‌ను ప్రతిపాదిస్తూ ఆ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నారు. నూతన పదవిలో సత్య నాదెళ్ల కంపెనీ బోర్డు ముందు ఎజెండాను ఉంచడంతోపాటు సరైన వ్యూహాత్మక అవకాశాలను వెలుగులోకి తీసుకురావడం, కీలకమైన సమస్యలను గుర్తిం చి వాటి పరిష్కారాలను బోర్డు దృష్టికి తీసుకువస్తారని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2014లో స్టీవ్ బాల్మర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో పగ్గాలు స్వీకరించిన సత్య నాదెళ్ల.. ఏడేళ్ల తన నాయకత్వంతో క్లౌడ్ కంప్యూటింగ్‌లో మైక్రోసాఫ్ట్‌ను దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దినట్టు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. దీంతో కంపెనీకి లాభాల వర్షం కురియడమే కాకుండా.. 2 లక్షల కోట్ల డాలర్లకు మార్కెట్ విలువ విస్తరించినట్టు పేర్కొంది. సత్య రాక ముందు మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్స్ వ్యాపారంలో చేతులు కాల్చుకుంది. కానీ, సత్య నాదెళ్ల కంపెనీకి భవిష్యత్తునిచ్చే విభాగాలపై దృష్టి సారించారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీలో మైక్రోసాఫ్ట్‌ను బలంగా ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. 2016లో లింక్డ్ఇన్ కొనుగోలు సైతం ఆయన వ్యూహంలో భాగమే. సత్య పనితీరు కంపెనీ బ్యాలెన్స్షీట్లో స్పష్టంగా ప్రతిఫలించింది. దాంతో మైక్రోసాఫ్ట్ షేరు ఏడేళ్లలో 150% లాభాలను ఇచ్చింది. ఆ పనితీరుకు కితాబుగా కంపెనీ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. -
Microsoft : నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల
-
Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల
సాక్షి, న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన, తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో ఘనతను సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ జాన్ తాంసన్ స్థానంలో, ప్రస్తుత సీఈవోను కొత్త ఛైర్మన్‌గా కంపెనీ ఎంపిక చేసింది. 2014 లోమైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కాగా సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తరువాత చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తాంసన్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్టీవ్ బాల్మెర్ నుండి 2014 లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల, లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అనేక డీల్స్‌తో మైక్రోసాఫ్ట్ వృద్దిలో కీలకపాత్ర పోషించారు.అయితే దాతృత్వ పనులు నిమిత్తం బోర్డు నుంచి వైదొలగుతానని బిల్‌గేట్స్ ప్రకటించిన సంవత్సరం తరువాత ఉన్నత స్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ల మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బిల్‌గేట్స్ విడాకులు, ఉద్యోగితో గేట్స్ సంబంధాలపై దర్యాప్తు జరిపినట్లు కంపెనీ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గేట్స్‌ను బోర్డునుంచి తొలగిస్తుందా అనే దానిపై స్పందించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. -
ఇంజనీర్‌తో బిల్‌గేట్స్ ఎఫైర్.. సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఆయనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలగాల్సి వచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తాజాగా స్పందించారు. అప్పటికి, ఇప్పటికి కంపెనీలో చాలా మార్పులు వచ్చాయన్నారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల బిల్ గేట్స్ పేరు ప్రస్తావించకుండా ఈ అంశంపై స్పందించారు. ‘‘2000 సంవత్సరంతో పోలిస్తే కంపెనీలో పరిస్థితులు ఇప్పుడు చాలా భిన్నంగా ఉన్నాయి. చాలా మార్పులు సంభవించాయి. కంపెనీలో వైవిధ్యం, భిన్న సంస్కృతులు ప్రతి రోజు అభివృద్ధి అయ్యే వాతావారణాన్ని మేం సృష్టించామని నేను భావిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశమని నేను భావిస్తున్నాను. దాని మీదనే ప్రత్యేకంగా దృష్టి సారించాను’’ అని తెలిపారు. ‘‘మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి గురించి ఏవైనా ఆరోపణలను లేవనెత్తినప్పుడు అవతలి వారి కంఫర్ట్ గురించి కూడా ఆలోచించాలి. లేవనెత్తిన ఆరోపణలను పూర్తిగా దర్యాప్తు చేయగలిగేలా చూసుకోవాలి. అప్పటి వరకు మనకు తోచినవిధంగా ఊహించుకుని వారిని ఇబ్బంది పెట్టకూడదు" అని నాదెళ్ల తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. చదవండి: ఇంజనీర్‌తో ఎఫైర్: అందుకే బిల్ గేట్స్ రాజీనామా?! -
కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం
సాక్షి,న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. రోజులకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలోముఖ్యంగా తీవ్ర ఆక్సిజన్ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించనుట్టు ప్రకటించారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం,ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే ఈ సందర్బంగా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. భారతదేశంలో తీవ్రయవుతున్నకోవిడ్ సంక్షోభం చూసి తల్లడిల్లిపోతున్నట్టు చెప్పారు. గూగుల్ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంతోపాటు, క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్ పిచాయ్ వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్తాయిలో 3.52 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు కాగా 2812 మరణాలు నమోదైనాయి. మొత్తం 2,19,272 బాధితులు ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్, నిత్యావసర మందుల సరఫరా కొరత నేపథ్యంలో బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌లు, 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య సామాగ్రితో ఎయిర్ ఇండియా విమానం ఆదివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయింది. I am heartbroken by the current situation in India. I’m grateful the U.S. government is mobilizing to help. Microsoft will continue to use its voice, resources, and technology to aid relief efforts, and support the purchase of critical oxygen concentration devices. — Satya Nadella (@satyanadella) April 26, 2021 -
భవిష్యత్తులోనూ వర్క్ ఫ్రం హోం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా పరిచయమైన వర్క్ ఫ్రం హోం పద్ధతి ఇకపై కూడా కొనసాగుతుందని, ఐటీ వంటి నాలెడ్జ్ వర్కర్లతో పాటు ఆరోగ్య రంగంలో పని చేసే వారికీ అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. అయితే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల ఉత్పాదకతతో పాటు వారి సంక్షేమానికి సంబంధించి మరిన్ని డిజిటల్ టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ తయారు చేసిన హాలోలెన్స్ వంటి పరికరాలతో వైద్యులు ఇంటి నుంచే రోగులను పరిశీలించి వైద్యం అందించే రోజులు రావాలని ఆకాంక్షించారు. 2రోజుల బయో ఆసియా సదస్సులో భాగంగా మంగళవారం జరిగిన ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సత్య నాదెళ్ల చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ –19 వల్ల భిన్న రంగాలు కలసి పనిచేసే అవకాశం వచ్చిందని కేటీఆర్ అడిగిన ఓ ప్రశ్నకు సత్య నాదెళ్ల సమాధానం ఇచ్చారు. వైద్య రంగంలో కృత్రిమ మేధతో పాటు పలు అత్యాధునిక టెక్నాలజీల వాడకానికి ఉన్న అవరోధాలను తొలగించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని విశ్లేషించే పద్ధతులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. స్టార్టప్‌లు కీలకం.. ‘కంప్యూటింగ్, బయాలజీ సమన్వయంతో పనిచేయడం మొదలైతే జీవశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయి. భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేసేందుకు ఓ కంపెనీ పనిచేస్తోంది. అపోలో ఆసుపత్రులు టెక్నాలజీ సాయంతో రోజంతా రోగులకు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేసింది. అతి తక్కువ ఖర్చుతో వైద్య సలహాలను అందించేందుకు మైక్రోసాఫ్ట్ పనిచేస్తోంది. పేషెంట్ కేర్, మందులు కనుగొనడంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి’అని సత్య నాదెళ్ల వివరించారు. పన్ను రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్ భారత్ సృజనాత్మక శక్తిగా ఎదిగేందుకు కేంద్రం తగిన విధానాలు రూపొందించాల్సిన అవసరముందని కేటీఆర్ పేర్కొన్నారు. బయో ఆసియా సదస్సులో భాగంగా నిర్వహించిన సీఈవో కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ.. ఉత్పాదకతకు, పరిశోధనలపై పెట్టిన ఖర్చులకు కేంద్రం లింకు పెట్టడం ద్వారా కొన్ని రకాల పన్ను రాయితీలను తొలగించిందని, దీని ప్రభావం ఆత్మనిర్భర భారత్‌పై పడుతుందని పేర్కొన్నారు. ఫార్మా రంగంలో మందుల తయారీలో కీలకమైన మాలిక్యుల్స్ ఆవిష్కరణలో వెనుకబడిపోయామని పేర్కొన్నారు. దుర్వినియోగం అవుతున్నందుకే.. కేటీఆర్ అభిప్రాయాలపై నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పందిస్తూ.. పన్ను సబ్సిడీలు దుర్వినియోగమైన కారణంగానే వాటిని ఉత్పాదకతతో ముడిపెట్టాల్సి వచ్చిందని, కేంద్రం ఇప్పటికే తన వంతు కృషి చేసిందని, ఇకపై పరిశోధనలపై పారిశ్రామిక రంగం మరిన్ని నిధులు వెచ్చించాలని సూచించారు. ఫార్మా రంగం నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని బయోకాన్ అధ్యక్షురాలు కిరణ్ మజుందార్ షా సూచించారు. అంతర్జాతీయ పేటెంట్లను పొందేందుకు కంపెనీలు పెడుతున్న ఖర్చును ఆర్ అండ్ డీ ఖర్చులుగా పరిగణించట్లేదని, సృజనాత్మకతను పెంచాలంటే పన్ను రాయితీలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు. -
సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఖాతాలకు సంబంధించి కొన్ని కఠినమైన, స్పష్టమైన చట్టాలను తీసుకొనిరావాలి పేర్కొన్నారు. "ప్రధానంగా ప్రజాస్వామ్య దేశాలలో సోషల్ మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అసత్య, హింస ప్రేరేపిత ఖాతాలకు సంబందించిన విషయంలో కచ్చితంగా కఠినమైన చట్టాలు, నిబంధనల రూపొందించాలని" బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. -
జెఫ్ బెజోస్ కు టెక్ దిగ్గజాల అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ ఈ ఏడాది చివరలో అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నట్లు ప్రకటించారు. జెఫ్ బెజోస్ తీసుకున్న నిర్ణయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం అభినందించారు. అమెజాన్ తదుపరి సీఈఓ ఆండీ జాస్సీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జెఫ్ బెజోస్ కు తన ఫీచర్ ప్రాజెక్ట్స్ డే వన్ ఫండ్, బెజోస్ ఎర్త్ ఫండ్ కు ఇండియన్-అమెరికన్ టాప్ ఎగ్జిక్యూటివ్ తన శుభాకాంక్షలు తెలిపారు.(చదవండి: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) Congrats @JeffBezos , best wishes for Day 1 and Earth fund. Congrats @ajassy on your new role! — Sundar Pichai (@sundarpichai) February 2, 2021 మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల: జెఫ్ బెజోస్, ఆండీ జాస్సీ మీరు కొత్త స్థానాలను చేపడుతున్నందుకు శుభాకాంక్షలు. గతంలో మీరు సాధించిన వాటికి తగిన అర్హత ఉంది అని అన్నారు. Congratulations to @JeffBezos and @ajassy on your new roles. A well-deserved recognition of what you have accomplished. — Satya Nadella (@satyanadella) February 2, 2021 27 ఏళ్ల క్రితం 1994లో మిస్టర్ బెజోస్ ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు అమెజాన్‌ను ప్రారంభించిన బెజోస్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ప్రస్తుత ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీగా అమెజాన్ నిలిచింది. బెజోస్ తరువాత అమెజాన్ సీఈఓ బాధ్యతలను స్వీకరించనున్న ఆండీ జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపతిగా ఉన్నారు. 1997లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన జాస్సీ అమెజాన్‌లో ఉద్యోగిగా చేరారు. బెజోస్‌కు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. కాలక్రమంలో సంస్థలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2006లో అమెజాన్ వెబ్ సేవలకు నాయకత్వం వహిస్తూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలతో పోటీపడే స్థాయికి దాన్ని తీర్చిదిద్దిన ఘనత జాస్సీది. -
క్రికెట్ రంగంలోకి ప్రముఖ వ్యాపారవేత్తలు
న్యూయార్క్ : కార్పొరేట్ రంగంలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌లు తమదైన ముద్ర వేశారు. తాజాగా వీరిద్దరూ క్రికెట్ రంగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అమెరికా క్రికెట్ ఎంటర్పప్రైజస్(ఏసీఈ) మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ(ఎంఎల్సీ) పేరుతో లీగ్ నిర్వహించనుంది. ఈ లీగ్‌లో ఇప్పటికే కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ పెట్టుబడులు పెట్టినట్టు స్వయంగా వెల్లడించారు. తాజాగా భారత సంతతికి చెందిన సత్య నాదేళ్ల, శంతను నారాయణ్‌లు ఈ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కూడా ఎంఎల్సీ లీగ్‌లో పెట్టుబడులు పెట్టనన్నుట్లు తెలిసింది. అమెరికాలో క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకే ఈ లీగ్‌ను ప్లాన్ చేసినట్లు ఏసీఈ కో ఫౌండర్ విజయ్ శ్రీనివాసన్ వెల్లడించారు. (చదవండి : టీమిండియాతో మ్యాచ్ : ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ) -
‘పని చేస్తూ నిద్రించేలా ఉన్నారు: సత్యా నాదెళ్ల
న్యూయార్క్ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో అనివార్యంగా మారిన వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచి పని)తో మైక్రోసాఫ్ట్ భారీగా లాభపడినా టెక్ దిగ్గజం సీఈవో సత్య నాదెళ్ల మాత్రం ఈ పద్ధతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోంతో లాభాలున్నా ఇది సంక్లిష్టతలతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ మీటింగ్‌లతో ఉద్యోగులు అలసిపోతారని, పని వాతావరణం నుంచి ప్రైవేట్ జీవితానికి మారడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. వాల్‌స్ర్టీట్ జర్నల్ సీఈఓ కౌన్సిల్ భేటీలో ఆయన మాట్లాడుతూ మీరు ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు పనిచేస్తూ నిద్రిస్తున్నట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. వీడియో సమావేశాలు ఉత్సాహపూరితంగా ఉన్నా 'ఉదయాన్నే మీ మొదటి వీడియో సమావేశానికి ముప్పై నిమిషాల పాటు వీడియోలో ఏకాగ్రతతో వ్యవహరించడం కీలకం కావడంతో ఆపై అలిసిపోయే అవకాశం ఉంద’ని అన్నారు. దూరం నుంచి పనిచేయడం వల్ల కార్యాలయంలో ఉండే ప్రయోజనాలను కోల్పోతామని చెప్పుకొచ్చారు. వీడియో సమావేశాలు లాంఛనంగా మారాయని, సమావేశాల ముందు, తర్వాత పనులు చక్కబెట్టాల్సి వస్తుందని చెప్పారు. పని, వ్యక్తిగత కార్యకలాపాల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలనేది మహమ్మారి తనకు బోధించిందని చెప్పారు. తన షెడ్యూల్‌పై తాను ఎక్కువగా దృష్టిసారించానని తెలిపారు. దూరం నుంచి పనిచేస్తూ కొత్తగా విధుల్లో చేరినవారిని మీరు సంస్థలోకి ఆహ్వానించాలని, శిక్షణ, నైపుణ్య సముపార్జన, నైపుణ్యాలను తాజాపర్చడం కీలక అంశాలుగా ముందుకొచ్చాయని చెప్పారు. కాగా, వర్క్ ఫ్రం హోం పద్ధతి విశ్వవ్యాప్తంగా తప్పనిసరి కావడంతో క్లౌడ్ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇంటర్నెట్ భద్రతపై సోషల్ మీడియా ఫోకస్ ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లు ఇంటర్నెట్ భద్రతపై దృష్టిసారించాలని సత్య నాదెళ్ల ఇదే సమావేశంలో పిలుపు ఇచ్చారు. ఇంటర్నెట్ భద్రతకు పెద్దపీట వేస్తూ సోషల్ మీడియాలో కీలక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ తన ఎక్స్‌బాక్స్ గేమింగ్ వేదిక ద్వారా కంటెంట్ సంబంధిత అంశాలను పరిష్కరించడంలో అనుభవం సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల -
సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం
సాక్షి, అనంతపురం : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం చూపారు. రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం ఆమె 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనుపమ నాదెళ్లను అభినందించారు. (నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల) దాతలు ఇచ్చిన ఆర్ధిక సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి తెలిపారు. కాగా అనుపమ తండ్రి వేణుగోపాల్ ఐఏఎస్ అధికారి. పలు ప్రాంతాల్లో ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా దేశమంతా పర్యటించారు. అప్పుడే అక్కడ సమస్యలను తెలుసుకున్న అనుపమ తన వంతు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల
న్యూఢిల్లీ: ప్రపంచంలో పెద్ద కంపెనీకి బాస్ అయినా నాన్నకు బిడ్డే కదా. భౌతికంగా ఆయన దూరమైనా... పంచిన ప్రేమనురాగాలు ఎల్లప్పుడూ గుండెల్లో పదిలంగా దాగుంటాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి లింక్డ్ ఇన్ లో తనివితీరా రాసుకొచ్చారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల ముఖంలోని చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు. యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్ లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలోనూ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోనూ వివిధ పదవుల్లో పని చేశారు. -
సత్య నాదెళ్లకు ఉద్యోగుల ఈమెయిల్
వాషింగ్టన్: ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ (46) హత్యోదంతంతో అమెరికా అట్టుడుకుతోంది. నిరాయుధులైన నల్లజాతీయులను పోలీసులు హత్య చేయడంపై జాత్యహంకార వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు ఐటీ దిగ్గజాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ సీఈవో సత్య నాదెళ్లకు పంపించిన ఈమెయిల్ సందేశం ఆసక్తికరంగా మారింది. సియాటెల్ పోలీసు విభాగం, ఇతర చట్ట అమలు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు 200 మందికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సీఈఓ సత్య నాదెళ్ల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్ట్ డెల్బెన్‌లను ఉద్దేశించి అంతర్గత ఇ-మెయిల్ ద్వారా విజ్ఙప్తి చేశారు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) వన్‌జీరో.మీడియం నివేదిక ప్రకారం "మా పొరుగు ప్రాంతాన్ని వార్‌జోన్‌గా మార్చారు" అనే పేరుతో ఈ సందేశాన్ని పంపారు. సియాటెల్ పోలీసు విభాగం (ఎస్పీడి) ఇతర చట్ట సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడంతోపాటు బ్లాక్ లైవ్స్ మేటర్ (బీఎల్ఎమ్) ఉద్యమానికి అధికారికంగా మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే సియాటెల్ నగర మేయర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమలో ప్రతి ఒక్కరం ఎస్పీడీ అమానవీయ దాడులకు బాధితులమని లేఖలో పేర్కొన్నారు. -
జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !) ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho — Satya Nadella (@satyanadella) June 1, 2020 Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW — Sundar Pichai (@sundarpichai) May 31, 2020 -
జియో మరో మెగా డీల్‌కు సిద్ధం!
సాక్షి, ముంబై : రిలయన్స్ సొంతమైన డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్ మరో మెగా డీల్ ను తన ఖాతాలో వేసుకోనుంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలనుంచి పెట్టుబడులను సాధించిన జియో త్వరలోనే గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తో మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. (రిలయన్స్ సామ్రాజ్యంలోకి మరో వారసుడు) ముకేష్ అంబానీ నేతృత్వంలోని జియోలో సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుందనే ఊహాగానాలు ఉన్నాయని మింట్ నివేదించింది. ఈ చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయనీ, తుది ఒప్పంద వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయని తెలిపింది. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా తన సేవలను మరింత విస్తరించ నున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ప్రధానంగా అజూర్ క్లౌడ్ సేవలను క్యాష్ చేసుకోవటానికి భారతదేశం అంతటా డేటా సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రత్యర్థులకు గుబులు : దూసుకొచ్చిన జియో మార్ట్) కాగా ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తోపాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజ సంస్థల నుండి 10 బిలియన్ డాలర్ల (రూ. 78,562 కోట్లు) పెట్టుబడులను జియో సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే.. విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు -
శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా కట్టడి, దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా దాదాపు ఉద్యోగులందరూ ఇంటినుంచే సేవలను అందిస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ దిగ్గజాలనుంచి సాధారణ సంస్థ దాకా ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్న సమయంలో సిబ్బంది శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసే విధానాన్ని తోసి పుచ్చారు. దీని వలన ఉద్యోగుల్లో అనేక దుష్పరిణామా లుంటాయని పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఎంచుకున్న ఉద్యోగులకు వ్యాయామం ఎలా, వారి మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రిమోట్ గా పనిచేయడం అంటే మనుషుల మధ్య సామాజిక బంధాలను నాశనం చేయడమే అన్నారు. (‘వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు’) శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఉద్యోగులకే ఎక్కువ ప్రమాదం వుంటుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు సమాజంలో కలవలేని పరిస్థితులు వస్తాయని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. దీని వల్ల కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. సమావేశాల్లో పాల్గొనేటప్పుడు భౌతికంగా కలవడానికి, ఆన్లైన్లో వర్చువల్ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కలవడానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. భౌతిక, వ్యక్తిగత సమావేశాల ప్రయోజనాలను ఇవి భర్తీ చేయ లేవన్నారు. అంతేకాదు అంతా రిమోట్ సెటప్ గా మారిపోవడం అంటే.. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి జారి పోవడమేనని ఆయన పేర్కొన్నారు. (కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం) కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఫేస్బుక్, ఆల్ఫాబెట్ (గూగుల్) ఇతరులు తమ ఉద్యోగులను ఇంటి నుండి సంవత్సరం చివరి వరకు పని చేయమని కోరిన తరువాత ట్విటర్ కూడా ముందుకొచ్చింది. ప్రధానంగా మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత కూడా తన సిబ్బందికి ఇంటినుండి 'ఎప్పటికీ' పనిచేసుకోవచ్చనే అవకాశాన్ని ట్విటర్ ప్రకటించిన తరువాత సత్య నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మైక్రోసాఫ్ట్ వర్క్ ఫ్రం హోం విధానాన్ని అక్టోబర్ వరకు పొడిగించింది. -
ట్రంప్ టీంలో మన దిగ్గజాలు
వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. వివిధ రంగాలకు అమెరికా అధ్యక్షుడు వివిధ పరిశ్రమలు, విభాగాలకు చెందిన 200 మందికి పైగా అగ్రశ్రేణి లీడర్లు, డజనుకు పైగా ఇతర నిపుణులతో వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరంతా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై సిఫారసులను అందించనున్నారు. వీరిలో భారత సంతతికి చెందిన ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు చోటు చేసుకోవడం విశేషం. కరోనా పై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ టీంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో సహా ఆరుగురు భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలను ట్రంప్ ఎంపిక చేశారు. తెలివైన, ఉత్తమమైన ఈ నిపుణులు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళికలను, సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారని ట్రంప్ ప్రకటించారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ , టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, ఫియట్ క్రిస్లర్ మైక్ మ్యాన్లీ, ఫోర్డ్ కు చెందిన బిల్ ఫోర్డ్ , జనరల్ మేరీ బార్రా లాంటి దిగ్గజాలు కూడా ట్రంప్ సలహా బృందంలో ఉన్నారు. ఆరోగ్యం, సంపద సృష్టి ప్రాథమిక లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక సమూహాలు వైట్ హౌస్ తో కలిసి పనిచేస్తాయని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.(కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు) సుందర్ పిచాయ్, నాదెళ్లతో పాటు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్ర ఉన్నారు. వీరంతా సమాచార సాంకేతిక రంగం ఎదుర్కొంటున్నసమస్యలపై పరిష్కారాపై పనిచేస్తారు. అలాగే ఉత్పత్తి రంగం పునరుత్తేజ సూచనలిచ్చే బృందానికి పెర్నాడ్ రికార్డ్ బివరేజ్ కంపెనీ సీఈఓ ఆన్ ముఖర్జీని ఎంపిక చేశారు. మాస్టర్ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా ఆర్థిక రంగ పునరుద్ధరణ బృందంలో ఉన్నారు. వీటితోపాటు వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెక్, టెలికమ్యూనికేషన్, రవాణా, క్రీడలు ఇలా వివిధ టీంలను ట్రంప్ ఏర్పాటు చేశారు. సంబంధిత రంగాలకు సంబంధించి ఈ బృందం సలహాలను అందివ్వనుంది.(విండ్ షీల్డ్స్‌తో ‘మహీంద్ర’ పీపీఈలు) (హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట)