air quality index
-
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ: శీతాకాలంలో దేశ రాజధానిని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు కోర్టు తిట్ల తలంటుపోసింది. వ్యర్థాలను తగలబెట్టిన వారికి నామామాత్రపు జరిమానాలు వేస్తూ వదిలేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిపై అక్టోబర్ 23వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు బుధవారం సమన్లు జారీచేసింది. విధి నిర్వహణలో విఫలమైన ఆయా ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం)ను కోర్టు ఆదేశించింది. సంబంధిత కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం బుధవారం విచారించింది. దహనాలను నివారించేందుకు 2021 జూన్‌లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో అమలుచేయాల్సిన సీఏక్యూఎం నిబంధనలను గాలికొదిలేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇదేం రాజకీయ అంశం కాదుగా: ‘‘తగలబెట్టడం వల్ల శీతాకాలంలో ఢిల్లీ మొత్తం పొగచూరుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అధికారగణం ఒత్తిడి ఉంటే వారికీ మేం సమన్లు జారీచేస్తాం. రాష్ట్రాల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లలో నిబంధనలను అతిక్రమించిన వారిలో ఒక్కరిపై కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టలేదు. తప్పుచేసిన వారిని విచారించేందుకు ఎందుకంత భయపడుతున్నారు?. ఇదేం రాజకీయ అంశం కాదు. కమిషన్ నిబంధనలను ఖచి్చతంగా పాటించాల్సిందే. ఇందులో రాజకీయాలకు తావులేదు. మీరే నియమాలను ధిక్కరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నారు. నామామాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. పంటభూముల్లో ఎక్కడెక్కడ పంటవ్యర్థాలను తగలబెడుతున్నారో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మీకు లొకేషన్ పంపుతోంది. మీరే అది ఎక్కడుందో దొరకట్లేదని కుంటి సాకులు చెబుతున్నారు’’అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి: పంజాబ్ కోర్టు ఎదుట పంజాబ్ తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదించారు. ‘‘పొలాల్లో వ్యర్థాలను కాలి్చన ఘటనలపై అధికారులు నమోదుచేసిన రెవిన్యూ రికార్డులు తప్పులతడకగా ఉంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఆదేశాలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి’’అని చెప్పారు. కేంద్రప్రభుత్వానికీ చీవాట్లు ‘‘కేంద్రప్రభుత్వం వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ను కోరలు పీకిన పాములా మార్చేసింది. ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటిని అమలుచేసే బాధ్యత, సర్వాధికారాలు దానికి అప్పజెప్పలేదు. వాయుకాలుష్య సంబంధ నిపుణులను సీఏక్యూఎంలో ఎంపికచేయలేదు. సీఏక్యూఎం సభ్యుల విద్యఅర్హతలు అద్భుతంగా ఉన్నాయిగానీ అవి గాలినాణ్యత రంగానికి ఎందుకూ పనికిరావు’అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదించారు. సభ్యుల్లో ఒకరు గతంలో మధ్యప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి ఆరేళ్లు చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘అక్కడ సారథిగా ఉండటమనేది అసలైన అర్హత కాబోదు. కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?. వాయుకాలుష్యరంగ నిపుణులతో కమిషన్‌ను పటిష్టంచేయాలి’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ ప్రాంతంలో సీఏక్యూఎం చట్టం, 2021 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించటంలో సీఏక్యూఎం పూర్తిగా విఫలమైంది. దహనం ఘటనలను యద్దప్రాతిపదికన అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే’అని కమిషన్‌పై కోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. -
దంచికొట్టిన వానలు.. ఢిల్లీ మెరుగుపడిన గాలి నాణ్యత
న్యూఢిల్లీ: ఢిల్లీని శుక్రవారం భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దేశ రాజధానితోపాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అయితే రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం కారణంగా దేశ రాజధాని, పరిసరి ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది.ఇప్పుడిప్పుడే ఢిల్లీలోవాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పొల్యూషన్‌తో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్న ఢిల్లీ వాసులు.. ప్రస్తుతం మంచి గాలిని పీల్చుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ నగరం గాలి నాణ్యత సూచికలో 52గా నమోదైంది. ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 24, ఘజియాబాద్‌లో 34, నోయిడాలో46గా నమోదైంది. గురుగ్రామ్ 69, బులంద్‌షహర్ 21, మీరట్ 28, ముజఫర్‌నగర్ 29గా ఉంది.అయితే ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగవ్వడం వెనక చురుకుగా కదులుతున్న రుతుపవనాల ద్రోణి కారణమని అధికారాన్ని భావిస్తున్నారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడిన సంగతి తెలిసిందే. దీంతో గాలిలోని కాలుష్యం వర్షానికి కొట్టుకుపోయినట్లు, అదే విధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి కూడా సహయపడినట్లు పేర్కొన్నారు.కాగా ఈనెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షం వార్షిక, నెలసరి సగటు వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఇది 1000 మి. మీ మార్కును దాటింది. సెప్టెంబర్‌లో సాధారణం కంటే 55% ఎక్కువ వర్షపాతం నమోదైంది. శుక్రవారం మూడు గంటల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సఫ్దర్‌జంగ్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. గత 9 సంవత్సరాల్లో లేని గాలి నాణ్యత 2024 ఫిబ్రవరిలో నమోదైంది. గాలి నాణ్యత సూచిక 200 కంటే తక్కువగా నమోదు కాగా.. గతంలో అయితే AQI 400 నమోదు అయింది. -
Central Pollution Control Board: నిర్భయంగా శ్వాసించండి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తెలియజేసింది. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం(ఎన్సీఏపీ) పరిధిలో 131 నగరాలుండగా, వీటిలో 95 శాతం నగరాల్లో గాలి నాణ్యత మెరుగైనట్లు వెల్లడించింది. 2017–18 నాటి ‘పీఎం10’ స్థాయిలతో పోలిస్తే ఇప్పుడు 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సీపీసీబీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. → ఎన్సీఏపీ పరిధిలోని 131 నగరాలను గాను కేవలం 18 నగరాల్లో గాలి నాణ్యత ప్రమాణాల మేరకు నమోదైంది. ఎన్ఏఏక్యూఎస్ ప్రకారం ‘పీఎం10’ ధూళి కణాలుక్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల్లోపు ఉండాలి. → కడప, వారణాసి, ధన్‌బాద్, డెహ్రాడూన్, ట్యుటికోరిన్, మొరాదాబాద్, కోహిమా, లక్నో, కాన్పూర్, ఆగ్రా, గ్రేటర్ ముంబై తదితర 21 నగరాల్లో ‘పీఎం10’ స్థాయిలు 40 శాతానికి పైగా తగ్గాయి. → విజయవాడ, అహ్మదాబాద్, ఘజియాబాద్, రాజ్‌కోట్, రాయ్‌బరేలీ, కోల్‌కతా, జమ్మూ, సిల్చార్, దిమాపూర్, జోద్పూర్ తదితర 14 నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 నుంచి 40 శాతం తగ్గిపోయాయి. → హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, దుర్గాపూర్, డేరాబాబా నానక్, వడోదర, అలహాబాద్, అసన్‌సోన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరు, అకోలా, సూరత్, నోయిడా తదితర నగరాల్లో పీఎం10 స్థాయిలు 30 శాతం దాకా పడిపోయాయి. → రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అమరావతి, ఢిల్లీ, హౌరా, థానే, లాతూర్, అల్వార్, మండీ గోవింద్గఢ్, పటియాలా, జైపూర్, చంద్రపూర్, నాసిక్, ఝాన్సీ, సాంగ్లీ తదితర 21 నరగాల్లో పీఎం10 స్థాయిలు 10 నుంచి 20 శాతం తగ్గిపోయాయి. → గాలిలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాన్ని 2024 నాటికి 20 నుంచి 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంతో ఎన్సీఏపీ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారు. 2017 నాటి కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. → 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో సూరత్, జబల్పూర్ టాప్‌లో ఉన్నాయి. → 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో వాయు నాణ్యత మెరుగుదల ర్యాంకింగ్‌లో ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్), అమరావతి(మహారాష్ట్ర), ఝాన్సీ(ఉత్తరప్రదేశ్) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. → 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్‌బరేలీ(యూపీ), నల్లగొండ (తెలంగాణ) టాప్ ర్యాంకులు సాధించాయి.→ వాయు నాణ్యతను మెరుగుపర్చడంలో ప్రతిభ చూపిన నగరాలకు కేంద్ర పర్యావరణ శాఖ శనివారం జైపూర్‌లో ‘నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డులు’ ఇచ్చింది. -
వర్షాల ఎఫెక్ట్.. గాలి నాణ్యతలో ఢిల్లీ సరికొత్త రికార్డు
ఢిల్లీ: నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీకి ఉపశమనం లభించింది. గురువారం(ఆగస్టు 8) రాజధానివాసులు గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెరిగి ఆగస్టు 8న సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో 53గా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎమ్) ఒక ట్వీట్లో తెలిపింది. భారీ వర్షాల కారణంగానే ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగినట్లు వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉంటే గుడ్, 50 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 ఉండే ఓ మోస్తరు, 201 నుంచి 300 ఉంటే పూర్, 301నుంచి 400 ఉంటే వెరీ పూర్‌గా పరిగణిస్తారు. -
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్‌లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్‌తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్‌రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్‌కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్‌ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్‌తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్‌ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్‌పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్‌కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్‌లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
కాస్త మెరుగైన ఢిల్లీ వాయు నాణ్యత
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత కాస్తంత మెరుగవడంతో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. వాయు కాలుష్యం అత్యంత తీవ్రం (సివియర్) నుంచి అతి తీవ్రం (వెరీ పూర్)కు చేరుకుందని వివరించింది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ పనులపై నిషేధాన్ని తొలగించింది. కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కుల ప్రవేశానికి అనుమతించింది. గాలి దిశ మారడం, గాలి వేగం పెరగడంతో కాలుష్య తీవ్రత తగ్గినట్లు వివరించింది. ప్రస్తుతం చివరిదైన నాలుగో దశకు సంబంధించి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ప్లాన్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ)ని అనుసరించి ఢిల్లీలో ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపింది. నగరంలోని 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శుక్రవారం 405 కాగా శనివారానికి అది 319కి తగ్గిపోయిందని పేర్కొంది. -
విషమంగా ఢిల్లీ గాలి కాలుష్యం!
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరాన్ని విషపూరిత పొగ దట్టంగా కప్పేసింది. గాలి నాణ్యతా సూచీ(AQI) శుక్రవారం ఉదయం అత్యధికంగా 404గా నమోదైంది. నెమ్మదిగా వీస్తున్న గాలులు, తక్కువ ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలు పేరుకుపోయే వాతావరణాన్ని సృష్టించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని వెల్లడించింది. ఢిల్లీలో గురువారం గాలి నాణ్యతా సూచీ 419గా నమోదైంది. బుధవారం 401గా ఉన్న నాణ్యతా ప్రమాణాలు.. మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా ఉన్నాయి. రోజురోజుకీ గాలి నాణ్యత మరింత దిగజారుతోందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. వాహనాల ఉద్గారాలతో పాటు దీపావళి వేడుకలు పరిస్థితుల్ని మరింత తీవ్రతరం చేశాయి. Delhi's air quality remains in 'severe' category Read @ANI Story | https://t.co/vJd7cKWoNZ#Delhi #AQI #DelhiAirPollution pic.twitter.com/FzrD2O2eqt — ANI Digital (@ani_digital) November 17, 2023 ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం గురువారం స్పెషల్ టాక్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అటు.. గాలి నాణ్యతను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రెండు స్మోగ్ టవర్లు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా వాటి నిర్వహణకు ఖర్చు అధికంగా అవుతుందని పేర్కొంది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని స్థానికులు వాపోయారు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని అంటున్నారు. రోడ్డుపైకి వెళ్తే పొగతో దారి కనిపించే పరిస్థితులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్తత -
ఢిల్లీపై దీపావళి ఎఫెక్ట్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగర ప్రాంతంలో వర్షాలతో కాస్తంత తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..దీపావళి పండుగతో మళ్లీ విజృంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి మరీ ఢిల్లీ ప్రజలు టపాసులు కాల్చడంతో సోమవారం తెల్లవారుజాముకు వాయు నాణత్య సూచీ(ఏక్యూఐ)500 పాయింట్లకు చేరుకుంది. టపాసుల పొగకు మంచు తోడవ్వడంతో ఢిల్లీలోని రోడ్లన్నీ కాలుష్యంతో చీకట్లు కమ్ముకున్నాయి. ఎదురుగా వస్తున్న సైతం వాహనాలు కనిపించని స్థాయికి వాయు కాలుష్యం చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హరియాణా, రాజస్థాన్, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలి్చవేతల కారణంగా ఢిల్లీ నగరం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పంట వ్యర్థాల దహనాన్ని ఆపేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. ఢిల్లీలో ఎటువంటి బాణసంచా కాల్చొద్దంటూ సూచనలు చేసింది. అయితే, ప్రజలు ఈ సూచనలను లెక్కచేయకుండా దీపావళి రోజు బాణసంచాను యథా ప్రకారంగా కాల్చేశారు. ఫలితంగా నగరంలోని చాలా చోట్ల వాయు నాణ్యత (ఏక్యూఐ) 500పైగా నమోదయింది. అక్కడక్కడా 900 వరకూ చేరడం గమనార్హం. సోమవారం ఉదయం 6 గంటలకు అత్యధికంగా లజ్‌పత్ నగర్లో 959, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 910, కరోల్ బాగ్ ప్రాంతంలో 779 వరకు నమోదైంది. వాహనదారులపై 1, 93, 585 చలాన్ల జారీ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఈనెల 7న ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిరోజూ 3వేలకు పైగా వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 385 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నగర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు వివరించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు కాలుష్య ఉల్లంఘనలపై 1, 93, 585 చలాన్లు జారీ చేయగా..10 నుంచి 15ఏళ్ల నాటి 32 డీజిల్, పెట్రోల్ వాహనాలతోపాటు 15 ఏళ్ల కంటే పాతవైన మరో 14, 885 వాహనాలను సైతం సీజ్ చేసినట్లు న్యాయస్థానానికి సమరి్పంచిన నివేదికలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. -
కాలుష్య కోరల్లోకి మరో రెండు నగరాలు.. టాప్-10లోకి చేరిన ఇండియన్ సిటీలు ఇవే..
ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలోకి ఢిల్లీతో పాటు మరో రెండు భారతీయ నగరాలు చేరాయి. దేశమంతా ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ మొత్తంలో బాణాసంచా కాల్చడంతో ఆ విషపూరిత పొగ గాలిని కమ్మేసింది. ఫలితంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎప్పటిలాగే దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా అగ్ర స్థానంలో నిలించింది. ప్రస్తుతం అక్కడ గాలి నాణ్యత సూచీ 420 ఉండటంతో దీన్ని 'ప్రమాదకర' కేటగిరీలో చేర్చింది. టాప్-10 లో మరో రెండు నగరాలు అత్యంత కాలుష్యపూరిత నగరాల టాప్ 10 జాబితాలోకి భారత్ చెందిన మరో రెండు నగరాలు చేరాయి. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాల్గవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై 163 ఏక్యూఐతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఏక్యూఐ స్థాయి 400-500 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఇక 150-200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఏక్యూఐ స్థాయి 0-50 ఉంటే అది మంచిదిగా పరిగణిస్తారు. -
వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి.. ఢిల్లీ వాసులకు స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు తాజాగా స్వల్ప ఊరట కలిగింది. ఢిల్లీతో సహ నోయిడా, గురుగ్రామ్, ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఓ మోస్తారు వాన పడింది. ఇది రాజధానానిలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పుకు దారితీసింది. గాలిలో ఉన్న విషపూరిత వాయులు కొంత వరకు క్లీన్ అయ్యాయి. గాలి నాణ్యత సూచి కూడా స్పల్పంగా మెరుగుపడింది. శుక్రవారం ఉదయంనాటికి దిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 408కి తగ్గింది. నిన్న సాయంత్రం ఇది 437గా నమోదైంది. శుక్రవారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించడంతో ఢీల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కర్తవ్య పాత్, ఐటీఓ, ఢిల్లీ-నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా పడిన వర్షపు జల్లులకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఢిల్లీ వ్యాప్యంగా చాలా చోట్ల గురువారం రాత్రి వరకు 400+ ఉన్న గాలి నాణ్యత సూచీ ఆ తరువాత 100 కంటే తక్కువ నమోదైంది. The much needed... Such a fresh breath!! It's windy, rains all the way in various parts of #Delhi #Gurgaon #Rohtak #Faridabad #Noida #Ghaziabad,#AQI going down naturally. Thank you western disturbance! #DelhiRains pic.twitter.com/Zc2Egbtn4m — Weatherman Navdeep Dahiya (@navdeepdahiya55) November 9, 2023 కాగా ఢిల్లీ–ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)లో గత వారం రోజులుగా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం పెరగడం, నాణ్యత సూచీ పడిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: కశ్మీర్లో విపరీతమైన మంచు.. రహదారుల మూసివేత పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు, వాహనాల నుంచి వెలవడే పొగ ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అటు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉన్నంతలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు దేశ రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించాలని ఆలోచన చేసింది. నవంబర్ 20 నుంచి 21 వరకు రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని నిర్ణయించింది. ఈలోగానే వర్షాలు కురుస్తుండటం ప్రజలు, ప్రభుత్వానికి కాస్త ఉపశమనం లభించినట్లైంది. -
దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?
దీపావళి అనగానే పిల్లలు, పెద్దలు తారతమ్యం లేకుండా ఉత్సాహంగా టపాసులు పేల్చుతూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఎక్కడలేని సరదా ఈ పండుగలోనే ఉంటుంది. అందువల్లే ఈ పండుగంటే అందరికి ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడూ ఆ పండుగ వెలవెలబోక తప్పదన్నట్లుంది. ఓపక్క కాలుష్యం కన్నెర్రజేస్తుంది. 'కామ్'గా ఉంటే బెటర్ లేదంటే అంతే సంగతులంటూ తనదైన శైలిలో హెచ్చరిస్తోంది మనిషిని. ఏదైతే అదైంది అని టపాసులు కాల్చుదామన్నా..కళ్లముందు కనిపిస్తున్న వాతావరణం సైతం మానవుడా వద్దు..! అని మూగగా చెబుతోంది. ఇంకోవైపు పండుగ జరుపుకునేవాళ్లు, చేసుకోని వాళ్లు ఎంతమంది అంటూ సర్వేలు మొదలైపోయాయి. ఇలాంటి సందిగ్ధానికి దారితీసిన పరిస్థితులు? ప్రస్తుతం మన దేశ రాజధాని పరిస్థితి తదితరాల గురించే ఈ కథనం!. దీప కాంతుల మిరమిట్లుతో ఆనందహేలిని నింపే పండుగను కాస్తా.జరుపుకుందామా? వద్దా..! అనే స్థితికి వచ్చేశాం. ఎంతలా పర్యావరణ ప్రేమికులు భూమి, గాలి, నీరు కలుషితమవుతున్నాయి అని నెత్తి, నోరు కొట్టుకుని చెబుతున్నా వినిపించుకోలేదు. అందుకు మూల్యం చెల్లించుకునే స్థితికి మనకు తెలియకుండానే వచ్చేశాం. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుందాం, ప్రకృతి సంరక్షణను గుర్తిందాం అన్నా.. వినలేదు. ఇప్పుడు ఏ పండుగైన, సంబరమైన జరుపుకుంటున్నాం అని సంకేతం ఇచ్చేలా.. కాల్చే టపాసులు కూడా కాల్చలేని విధంగా గాలిని కలుషితం చేశాం. ఇప్పటి వరకు ప్రకృతి సిద్ధంగా లభించే నీటిని సైతం కొనుక్కునేంత స్థాయికి దిగజారిపోయాం. మళ్లీ పీల్చుకునే గాలి విషయంలో కూడా ఆ పరిస్థితి అంటే..వామ్మో ఊహించుకుంటేనే ఏంటోలా ఉంది. అంతెందుకు కరోనా మహమ్మారి టైంలో మాస్క్ ముక్కుకి పెట్టుకోమంటేనే..ఊపిరి సలపక అల్లాడిపోయాం. అలాంటిది ఆక్సిజన్ బాటిల్ వీపుకు పెట్టుకుని తిరగడమంటే.. అమ్మ బాబోయ్! ఆ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదూ!. కానీ ప్రస్తుతం అంతలా మన దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. శీతకాలం వచ్చినా.. కాస్త పొగమంచు ఏర్పడినా.. అక్కడ పాఠశాలలకు సెలవులు ఇచ్చేస్తున్నారు అధికారులు. ఇంకా విచిత్ర ఏంటంటే.. కరోనా రాక మునుపు నుంచే గాలి కాలుష్యం కారణంగా అక్కడ విద్యార్థులు ముక్కులకు మాస్క్‌లు పెట్టుకుని తిరిగారంటే అక్కడ పరిస్థితి ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగకై కొందరు సర్వేలు మొదలు పెట్టారు. సుమారు 32% మంది దీపావళి పండుగ జరుకుంటామని చెప్పాగా, దాదాపు 43% మంది టపాసులు కాల్చమని చెప్పడం విశేషం. అంతేగాదు వాయు కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో టపాసుల అమ్మకం, వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వాలు నిషేధించడం గమనార్హం. Air pollution is an important and under recognised risk factor for cardiovascular events. #HeartAttack Higher levels of fine particulate matter (PM2.5) lead to endothelial dysfunction and slow flow in coronaries and systemic inflammation, leading to accelerated atherosclerosis… pic.twitter.com/2YW4lRX5x3 — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) November 5, 2023 వైద్యులు ఏమంటున్నారంటే.. వాయు కాలుష్యం కారణంగా గుండెజబ్బులతో మరణించే వారి సంఖ్య పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ గాలి కాలుష్యం కారణంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో సంభవించే మరణాలే ఎక్కువ అవుతయాన్నారు. అంతేగాక ధూమపానం, మద్యం, ఎయిడ్స్, క్యాన్సర్ తదితర భయానక రోగాల కంటే ఈ గాలి కాలుష్యం కారణంగా పెరిగే మరణాల సంఖ్యే అధికమవుతుందంటూ..గ్రాఫ్ ఆధారంగా సవివరంగా తెలియజేశారు. ఈ కాలుష్యం కారణంగా గుండె, శ్వాశకోశానికి సంబంధించిన కొత్త జబ్బులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్, వివిధ రకాల క్యాన్సర్లు, ఆర్థరైటిస్ తదితర వ్యాధులకు కారణం గాలి కాలుష్యం అని పరిశోధనల్లో తేలిదన్నారు. The Contribution of Air Pollution Versus Other Risk Factors to Global Mortality pic.twitter.com/VnMTdqddF5 — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) November 5, 2023 ఇప్పడు ప్రభుత్వం సత్వరమే దీనిపై చర్యలు తీసుకోక తప్పదని నొక్కి చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో గాలి నాణ్యత దారుణం పడిపోయిన దృష్యా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడూ మాస్క్ ధరించాల్సిందేనని అన్నారు. అలాగే ఇంట్లో ఎయిర్ ఫ్యూర్ ఫెయిర్లను ఉపయోగించాల్సిదేనని చెప్పారు. ఇక ఏ ఆరోగ్యవంతమైన వ్యక్తికి అయినా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 50 కంటే తక్కువుగానే ఉండాలి. కానీ ఇవాళ గాలి ఏక్యూఐ ఏకంగా 400కి పైనే ఉండటమే తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి అత్యంత ప్రాణాంతకం. పైగా ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు అధికమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు దీపక్ కృష్ణమూర్తి. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?) -
ఢిల్లీలో జనం ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. వాయు నాణ్యత పడిపోతోంది. వరుసగా ఆరో రోజు ఆదివారం సైతం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. నగరంలో కాలుష్యం మరోసారి ‘అత్యంత తీవ్రం’ కేటగిరీలోకి చేరింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శనివారం సాయంత్రం 4 గంటలకు 415 ఉండగా, ఆదివారం ఉదయం 7 గంటలకు 460గా దిగజారింది. కలుíÙత గాలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం మరో ఐదు రోజులపాటు పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తెరిచే ఉంటాయని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు కూడా వినవచ్చని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి సూచించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఢిల్లీలో వాయు నాణ్యత పడిపోతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల రాజధానుల కంటే ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. వాణిజ్య వాహనాలకు నో ఎంట్రీ ఢిల్లీలో వాయు నాణ్యత నానాటికీ పడిపోతుండడం, కాలుష్యం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మాణ పనులపై నిషేధం విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాలుష్యానికి కారణమయ్యే రవాణా వాహనాలు, వాణిజ్య వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. -
Delhi Air Pollution: కాలుష్యం కోరల్లో ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. శుక్రవారం ఉదయం ‘తీవ్రమైన ప్లస్’ కేటగిరీకి చేరిందని అధికారులు వర్గాలు వెల్లడించాయి. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీలో 346గా ఉన్న వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) సాయంత్రం కల్లా 418కు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఏకంగా 450గా నమోదైందని తెలియజేసింది. లోధీ రోడ్, జహంగీర్‌పురి, ఆర్కే పురం, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో వాయు నాణ్యత సూచి 438, 491, 486, 473గా ఉన్నట్లు పేర్కొంది. నగరాన్ని పొగ మంచు కమ్మేసిన డ్రోన్ దృశ్యాలను వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్లో పోస్టు చేసింది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ కాలుష్య భూతం కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్తాన్‌లోని హనుమాన్‌గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హరియాణాలోని హిసార్, ఫతేబాద్, జింద్, రోహ్తక్, బహదూర్గఢ్, సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బాఘ్పట్, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది. -
ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని ముంద్ఖా ప్రాంతంలో గురువారం గాలినాణ్యతా ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాణ్యతా ప్రమాణాల సూచీలో అత్యధికంగా 616 పాయింట్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉష్ణోగ్రత అత్యధికంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రాత్రి 7 గంటలకు 357 వద్ద నమోదైంది. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు, 50-100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101-200 ఉంటే మధ్యస్థంగా, 201-300 పేలవంగా ఉన్నట్లు గణిస్తారు. 301-400 ఉంటే అత్యంత పేలవంగా, 401-500 ఉంటే తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు భావిస్తారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో నేడు ఈడీ ఎదుటకు సీఎం కేజ్రీవాల్ -
లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశాలు?
పండుగల సీజన్లో ఢిల్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరుకుంది. ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ(ఏక్యూఐ) 200 నుండి 300 మధ్య ఉంటుంది. రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతోంది. దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ పండుగ తరువాత పరిస్థితి మరింత దిగజారనుంది. మొన్న ఆదివారం ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 266గా ఉంది. శనివారం ఈ సంఖ్య 173గా ఉంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోంది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేసింది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కింగ్ ఫీజులు పెంచాలని, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగితే, నూతన ఆంక్షలు విధించే అవకాశముందని సమాచారం. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్-III, బీఎస్-IV వాహనాలను నిషేధించవచ్చు. అత్యవసర సేవల వాహనాలపై కూడా పరిమితులు విధించే అవకాశముంది. రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులను అధికారులు నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలుష్య పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటే హైవేలు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, పైప్లైన్ల పనులు కూడా నిలిచిపోనున్నాయి. విద్యాసంస్థలను కూడా మూసివేసే అవకాశాలున్నాయి. వాహనాలకు సంబంధించి బేసి-సరి ఫార్ములా తిరిగి అమలు చేసే అవకాశముంది. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేసేవిధంగా అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే కొన్ని సంస్థలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు? -
ఢిల్లీకి ‘గాలాడటం’ లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత ఈ సీజన్లో మొదటిసారిగా ఆదివారం ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయింది. శనివారం 248గా ఉన్న సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 24 గంటల వ్యవధిలో 313కు పడిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణ మని అధికారులు చెబుతున్నారు. దాంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ సోమవారం సంబంధిత శాఖలతో సమీక్ష జరపనున్నారు. ప్రైవేటు వాహనాల రాకపోకలను వీలైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయతి్నస్తోంది. ఇందులో భాగంగా పార్కింగ్ ఫీజులు పెంచడం వంటి చర్యలు చేపట్టింది. హోటళ్లలో తందూరీ పొయ్యిలపై నిషేధం విధించింది. సీఎన్జీ, ఎలక్రి్టక్ బస్సుల వినియోగాన్ని, మెట్రో రైలు సరీ్వసుల సంఖ్యను పెంచాలని కోరింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలోపలున్న కాలుష్య కారఖ పారిశ్రామిక యూనిట్లు, ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణాలు జరుగుతున్న, కూలి్చవేత ప్రాజెక్టులు చేపట్టిన చోట్ల దుమ్ము రేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
మితిమీరిన వాయు కాలుష్యం.. 2 లక్షల మంది ఆస్పత్రి పాలు!
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం మితిమీరిపోయింది. కలుషిత గాలిని పీల్చి సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో సుమారు 2 లక్షల మంది గతవారం ఆస్పత్రుల్లో చేరారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి కారణాలతో దేశంలో గాలి నాణ్యత స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. బ్యాంకాక్‌లోని 50 వరకు జిల్లాల్లో గాలి నాణ్యత సురక్షితం కాని 2.5 పీఎం స్థాయికి పడిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని మించి పోయింది. ఈ స్థాయిలో గాలి కణాలు రక్తంలో కలిసిపోయి అవయవాలను దెబ్బతీస్తాయి. -
Delhi air pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజులుగా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇక వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం ఉదయం 9 గంటలకు 358గా రికార్డయ్యింది. అంటే గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. నగరంలో ఏక్యూఐ గరిష్టంగా 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదయ్యింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం మంది పిల్లల్లో శ్వాస సమస్యలు ప్రపంచంలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1,650 నగరాల్లో సర్వే చేసి ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసింది. భారత్‌లో మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉంది. దేశంలో ప్రతిఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ఢిల్లీలో నివసించే పిల్లల్లో సగం మంది పిల్లలు (దాదాపు 20.2 లక్షల మంది) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం, రోడ్డుపై దుమ్మూ ధూళి, శిలాజ ఇంధనాల వినియోగం మితిమీరడం, తీవ్రమైన చలి.. వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కాలుష్య కల్లోలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. శీతాకాలంలో సమస్య మరింత ముదురుతోంది. ఏక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు అర్థం. ఈ ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌లో ఏక్యూఐ 272గా నమోదయ్యింది. 2019లో ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో ఏక్యూఐ 150గా రికార్డయ్యింది. నగరంలో మూడేళ్లలోనే కాలుష్య తీవ్రత భారీగా పెరగడం గమనార్హం. కరోనా ముందు కాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం 55 శాతానికి పైగానే పెరిగినట్లు స్పష్టమవుతోంది. గాలిలో కంటికి కనిపించని దూళి కణాల సంఖ్యను సూచించే ‘పీఎం 2.5’ కౌంట్ కూడా నగరంలో ‘అనారోగ్యకర’ స్థాయిలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాలను బట్టి తెలుస్తోంది. పీఎం 2.5 ఎక్కువగా ఉంటే మనుషుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పీఎం 2.5 స్థాయి 12 యూజీ–ఎం3 కంటే తక్కువగా ఉంటే ‘ఆరోగ్యకరం’గా గుర్తిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఇటీవల ఇది ఏకంగా 93.69 యూజీ–ఎం3గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. -
సాక్షి కార్టూన్ 05-011-2022
సాక్షి కార్టూన్ 05-011-2022 -
Delhi Pollution: క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజురోజుకు తక్కువ స్థాయికి పడిపోతుంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. గాలి నాణ్యత 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేరడంతో పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా(వర్క్ ఫ్రం హోమ్) ఆదేశాలు జారీ చేసింది. ప్రేవేటు కార్యాలయాలు కూడా ఈ పద్దతినే అనుసరించాలని పేర్కొంది. పాఠశాలలు బంద్ ఢిల్లీలో శనివారం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి పై విద్యార్థులు బహిరంగ ఆటలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొంది. చదవండి: ఎంత క్రూరం! కాలితో తన్నాడు.. జనం ఊరుకోలేదు! ఆ వాహనాలపై నిషేదం కేవలం అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్జీతో నడిచే వాహనాల్ని, ఎలక్ట్రిక్ బండ్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద వాహనాలు, బిఎస్-4 డీజిల్ ఇంజిన్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించింది. కమర్షియల్ డీజిల్ ట్రక్స్ వాహనాలు కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది.అంతేగాక రోడ్లు వేయడం, వంతెనలు నిర్మించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్సిమిషన్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయనున్నారు. అలాగే గతేడాది అవలంబించినటే సరి, భేసి విధానంలో వాహనాల్ని అనుమతించాలి యోచిస్తోంది ఢిల్లీ సర్కార్. అప్రమత్తమైన ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అప్రమత్తమైంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ రష్ట్రాల సీఎస్‌లను నవంబర్ 10లోపు ఎన్హెచ్ఆర్సీ ముందు హాజరు కావాలని కోరింది. పంజాబ్‌లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తుండటం వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వాయు కాలుష్యం అనేది ఉత్తర భారతదేశ సమస్య అని, ఢిల్లీ ప్రభుత్వం లేదా పంజాబ్ ప్రభుత్వం మాత్రమే దీనికి బాధ్యత వహించవని అన్నారు. దీనికి ఒకరిపై ఒకరు నిందలు వేయడానికి సమయం కాదని అన్నారు. రైతులను తప్పు పట్టలేం ఒకవేళ పంజాబ్‌లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి తామే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. వరి పంట వ్యర్ధాల్ని కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని, కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందున వాళ్లకు మరో అవకాశం లేదని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పడిపోతున్న గాలి నాణ్యత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. గాలి నాణ్యత సూచికలో ప్రస్తుతం యూపీలోని నోయిడా 562తో తీవ్ర స్థాయిలో ఉంది. ఆ తరువాత గురుగ్రామ్ 539(హర్యానా). ఢిల్లీ యూనివర్సీటీ సమీపంలో 563 ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుత గాలి నాణ్యత 472గా ఉంది. ఘజియాబాద్-391, నోయిడా-388, గ్రేటర్ నోయిడా-390, గురుగ్రామ్-391, ఫరీదాబాద్-347గా నమోదైంది. -
ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం.. హుటాహుటిన రంగంలోకి ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 354 (వెరీ పూర్)గా నమోదైంది. నోయిడాలో 406కి పడిపోయింది. మంటలు రేపుతున్న కాలుష్యం... పంజాబ్‌లో సెప్టెంబర్ 15–నవంబర్ 1 మధ్య గతేడాదిని మించి 17,846 వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలు జరిగాయి. బుధవారం సైతం పంజాబ్‌లో 1,880 చోట్ల పంట వ్యర్థాల కాల్చివేత సాగింది! వీటిని నియంత్రించాలని ఢిల్లీ ప్రభుత్వం పొరుగు కోరుతున్నా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ మరియు నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హరియాణా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదని, అభివృద్ధి చెందుతున్న వాయు వ్యవస్థ కారణంగా ఇది జరుగుతోందని, దీని కట్టడికి ఉమ్మడి సహకారం అవసరమని రాయ్ పేర్కొన్నారు. కార్మికులకు భృతి వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. నిషేధ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5 వేలు అందించాలని సీఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయించారు. ఇక కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగులు వీలునుబట్టి వర్క్ ఫ్రం హోమ్ పనిచే యాలని, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర మంత్రి గోపాల్‌రాయ్ ప్రజలను కోరారు. -
ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలు బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడంతో నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో శనివారం సాయంత్రం నాలుగింటికి 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ 397కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇంతగా గాలి కాలుష్యం నమోదవడం ఇదే తొలిసారి. దీంతో సూక్ష్మ ధూళి కణాలు గాల్లో మరింతగా పెరగకుండా చూసేందుకు నిర్మాణ కార్యక్రమాలను ఆపాలని, కూల్చివేతలకు స్వస్తిపలకాలని కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) శనివారం ఆదేశాలు జారీచేసింది. దేశ భద్రత, రక్షణ, రైల్వే, మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులకు మినహాయింపునిచ్చింది. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాల రాకపోకల నిషేధానికి నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సీఏక్యూఎం సూచించింది. చలి పెరగడం, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో వెలువడే పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. నిషేధకాలంలో బోర్లు వేయడం, డ్రిల్లింగ్, వెల్డింగ్, రోడ్ల నిర్మాణం, మరమత్తు, ఇటుకల తయారీ, తదితర నిర్మాణరంగ పనులను చేయకూడదు. -
Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి. -
Paytm Vijay Shakar Sharma: ‘ఎందుకిలా నిస్సహాయంగా ఉండిపోయాం’
ఢిల్లీలో ప్రమాదకరంగా మారిన వాతావరణ కాలుష్యంపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 650 పాయింట్లు చూపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ తన ఆవేదను ఆయన పంచుకున్నారు. హౌ కన్ వీ లెఫ్ట సో హెల్ప్‌లెస్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 50 పాయింట్ల వరకు సూచిస్తే గాలి స్వచ్ఛంగా ఉన్నట్టు. 50 నుంచి 100 వరకు అయితే మోడరేట్, 100 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే సెన్సిటివ్ గ్రూప్‌కి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం, 150 నుంచి 200ల పాయింట్ల వరకు ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అర్థం. 200 నుంచి 300 పాయింట్ల మధ్య ఉంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 300 పాయింట్ల మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. నవంబరు 13న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 473 పాయింట్లు దగ్గర నమోదు కావడంతో విజయ్ శేఖర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. How can we be left so helpless? pic.twitter.com/DDU2OhtrOZ — Vijay Shekhar Sharma (@vijayshekhar) November 12, 2021 ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కనీసం పిల్లలను వాతావరణ కాలుష్యం నుంచి కాపాడేందుకు వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సీఎం కీలక నిర్ణయం: వారం రోజులపాటు.. -
ప్రమాదకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి బాణాసంచా ఎఫెక్ట్ దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)పై స్పష్టంగా కనిపించింది. పండుగ ముందు రోజులతో పోలిస్తే పండుగ తర్వాత నమోదైన వాయు నాణ్యత ఐదేళ్లలోనే అత్యల్పం కావడం గమనార్హం. దీనికి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాలుష్యం తోడయింది. దీంతో, ఎన్సీఆర్ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌ల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ దీపావళి రోజున ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు కళ్లు, గొంతు మంట వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. చదవండి: (పశ్చిమబెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత) తక్కువ ఉష్ణోగ్రతలు, కాలుష్య కారకాలు పేరుకుపోవడం, ఆకాశం మేఘావృతమైన కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జన్‌పథ్‌లో వాయు నాణ్యత ప్రమాదకర పీఎం 2.5 స్థాయి 655.07కి చేరుకుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో పీఎం 2.5 స్థాయి 999గా నమోదైంది. ప్రమాణాల ప్రకారం, పీఎం 2.5 స్థాయి 380 కంటే ఎక్కువగా ఉంటే దానిని తీవ్రమైందిగా పరిగణిస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో సగటున వాయు నాణ్యత ఢిల్లీలో 462, ఫరీదాబాద్‌లో 469, ఘజియాబాద్‌లో 470, గురుగ్రామ్‌లో 472, నోయిడాలో 475, గ్రేటర్ నోయిడాలో 464కి చేరుకుంది. కోవిడ్ బాధితులపై తీవ్ర ప్రభావం దీపావళి తర్వాత రోజున 2016లో 445, 2017లో 403, 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462 వాయుకాలుష్య తీవ్రత నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారిపై కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీరు మార్నింగ్ వాక్ మానేయాలని, శ్వాస సంబంధ, హృద్రోగ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. చదవండి: (కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ)