bangolore
-
బామ్మ సాహసం.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: రైలు పట్టాలపై ఓ పెద్ద చెట్టు విరిగిపడింది. అంతలోనే ఆ పట్టాలపై రైలు వస్తోంది. మరికొద్ది నిమిషాల్లో పెను ప్రమాదం జరిగేదే. కానీ.. ఓ బామ్మ ఎరుపు రంగు వస్త్రంతో దేవతలా వచ్చి ఆ రైలును ఆపేసింది. ఇదేదో సినిమాలో సీన్ కాదు. నిజంగా జరిగిన ఉదంతం. ఈ ఘటన మంగళూరు–పడీల్ జోకెట్ట మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందారలో మార్చి 21వ తేదీన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మార్చి 21న మధ్యాహ్నం 2.10 గంటలకు రైలు పట్టాలపై ఒక భారీ వృక్షం విరిగి పడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ రైలు వస్తోంది. దీన్ని గమనించిన 70 ఏళ్ల వృద్ధురాలు చంద్రావతి ఇంట్లోంచి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి రైలుకు ఎదురుగా వెళ్లి జెండాలా ఊపుతూ నిలబడింది. దీనిని పసిగట్టిన లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు చంద్రావతిని అభినందించారు. ‘ఏం చేయాలో పాలుపోలేదు’ ఈ ఘటనపై చంద్రావతి మాట్లాడుతూ ‘ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి బయట కూర్చొన్నాను. మా అక్క ఇంట్లోనే నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఇంటి ఎదురుగా ఉన్న పట్టాలపై పెద్ద చెట్టు విరిగిపడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి రైలు వెళుతుందనే విషయం గుర్తుకొచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరికైనా ఫోన్ చేసి చెబుదామని ఇంటి లోపలికి వెళ్లాను. అంతలోనే రైలు హారన్ వినిపించింది. వెంటనే ఇంట్లో ఉన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని పట్టాల వద్దకు పరుగు తీశాను. నాకు గుండె ఆపరేషన్ అయింది. అయినా లెక్కచేయలేదు. రైలు వస్తున్నప్పుడు పట్టాల పక్కన నిలబడి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఊపాను. వెంటనే రైలు నెమ్మదించి ఆగిపోయింది. సుమారు అరగంట పాటు పట్టాలపై రైలు ఆగింది. స్థానికుల సహకారంతో ఆ చెట్టును తొలగించారు’ అని చెప్పింది. చంద్రావతి చేసిన సాహస కార్యాన్ని ప్రజలంతా అభినందించారు. -
పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి!
బెంగళూరు/పట్నా: ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు.. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్లైన రెండోరోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది. ఆ తర్వాత ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని రైల్వే స్టేషన్లో కలిసి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కింది. కదులుతున్న రైళ్లోనే ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. అలా ఆ ప్రేమజంట ఒక్కటయ్యింది. వివరాలు.. బిహార్‌కు చెందిన అను కుమారి, అషుకుమార్‌లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇది నచ్చని అనుకుమారి తల్లిదండ్రులు ఆమెకు రెండు నెలల క్రితం కిరణ్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కానీ అను ఆ యువకుడిని భర్తగా ఒప్పుకోలేక పెళ్లైన రెండోరోజే అత్తవారింటి నుంచి పారిపోయివచ్చింది. అనంతరం అషు కుమార్‌ను సుల్తాన్‌గంజ్ రైల్వేస్టేషన్లో కలిసింది. వారిద్దరు కలిసి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కారు. నీకోసం .. తాను కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చానని.. మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అను అషుకుమార్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో చేసేదేం లేక కదులుతున్న రైలులోనే ఆమెకు నుదుట సింధూరం దిద్దాడు. ఇది జరిగి రెండు నెలల కావొస్తున్న తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగుచూడడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: పాపం.. ఆ కోడలి సాహసం వృథా! భారత్‌లో 121 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి.. -
‘ఆ పార్టీతో నగరానికి ముప్పు’
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో భాగస్వామ్య పక్షాలుగా వ్యవహరించిన జేడీఎస్, కాంగ్రెస్‌లు కత్తులు దూస్తున్నాయి. బెంగళూర్‌లోని రాజరాజేశ్వరినగర్ అసెంబ్లీ స్ధానానికి ఇరు పార్టీలు అభ్యర్దులను బరిలో దింపి పరస్పర ఆరోపణలకు దిగాయి. ఇటీవలి బెంగళూరు అల్లర్లను ప్రస్తావిస్తూ జేడీఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీతో బెంగళూర్‌లో భద్రత కరవవుతుందని వ్యాఖ్యానించారు. బెంగళూర్ అల్లర్లపై బీజేపీ సైతం కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడుతున్న క్రమంలో కుమారస్వామి సైతం కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శల దాడి పెంచారు. పార్టీ అభ్యర్థి వి కృష్ణమూర్తి నామినేషన్ వేసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు అల్లర్ల వెనుక ఏం జరిగిందో ఇప్పుడు వెల్లడవుతోందని అన్నారు. రాష్ట్ర పౌరులను కాంగ్రెస్ నేతలు కాపాడలేరని, బెంగళూర్ దాడులకు వారే కుట్రదారులని కుమారస్వామి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేతిలో బెంళూర్ నగర ప్రజలు సురక్షితంగా ఉండలేరని ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుసుమను పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చదవండి : శివకుమార్‌పై సీబీఐ కేసు బెంగళూర్ అల్లర్లు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.ఇక ప్రత్యర్ధులైన జేడీఎస్, కాంగ్రెస్‌లు 2018లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు విభేదాలను పక్కనపెట్టి జట్టుకట్టాయి. ఆపై పలువురు ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కార్‌ను వీడటంతో యడ్యూరప్స సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిందని అప్పట్లో జేడీఎస్, కాంగ్రెస్‌లు కాషాయ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. -
‘ఆ ఎంపీని తొలగించండి’
బెంగళూర్ : బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువజన విభాగం చీఫ్ తేజస్వి సూర్య బెంగళూర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బెంగళూర్ ఉగ్ర అడ్డాగా మారుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటకలో పాలక పార్టీ బీజేపీ కాగా, బెంగళూర్ ప్రతిష్టను దిగజార్చేలా తేజస్వి వ్యాఖ్యలున్నాయని కాంగ్రెస్ మండిపడింది. బెంగళూర్ ప్రతిష్టను మంటగలిపిన తేజస్విని తక్షణమే తొలగించాలని, ఆయన వ్యాఖ్యలు బీజేపీకి అవమానకరమని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. కాగా, గత కొన్నేళ్లుగా భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూర్ ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా మారిందని తేజస్వి సూర్య ఆదివారం వ్యాఖ్యానించారు. పలువురు ఉగ్రవాదుల అరెస్ట్, స్లీపర్ సెల్స్ గుట్టును ఎన్ఐఏ రట్టు చేసిన ఉదంతాలు ఈ అంశాన్ని స్ప్టష్టం చేస్తున్నాయని అన్నారు. నగరంలోని కేజే హళ్లి, డీజే హళ్లి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మూక దాడులను ఈ సందర్భంగా ఎంపీ ప్రస్తావించారు. నగరంలో ఎన్ఐ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరానని దక్షిణ బెంగళూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ తేజస్వి చెప్పారు. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. చదవండి : సెంట్రల్ జైలుకు నటి రాగిణి -
కర్ణాటకలో అర్ధరాత్రి ఘోర విషాదం
బెంగళూరు : కర్ణాటకలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తల్లీ, ఇద్దరు కొడుకులు దుర్మరణం పాలయ్యారు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. చిక్కబళ్లాపురం పోలీసుస్టేషన్ పరిధిలో జాతీయ రహదారి– 7 మీద దొడ్డబైలగుర్కి గ్రామం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత స్విఫ్ట్ కారును వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా అందులోని జయశ్రీ (50), ఆమె కుమారులు అక్షయ్ (28), హర్ష (24) సంఘటనాస్థలంలోనే మరణించారు. వివరాలు.. దినేశ్ (53) బెంగళూరు జిగణిలో టైల్స్ షోరూం నిర్వహిస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన స్వస్థలం హైదరాబాద్. పనిమీద కుటుంబంతో కలిసి సోమవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. దొడ్డబైలగుర్కి గ్రామం దగ్గర రోడ్డు హంప్స్ ఉన్నందున కారును నిదానం చేస్తుండగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. జయశ్రీ, ఆమె కొడుకులు ప్రాణాలు కోల్పోగా, దినేశ్‌కు తీవ్రగాయాలు తగిలాయి. స్థానికులు గమనించి అంబులెన్స్ ద్వారా మృతదేహాలను, బాధితున్ని చిక్కబళ్లాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీకి చెందిన లారీడ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే లారీని వదిలేసి పారిపోయాడు. చిక్కబళ్లాపురం రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. లారీడ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదాల నిలయం ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. గతంలో అనేకసార్లు యాక్సిడెంట్లు సంభవించాయి. కారణం ఇక్కడ వేసిన హంప్స్ వల్ల. వేగంగా వచ్చే వాహనదారులు హంప్స్ చూడగానే స్లో చేస్తారు. ఇంతలో వెనుక నుంచి వచ్చే భారీ వాహనాలు అదుపుతప్పి ఢీకొట్టడం పరిపాటిగా మారింది. తరచూ రక్తపాతం సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హంప్స్‌ను తొలగించండి, లేదా హెచ్చరిక బోర్డులు, సిగ్నల్ లైట్లు వేయాలని డిమాండ్ చేశారు. -
సెంట్రల్ జైలుకు నటి రాగిణి
సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్ రంకా, లూమ్ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. బెయిల్ కష్టం రాగిణితో పాటు 14 మంది నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇప్పట్లో బెయిల్ దొరకటం కష్టమని తెలిసింది. మరో నటి సంజనను విచారణకు సహకరించటంలేదని సీసీబీ పేర్కొనగా, మరో 2 రోజుల పాటు వారి కస్టడీకి అనుమతించడంతో మంగళ, బుధవారాలు ప్రశ్నించనున్నారు. అంతకుముందు నిందితులకు కేసీ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ టెస్టులను, ఇతర వైద్య పరీక్షలను చేయించారు. రాగిణి, సంజనలకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది. ప్రముఖులతో నిందితుడు డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ బీబీఎంపీ కార్పొరేటర్ కేశవమూర్తి కొడుకు యశస్ కోసం ఎన్సీబీ పోలీసులు ముంబై నుంచి బెంగళూరుకు వచ్చి గాలిస్తున్నారు. ఈ నెల 7న విచారణకు పిలవగా ఒకసారి వచ్చి వెళ్లాడు. తరువాత విచారణకు పిలవగా అదృశ్యమయ్యాడు. త్వరలో వీఐపీలకు నోటీసులు? రాగిణి, సంజన, ఇతర నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం సీసీబీ పోలీసులు అనుమానితుల జాబితాను రూపొందించారు. ఇందులో నటులతో పాటు రాజకీయ నేతల పుత్రులు, ప్రముఖ కుటుంబాల వ్యక్తులూ ఉన్నట్లు తెలిసింది. విచారణకు రావాలని వారికి నోటీసులు పంపనున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులు, వ్యాపారవేత్తల పుత్రులు కూడా జాబితాలో ఉన్నారు. అనేకమంది ప్రముఖులు తాము నిర్వహించే డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని రాగిణి, సంజనలు విచారణలో వెల్లడించారు. నేను దొంగ అవుతానా: జమీర్ డ్రగ్స్ కేసులో తనను ఇరికించి రాజకీయంగా అంతం చేయడానికి కుట్ర జరుగుతోందేమోనని కాంగ్రెస్ మాజీ మంత్రి, చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌ఖాన్ ఆరోపించారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. నిందితుడు ఫాజల్‌తో నాకు పరిచయం లేదు. ఒక దొంగ నాతో కలిసి ఫోటో తీయించుకుంటే నేను దొంగను ఎలా అవుతానని ప్రశ్నించారు. వీఐపీలతో రాహుల్ చెట్టాపట్టాల్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ డీలర్ రాహుల్‌తో రెవెన్యూశాఖ మంత్రి ఆర్.ఆశోక్, నిర్మాత కె.మంజు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. నటి సంజనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్ సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులతో స్వీట్లు తింటూ దిగిన ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. నటుడు ఉపేంద్ర, క్రికెటర్ శ్రీశాంత్, శ్రీనగర కిట్టి, రఘు ముఖర్జీ, సంగీత దర్శకుడు గురుకిరణ్, నటీ ఐంద్రితా రై, ప్రియాంక, హర్షికా పూణచ్చ, ఒక రిటైర్డ్ ఐజీలతో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీరితో ఇతనికి గల సంబంధాలు ఎలాంటివన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
బెంగళూరు అల్లర్లు : సీఎం కీలక ప్రకటన
బెంగళూరు: సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు చేసిన పోస్ట్‌తో గతవారం బెంగళూర్‌లో జరిగిన ఘర్షణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ చేపట్టనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం వెల్లడించారు. హింసాకాండలో అల్లరిమూకల విధ్వంసంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్లెయిమ్ కమిషనర్ నియామకం కోసం ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును సంప్రదిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో గతవారం చెలరేగిన అల్లర్లలో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేశామని, కేసుల సత్వర విచారణకు ముగ్గురు ప్రత్యేక ప్రాసికూటర్లను నియమిస్తామని యడియూరప్ప పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే గూండా యాక్ట్‌ను సిట్ ప్రయోగిస్తుందని యడియూరప్ప ట్వీట్ చేశారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలను బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. హోంమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాలు వెల్లడించింది. బెంగళూర్ అల్లర్లు: ఎమ్మెల్యే భావోద్వేగం -
బెంగళూరు హింస: ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్యే
బెంగళూర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో అల్లరి మూకలు ధ్వంసం చేసిన తన నివాసాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ‘అల్లరిమూకల దాడిలో విలువైన వస్తువులన్నీ కోల్పోయాను..నా ఇంటిని ధగ్ధం చేశారు..నాకు ఏమీ అవసరం లేదు..నా తల్లి మంగళసూత్రం ఎవరికైనా కనిపిస్తే దయచేసి దాన్ని తిరిగి ఇచ్చేయండ’ని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే బంధువు ఓ వర్గానికి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంతో ఆందోళనకారులు రెండు రోజుల కిందట ఆయన ఇంటిపై దాడిచేసిన సంగతి తెలిసిందే. అల్లర్ల కారణంగా ముగ్గురు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఎమ్మెల్యే తన భార్య, పిల్లలతో తమ ఇంటి వద్దకు రాగా, పెద్దసంఖ్యలో ఆయన మద్దతుదారులు మూర్తి ఇంటివద్ద గుమికూడారు. కాగా ఇంటి ఆవరణలో మంగళసూత్రం కనిపించడంతో తిరిగి ఎమ్మెల్యేకు అందచేశారు. ఆయన పిల్లలు, మేనల్లుళ్లు, మేనకోడళ్ల మార్కుల కార్డులు కాలిబూడిదవడంతో వారు తీవ్రంగా కలత చెందారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తితో పాటు ఆయన సోదరులు సైతం పూర్వీకుల నుంచి వచ్చిన అదే ఇంటిలో నివసిస్తున్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన దాడిగా శ్రీనివాసమూర్తి ఆరోపించారు. ఎవరో చేసిన పొరపాటుకు తన ఇంటిపై ఎందుకు దాడి చేశారో అర్ధం కావడంలేదని, తన ఇంటిని దగ్ధం చేసిన వారికి తాను ఏం హాని చేశానని ప్రశ్నించారు. తన భార్యకు, పిల్లలకు హాని జరిగితే బాధ్యత ఎవరిదని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని ఆయన కోరారు. కాగా బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఇప్పటికి ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు తన ఇంటిపై అల్లరి మూకల దాడి గురించి ఆయన డీజే హళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను సురక్షిత ప్రాంతంలో ఉండటంతో పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ఫిర్యాదులో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చదవండి : భగ్గుమన్న బెంగళూరు! -
బెంగళూరు హింస : నష్టాన్ని వారి నుంచే రాబడతాం
బెంగళూర్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో చెలరేగిన హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి. అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హింసాకాండకు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని చెప్పారు. హింసలో ఎలాంటి నష్టం వాటిల్లినా అల్లరి మూకల నుంచే రికవరీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. హింసకు పాల్పడిన వారిని గుర్తిస్తున్నామని, నష్టాలను అంచనా వేసి జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రికవరీ చేస్తామని చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బెంగళూరు హింసాకాండ వెనుక కుట్రను బహిర్గతం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో మంగళవారం రాత్రి హింస చెలరేగింది. అల్లరిమూకను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి తెగబడటంతో పాటు పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. డీజే హళ్లి పోలీస్ స్టేషన్లోకి చొరబడి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కాగా బెంగళూర్‌లో జరిగిన హింసాకాండకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు. చదవండి : బెంగళూరు అల్లర్లపై సీఎం సీరియస్ -
భార్యను చంపడానికి ఇన్ని స్కెచ్‌లా!
కోల్‌కతా: భార్యను, అత్తను అంతమొందించి తదననంతరం ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరుకు చెందిన చార్టడ్ అకౌంటెంట్ అమిత్ అగర్వాల్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమిత్ చనిపోయిన ప్రదేశంలో 67 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో తన భార్యను చంపడానికి ఆరు నెలలుగా అమిత్ రకరకాలుగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పాముతో కాటు వేయించడానికి ప్రయత్నించినట్లు, కారు యాక్సిడెంట్ చేయించాలనుకున్నట్టు, సుపారీ ఇచ్చి బిహార్ రౌడీలతో చంపించడానికి ప్రయత్నించినట్లు ఆ సూసైడ్ నోట్లో అమిత్ రాశాడు. (భార్యను చంపి.. ఆపై అత్తను చంపడానికి కోల్‌కతాకు..) చివరికి ఇవేమి కాదని తానే భార్యను స్వయంగా హత్య చేయడానికి నిర్ణయించుకున్నట్లు అమిత్ సూసైడ్ నోట్లో రాశాడు. తరచు భార్యతో గొడవలు జరగడంతో భార్యతో విడాకులు తీసుకోవాలని అమిత్ నిర్ణయించుకున్నాడు. గొడవలను మనసులో పెట్టుకున్న అమిత్ భార్య శిల్పి ధంధానియాను చంపి అనంతరం అతని అత్తమామల ఇంటికి వెళ్లి అత్తతో గొడవ పడి ఆమెను కూడా చంపాడు. మామ తప్పించుకొని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చేసరికి అమిత్ కూడా తనని తాను కాల్చుకొని చనిపోయాడు. (పోంజి కుంభకోణం.. ఐఏఎస్ ఆత్మహత్య) చదవండి: భార్య పొట్టిగా ఉందని అవమానంగా భావించి. -
ఈ మాస్క్ ఉంటే చాలు.. వైరస్ ఖతం
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు మాస్కులకు భలే గిరాకీ పెరిగిపోయింది. ఎన్–95, సర్జికల్ మాస్కులు.. ఇలా బోలెడన్ని మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇవేవీ వైరస్‌ను చంపవు. కాకపోతే గాలిలో లేదా ఇతరుల దగ్గు, తుమ్ము, తుంపర్ల ద్వారా వచ్చే వైరస్లు నేరుగా మన నోటిలోకి, ముక్కులోకి చేరకుండా అడ్డుకుంటాయి. అయితే వీటితో వైరస్ సోకదన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న లివింగ్‌గార్డ్ తయారుచేసిన మాస్కు మాత్రం వీటికి చాలా భిన్నమైంది. మూడు పొరలతో సిద్ధమైన ఈ మాస్కులో ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది. దీనిపై కొన్ని రసాయనాలను బలమైన రసాయనిక బంధాల ద్వారా పోగుబడేలా చేశారు. ఫలితంగా ఈ మాస్కుపై నిత్యం 0.1 నుంచి 0.8 మిల్లీవోల్టుల ధనాత్మక విద్యుదావేశం పుడుతుంటుంది. సూక్ష్మజీవులన్నీ రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి.(మళ్లీ లాక్డౌన్ ఉండదు) కాబట్టి వైరస్ మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, కొన్ని శిలీంధ్రాలు సైతం ఈ విద్యుదావేశం బారిన పడి నశిస్తాయి. ప్రతి చదరపు సెంటీమీటరుకు ఏకంగా 3,600 కోట్ల విద్యుదావేశాలు పుడుతుంటాయి. కాబట్టి వీటిని తాకిన సూక్ష్మజీవుల పైపొరలు బద్ధలైపోతాయి. అక్కడికక్కడే మరణిస్తాయి లేదా నిర్వీర్యమవుతాయని కంపెనీ సీటీవో, భారతీయ శాస్త్రవేత్త సంజీవ్ స్వామి బుధవారం జరిగిన ఓ వెబినార్‌లో తెలిపారు. సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ఏ మషేల్కర్ కూడా ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. వెయ్యి వరకు పాలి కాటయానిక్ రసాయనాలను పరిశీలించామని, వాటి నుంచి అవసరమైన లక్షణాలున్న 3 నుంచి 7 రసాయనాలను ఎంపిక చేసి ప్రత్యేక పద్ధతుల్లో కలిపి, వస్త్రంపై అవి అతుక్కునేలా చేశామని స్వామి వివరించారు. వీటిని ఉతుక్కుని తిరిగి వినియోగించుకోవచ్చని తెలిపారు. విస్తృత పరీక్షల తర్వాత అందుబాటులోకి.. లివింగ్‌గార్డ్ మాస్కును మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే ముందు పలు యూనివర్సిటీల్లో దానిపై విస్తృత పరీక్షలు చేశారు. బెర్లిన్‌లోని ఫ్రీ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ మాస్కు 99.9 శాతం వరకు వైరస్‌లను అడ్డుకుని నిర్వీర్యం చేస్తున్నట్లు తేలింది. అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీ కూడా దీన్ని పరిశీలించి బాగా పనిచేస్తుందని నిర్ధారించింది. అమెరికా మిలిటరీ వర్గాలు, ముంబైలోని సియాన్ ఆసుపత్రి వైద్యులు, కొంతమంది పారిశుధ్య కార్మికులు కొంతకాలంగా ఈ మాస్కులను వాడుతున్నారు. అమెరికాలోని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మాస్కుల తయారీకి ఉపయోగించిన ప్రత్యేక వస్త్రాన్ని క్షుణ్నంగా పరిశీలించిందని, మానవ శరీరానికి హానికరం కాదని నిర్ధారించినట్లు స్వామి తెలిపారు. ధర సంగతేంటి..? లివింగ్‌గార్డ్ సంస్థ మొత్తం మూడు రకాల మాస్కులను తయారు చేయగా వీటి ఖరీదు రూ.1,490– 1,990 మధ్య ఉంటుంది. మొత్తం 3 పొరలు ఉండే ఈ మాస్కు ద్వారా 5 రకాల రక్షణ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. వారానికి ఒకసారి ఉతుక్కుంటూ మొత్తం 210 రోజుల పాటు ఈ మాస్కును వాడొచ్చు. లివింగ్ గార్డ్ మాస్కుతో పాటు చేతితొడుగులు తొడుక్కుంటే ఉపరితలాలపై ఉండే వైరస్‌లను అక్కడికక్కడ చంపేయొచ్చని, త్వరలో బాడీ సూట్లు కూడా అందుబాటులోకి తెస్తామని సంజీవ్ స్వామి ‘సాక్షి’ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నవీ ముంబైలోని ఓ ఫ్యాక్టరీలో వస్త్రాన్ని తయారు చేస్తున్నామని, బెంగళూరు పరిసరాల్లో మాస్కులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హోటళ్లు, విమాన ప్రయాణాల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. తిరిగి వాడుకునే వీలు ఉండటంతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో వారానికి 1.5 లక్షల మాస్కులు తయారు చేసే సామర్థ్యం ఉందని, దశల వారీగా ఉత్పత్తి పెంచుతామని వివరించారు. వారం రోజుల్లో ఆన్లైన్లో అమ్మకాలు మొదలుకానున్నాయి. -
జగనన్న సైనికులు పేరిట ఐటీ ఉద్యోగులు సేవ
సాక్షి, బెంగళూరు: కరోనా... ఇప్పుడు ఈ పేరు ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలాడిపోతున్నాయి. రోజు వేల మంది దీనికి బలవుతున్నారు. ఎప్పుడు చూడని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటుంది. కరోనాని కట్టడి చేయడానికి ఉత్తమ మార్గాలు సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం. మన దేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభించడంతో 21 రోజుల పాటు ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో చాలా మంది పేదలకు, రోజువారీ కూలీలు ఉపాధి కోల్పొయి పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది వారికి అండగా నిలుస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వారికి తోచినంతలో ఇతరులకు సహాయపడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఎంత సంపాదించిన మనతో రాదు కష్టాల్లో ఉన్న వారికి కడుపునింపడమే నిజమైన పరమార్థం అని తోటివారికి అండగా నిలుస్తున్నారు. కొందరు వారికి తోచినంత డబ్బును సాయం చేస్తుంటే ఇంకొందరు స్వయంగా వారే బృందాలుగా ఏర్పడి అన్నదానం లాంటివి చేస్తూ కరోనా కష్టకాలంలో అన్నం దొరకనివారికి, వలస కూలీలకు, పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన ఐటీ ఉద్యోగులు కొందరు జగనన్న సైనికులు పేరుతో 2000నుంచి 3000 తెలుగు కుటుంబాలకు అన్నదానం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వీరు కొన్ని ప్రాంతాలకు మొబైల్ వాహానాల ద్వారా కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. వీరు చేస్తున్న ఈ సేవ కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్యాం కలకడ, భాస్కర్‌రెడ్డి అంభవరం నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో ఉన్న తెలుగువారికి ఎవరికైనా ఆహారానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే కింది నంబర్లకు ఫోన్ చేస్తే ఆహారాన్ని అందిస్తామని వారు తెలిపారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 9900301234, 8123829473 -
జుట్టంతా రాలిపోతోంది.. గైనకాలజిస్ట్‌ను కలవాలి!
‘‘బెంగళూరు నీళ్లకు కాబోలు జుట్టంతా రాలిపోతోంది..’’ తల స్నానం చేసి జుట్టుకు హెయిర్ డ్రయర్ పెడుతూ అన్నది నమ్రతా జార్జ్. ‘‘ఓసారి ట్రైకాలజిస్ట్‌ను కలవాలి’ అంది మళ్లీ తనే నమ్రత పక్కనే ఉన్న రూమ్మేట్ థెరిసాతో. ‘‘అప్పర్ లిప్ మీద హెయిర్ వస్తోంది. ముఖమంతా యాక్నే, ఒంటిమీద నల్లగా చుక్కలు కూడా వస్తున్నాయి. డెర్మటాలజిస్ట్‌ను కూడా కలవాలేమో’’ దిగులుగా తనలో తనే అనుకున్నట్లుగా అంటోంది నమ్రత. ‘‘నువ్వు కలవాల్సింది గైనకాలజిస్ట్‌ని’’ డ్రెస్ వేసుకుంటూ, హడావుడిగా టేబుల్ దగ్గరకు వెళ్లి వెజిటబుల్ సలాడ్ ఫోర్క్‌తో నోట్లో పెట్టుకుంటూ బదులిచ్చింది థెరిసా. థెరిస్సాను విచిత్రంగా చూసింది నమ్రత. ‘‘నాకు వరుసగా మూడు నెలలు పీరియడ్స్ మిస్ అయ్యాయని గైనకాలజిస్ట్‌ని కలిశాను కదా! అప్పుడు తెలిసింది ఇవన్నీ పీసీఓఎస్ లక్షణాలని. నన్నయితే బరువు తగ్గమని గట్టిగా చెప్పింది. నువ్వు కూడా ఓ సారి కలువు’’ నమత్ర వైపు చూడకుండా చెప్పుకుంటూ పోతోంది థెరిసా. నమ్రతా జార్జ్, థెరెసా బోబన్లు పదకొండేళ్లుగా స్నేహితులు. ఈ కేరళ అమ్మాయిలు ఏడేళ్లుగా రూమ్మేట్లు. ఇద్దరూ ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్‌లే. సొంతూరు కొచ్చి నుంచి గత ఏడాది బెంగుళూరుకొచ్చి ఫ్యాషన్ పరిశ్రమలో పని చేస్తున్నారు. థెరిసా సలహాతో నమ్రత గైనకాలజిస్ట్‌ను సంప్రదించింది. నిజమే! ఆమె సమస్య కూడా పీసీఓఎస్నే. అండాశయంలో సిస్ట్లు ఏర్పడ్డాయి. నిండా పాతికేళ్లు లేవు. ఇప్పుడే గర్భాశయ సమస్యలేంటి? అసలీ పీసీఓఎస్ ఏంటి? ఇది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది? అని పరిశోధన చేసినంత పని చేశారు. తమ ఇద్దరిలోనే కాదు ఈ పీసీఓఎస్ ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది మహిళలను వేధిస్తోందనీ, మన దేశంలో ఈ దశాబ్దంలో విపరీతంగా పెరిగిపోతోందనీ తెలుసుకున్నారు. ధైర్యం చెబుతున్నారు మనదేశంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియచేస్తున్నారు కేరళకు చెందిన ఇద్దరు స్నేహితులు. ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లికి ముందు రొటీన్ చెకప్‌లలో భాగంగా గైనకాలజిస్టుకు చూపించడానికి తల్లిదండ్రులు భయపడతారు. పెళ్లికావల్సిన అమ్మాయిని గైనకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లినట్లు ఎవరికైనా తెలిస్తే ‘వాళ్లు ఏమనుకుంటారో’ అని ఆందోళన పడుతుంటారు తప్ప సమస్య తొలిదశలో ఉన్నప్పుడే వైద్యం చేయించాలనుకోరు. పీసీఓఎస్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే గర్భధారణ సమస్యలు ఎదురవుతాయని తెలిసినా సరే పెళ్లయిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించవచ్చని.. సమస్యను తీవ్రతరం చేసుకుంటుంటారు. ఇంకా... పీసీఓఎస్‌కు చికిత్స చేయించుకుందని బంధువులకు, స్నేహితులకు తెలిస్తే ‘ఈ అమ్మాయికి సమస్య ఏ స్థాయిలో ఉందో ఏమిటో, పిల్లలు పుడతారో లేదో’ అనే అనుమానాలను చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తారేమోనని మరొక భయం. తేలిగ్గా వివరిస్తున్నారు ఆడపిల్లలను గైనకాలజిస్టుకు చూపించడం మీద మన సమాజంలో ఉన్న అనేక అపోహలను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు నమ్రతా జార్జ్, థెరెసా బోబన్లు. ఇందుకోసం ఇన్ స్టాగ్రామ్‌లో పేజీ ఓపెన్ చేసి సందేహాలకు సమాధానాలిస్తున్నారు. గైనిక్ సమస్యల పట్ల యువతులను చైతన్యవంతం చేయడానికి పూనుకున్న స్నేహితుల చొరవ ఇది. డాక్టర్లు వివరించేటప్పుడు వైద్యపరమైన సాంకేతిక పదాలు సామాన్య యువతులను, మహిళల్ని భయపెడుతుంటాయి. ఈ ఫెండ్స్ మాత్రం విషయాన్ని సామాన్యులకు అర్థమయ్యే çపదాలతో సులువుగా వివరిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజీ అంతగా విజయవంతం కావడానికి ఇదీ ఒక కారణమే. ‘‘మొదట్లో కొన్నాళ్లు బెంగళూరు నీటిని తిట్టుకున్నాం. ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాం’’ అని నవ్వారు ఈ ఫ్రెండ్స్. – మంజీర సమస్యే కాదు డిజిటల్ మీడియా వేదికగా మేము చేపట్టిన ఈ ఉద్యమం... మహిళల ఆరోగ్యం పట్ల మన సమాజంలో కరడుగట్టి ఉన్న నిరాసక్తతను పటాపంచలు చేయడానికే. ‘టూ బ్రోక్ గర్ల్స్ విత్ పీసీఓఎస్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాం. అందులో పీసీఓఎస్ లక్షణాల గురించి సమగ్రంగా తెలియచేస్తున్నాం. అవసరమైతే నిపుణుల సలహా తీసుకుని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని కూడా సూచిస్తున్నాం. మా పేజీని అనుసరిస్తున్న వాళ్లలో కొందరు తమలో ఉన్న కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా పీసీఓఎస్ కారణంగా దేహంలో ఎదురయ్యే అవాంఛిత రోమాల వంటి వాటి గురించి అమ్మాయిలు విపరీతంగా వ్యాకులతకు లోనవుతుంటారు. ఇది మానసిక వేదనకు లోను కావాల్సిన సమస్య కానే కాదని వాళ్లకు ధైర్యం చెబుతున్నాం. బయటకు చెప్పుకోలేని ఆవేదనను పంచుకోవడానికి, చైతన్యవంతం కావడానికి ఒక వేదిక కల్పించాం. ఇది ఆరోగ్య చైతన్య విప్లవం. – నమ్రత, థెరిసా View this post on Instagram It’s par-TEA time 🍵🍵🍵 We can’t start a day without a glass of one of our favourite brews. While researching for what dietary changes could help reverse the effect of pcos, we came across the benefit of having herbal teas to help control the condition. Some teas even have scientific evidence in helping reversing the side effects of pcos. Have a TEA-rrific day. Do share you experiences with various herbal teas that might have helped you #pcos #periodpositive #tea #women A post shared by Nams & Ter (@twobrokegirlswithpcos) on Feb 4, 2020 at 9:00pm PST -
దక్షిణాదిలో బయటపడిన అరుదైన లోహం
బెంగళూర్ : భారత్‌లో ఎలక్ర్టిక్ వాహనాల తయారీకి భారీ ముందడుగు పడింది. ఎలక్ర్టిక్ బ్యాటరీల తయారీలో ఉపయోగించే కీలక లోహం లిథియం నిల్వలను బెంగళూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్‌కు చెందిన పరిశోధకులు దక్షిణ కర్ణాటక జిల్లాలోని కొద్దిపాటి భూమిలో 14,100 టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారని జర్నల్ కరెంట్ సైన్స్‌లో ప్రచురితమయ్యే పత్రాల్లో వెల్లడైంది. అందుబాటులో ఉన్న 30,300 టన్నుల ముడి లోహం నుంచి 14,100 టన్నుల లిథియం మెటల్‌ను తయారుచేయవచ్చని అంచనా వేస్తున్నామని బ్యాటరీ టెక్నాలజీస్‌లో ప్రావీణ్యం కలిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఎన్ మునిచంద్రయ్య పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద లిథియం నిల్వలు తక్కువేనని ఆయన అన్నారు. చిలీలో 8.6 మిలియన్ టన్నులు, ఆస్ర్టేలియాలో 2.8 మిలియన్ టన్నులు, అర్జెంటీనాలో 1.7 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్ లిథియంను పూర్తిస్ధాయిలో దిగుమతి చేసుకుంటోంది. చదవండి : స్కోడా తొలి ఇ-వాహనం ఎన్యాక్ -
బెంగళూరు రాప్టర్స్దే పీబీఎల్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా బెంగళూరు రాప్టర్స్ జట్టు నిలిచింది. గచ్చి బౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టు 4–2తో తొలిసారి ఫైనల్ చేరిన నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టును ఓడించింది. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ 14–15, 15–9, 15–3తో లీ చెయుక్ యియు (వారియర్స్)పై నెగ్గి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో బొదిన్ ఇసారా–లీ యోంగ్ డే (వారియర్స్) జంట 15–11, 13–15, 15–14తో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుత్రో (బెంగళూరు) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌ను వారియర్స్ ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ (బెంగళూరు) 15–9, 15–12తో మిచెల్లి లీని ఓడించింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్ సూన్–ఎమ్ హై వన్ (బెంగళూరు) ద్వయం 15–14, 14–15, 15–12తో గారగ కృష్ణప్రసాద్–కిమ్ హా నా (వారియర్స్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోవడంతో ఆ జట్టు 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టు గెలిచినా తుది ఫలితం మారే అవకాశం లేకపోవడంతో దానిని నిర్వహించలేదు. విజేత బెంగళూరు జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. రన్నరప్ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీఫైనల్స్‌లో ఓడిన పుణే సెవెన్ ఏసెస్, చెన్నై సూపర్ స్టార్స్ జట్లకు రూ. 75 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది. లీగ్ దశలో నిలకడగా ఆడిన హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డికి ‘ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ పురస్కారం లభించింది. తై జు యింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు సొంతం చేసుకుంది. హైదరాబాద్ హంటర్స్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డు దక్కింది. -
అత్యంత రద్దీ నగరంగా బెంగళూరు
బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈమేరకు టామ్‌టామ్ (టామ్2) అనే సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. 57 దేశాల్లోని 416 నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ పరిస్థితులపై టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరిట ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో సగటున 71 శాతం ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలిపింది. బెంగళూరు వాసులు ఏడాదిలో సగటున 10 రోజుల 3 గంటల పాటు (243 గంటలు) ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు పేర్కొంది. టాప్–10 జాబితాలో ముంబై, పుణే, ఢిల్లీ నగరాలు వరుసగా 4, 5, 8 స్థానాల్లో నిలిచాయి. ట్రాఫిక్ రద్దీ ముంబైలో 65 శాతంగా, పుణేలో 59 శాతంగా, ఢిల్లీలో 56 శాతంగా ఉంది. టాప్–10లో మనీలా (ఫిలిప్పీన్స్), బొగోటా (కొలంబియా), మాస్కో (రష్యా), లిమా (పెరు), ఇస్తాంబుల్ (టర్కీ), జకార్తా ( ఇండోనేసియా) ఉన్నాయి. -
పెళ్లయిన వారూ పేట్రేగుతున్నారు..
బెంగళూర్ : వివాహేతర సంబంధాల మోజులో సంసారాలు ఛిద్రమవుతున్నా అనైతిక బంధాల కోసం అర్రులు చాచే ధోరణి పెరుగుతోంది. తాజాగా వివాహేతర డేటింగ్ యాప్‌లో ఏకంగా ఎనిమిది లక్షల మంది వివాహితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.తమ భాగస్వాములను మోసం చేస్తూ సాగిస్తున్న రహస్య బంధాల్లో స్ర్తీ, పురుషులు ఇద్దరూ పాలుపంచుకోవడం గమనార్హం. ఈ డేటింగ్ యాప్‌లో టెక్ హబ్ బెంగళూర్ నుంచి అత్యధిక సంఖ్యలో సబ్స్క్రైబర్లు నమోదయ్యారు. జనవరి తొలి వారంలో డేటింగ్ యాప్‌కు సబ్స్క్రైబర్లు వెల్లువెత్తారు. ఈ ఏడురోజులూ రోజుకు 300 శాతం చొప్పున సబ్స్క్రిప్షన్ పెరగ్గా, నెలమొత్తంలో వచ్చిన సబ్స్క్రిప్షన్ల కంటే తొలి వారంలో వచ్చినవి ఏకంగా 250 శాతం అధికం. నూతన సంవత్సర వేడుకలు ముగిసి దంపతులు తమ పనుల్లో నిమగ్నమవడంతో పాటు పిల్లల వింటర్ వెకేషన్ ముగిసిన క్రమంలో వివాహేతర బంధాల డేటింగ్ యాప్‌కు సబ్స్క్రిప్షన్లు వెల్లువెత్తాయని నివేదిక వెల్లడించింది. ఈ యాప్‌లో ఎక్కువ మంది బెంగళూర్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, పూణే, చెన్నై, గుర్గావ్, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్, లక్నో, కొచ్చి, నోయిడా, వైజాగ్, నాగపూర్, సూరత్, ఇండోర్, భువనేశ్వర్ నగరాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ఈ యాప్ వృద్ధి 567 శాతం పైగా ఉండటంతో వివాహ బంధానికి వెలుపల అనైతిక బంధాల కోసం ఎంతగా వెంపర్లాడుతున్నారనేది వెల్లడవుతోందని ఫ్రెంచ్ ఆన్లైన్ డేటింగ్ కమ్యూనిటీ వేదిక నివేదిక తెలిపింది. చదవండి : ప్రియుడితో పారిపోయేందుకు మహిళ ఘాతుకం.. -
ఆ బ్యాంకులో టెకీల హైరింగ్..
బెంగళూర్ : ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ సబ్సిడరీ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన బెంగళూర్ కార్యాలయం కోసం 200 మందికి పైగా ఉద్యోగులను నియమించేందుకు సన్నద్ధమవుతోంది. అమెరికాలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్వీబీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000కి పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ బెంగళూర్ కార్యాలయం కోసం ఇంజనీర్లు, సిస్టమ్ ఆర్కిటెక్ట్స్, డేటా అనలిస్టుల హైరింగ్‌కు సిద్ధమైంది. ఎంపికైన అభ్యర్థులు ప్రాడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ సహా పలు ప్రాజెక్టులపై పనిచేయాల్సి ఉంటుంది. అకౌంటింగ్, రెగ్యులేటరీ రిపోర్టింగ్, ప్రొక్యూర్మెంట్, ట్యాక్స్, ట్రెజరీ సపోర్ట్ వంటి సేవలను ఎస్వీబీ తమ క్లయింట్లకు అందచేస్తుంది. డిజిటల్ ఫ్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తూ నైపుణ్యాలను సంతరించుకున్న సిబ్బంది కోసం నియామక ప్రక్రియ చేపట్టామని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సీఈవో డేనియల్ బెక్ వెల్లడించారు. బెంగళూర్‌లో ఇటీవల సెంటర్‌ను ప్రారంభించిన ఈ బ్యాంకుకు అమెరికా సహా హాంకాంగ్, బీజింగ్ షాంఘై, లండన్, ఫ్రాంక్ఫర్ట్ వంటి పలు ప్రపంచ నగరాల్లో 30 కేంద్రాల నుంచి తన కార్యకలాపాలను సాగిస్తోంది. -
యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్ సింగ్
-
యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్
బెంగళూర్ : యుద్ధ విమానం తేజాస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో పైలట్ వెనుక సీటులో కూర్చున్న రాజ్‌నాథ్ సింగ్ హెల్మెట్ ధరించి, ఆక్సిజన్ మాస్క్‌తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్‌లోని హాల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్‌లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా ఉన్నానని రాజ్‌నాథ్ సింగ్ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. తేజాస్ యుద్ధ విమానంలో పర్యటించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ పేరిట రికార్డ్ నమోదైంది.పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో విహారం ఆస్వాదించానని, తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ కొనుగోలుకు ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. పైలట్ సూచనతో తాను కొద్దిసేపు విమానాన్ని నియంత్రించానని ఈ అనుభవం తనను థ్రిల్‌కు గురిచేసిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.కాగా ఈ ఏడాది జనవరిలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సుఖోయ్ 30 యుద్ధ విమానంలో జోథ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేఫన్ సుంచి 45 నిమిషాల పాటు ప్రయాణించారు. -
డీకే శివకుమార్‌కు 10రోజుల కస్టడీ
బెంగళూరు : మనీ లాండరింగ్ కేసులో నిన్న సాయంత్రం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను 14 రోజులపాటు తమ కస్టడీకీ అప్పగించాలంటూ బుధవారం ఈడీ అధికారులు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి శివకుమార్‌ను10 రోజుల(సెప్టెంబర్ 13 వరకు) కస్టడీకి మాత్రమే అనుమతినిస్తూ ఈడీకి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నిన్న రాత్రి అరెస్టయినప్పటి నుంచి చాతీ నొప్పి వచ్చి, బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడంతో బెంగుళూరులోని ఆర్ఎల్ఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తవడంతో ఈడీ అధికారులు శివకుమార్‌ను అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తరలించారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన డీకే శివకుమార్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆగస్టు 30 నుంచి జరుగుతున్న విచారణ సెస్టెంబర్ 3తో ముగియడంతో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆయన అంతగా సహకరించకపోవడంతో.. మరింత లోతుగా విచారించడానికే ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. కాగా, శివకుమార్ అరెస్టును నిరసిస్తూ బుధవారం కర్నాటక కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ హింసాత్మకంగా మారింది. పలుచోట్ల ఆందోళనకారులు బస్సు అద్దాలను ద్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను, కళాశాలలను బలవంతంగా మూసివేయించారు. రాజకీయ కక్షసాధింపుకు ఇదే ఉదాహరణ : రాహుల్ డీకే శివకుమార్ అరెస్టు వ్యవహారంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ఈ అరెస్టు చర్య బీజేపీ రాజకీయకక్ష సాధింపు చర్యలకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కావాలనే కొందరు వ్యక్తులను ఎంపిక చేసుకొని మరీ వారిపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. -
కుటుంబ సభ్యులను చంపి.. తానూ కాల్చుకున్నాడు
సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. మైసూరుకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను చంపి ఆపై తనను తాను కాల్చుకున్నాడు. ఈ విషాదకర ఘటన మైసూరులోని గుండ్లుపేట్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరుకు చెందిన ఓం ప్రకాశ్ భట్టాచార్య(38) బిజినెస్మెన్. వ్యాపారంలో ఆర్థికంగా నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. తాను చనిపోతే కుటుంబసభ్యులు దిక్కులేని వాళ్లవుతారని భావించి వాళ్లని చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓం ప్రకాశ్ గురువారం తన కుటుంబ సభ్యులను తీసుకొని మైసూరు సమీపంలోని గుండ్లుపేట్‌లో ఉన్న తన స్నేహితుడు ఫాంహౌజ్‌కు వచ్చాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో తొలుత తండ్రి నాగరాజ భట్టాచార్య(65), తల్లి హేమ(60), భార్య నిఖిత(30), కొడుకు ఆర్యకృష్ణ(4)లను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వివరాలను చమ్రాజ్నగర్ ఎస్పీ హెచ్డి ఆనంద్‌కుమార్ వెల్లడించారు. -
భర్తకు మైనర్ బాలికతో వివాహం
బెంగళూర్ : తన ఇంట్లో ఆశ్రయం పొందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పెయింటర్ ఉదంతం వెలుగుచూసింది. లైంగిక దాడికి పాల్పడిన భర్తను పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో నిందితుడి భార్య బాలికతో ఆయనకు బలవంతంగా వివాహం జరిపించింది. కోలార్ జిల్లా మలూర్ తాలూకా హునసికోట్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పెయింటింగ్ పనులకు వెళ్లే గంగరాజు (32) భర్తను వదిలివేసిన పల్లవి కొద్దినెలల కిందట పెళ్లి చేసుకుని హునసికోట్‌లో ఉంటున్నారు. గత వారం పల్లవికి వరుసకు సోదరి అయ్యే 13 ఏళ్ల బాలిక వారి ఇంటికి వచ్చి వారితో కలిసి ఉంటోంది. మైనర్ బాలికపై కన్నేసిన గంగరాజు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. అయితే గ్రామంలో ఈ విషయం తెలియడంతో మలూర్‌లోని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందింది. బాలికను పోలీసులు ప్రశ్నించగా భయంతో అలాంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పింది. చైల్డ్ హెల్ప్‌లైన్‌కు మరో ఫిర్యాదు అందడంతో కౌన్సెలర్, లీగల్ అడ్వైజర్‌తో కలిసివచ్చిన పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు రాబట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదుపై గంగరాజు, పల్లవిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
తాగుడుకు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి..
బెంగళూర్ : మద్యం సేవించేందుకు డబ్బు ఇవ్వలేదని ఏకంగా తల్లికి నిప్పంటించిన కొడుకు ఉదంతం బెంగళూర్‌లో వెలుగుచూసింది. కుమారుడి నిర్వాకంతో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సదాశివనగర్ ప్రాంతంలో మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని 20 ఏళ్ల ఉత్తమ్‌కుమార్ తల్లితో గొడవపడ్డాడు. తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉత్తమ్ తన తల్లిపె పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు. మహిళ భర్త ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. మహిళ ముఖం, చేయి, ఛాతీపై గాయాలయ్యాయి. కాగా నిందితుడు ఉత్తమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు నగరంలో ఇదే తరహా ఘటనలో తల్లిని కొట్టిన కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ధర్నాలతో అలిసి ప్రకృతి చికిత్సకు..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకృతి చికిత్స కోసం గురువారం బెంగళూర్ వెళుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ పదిరోజుల పాటు బెంగళూర్‌లో గడుపనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ కార్యాలయంలో వారం రోజులకు పైగా ధర్నా చేపట్టిన కేజ్రీవాల్ రెండు రోజుల కిందటే ఆందోళనను విరమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారులు తిరిగి విధులకు హాజరవుతుండటంతో కేజ్రీవాల్ ధర్నా విరమించారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. కొద్దిరోజుల కిందటే కేజ్రీవాల్ బెంగళూర్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాల్సి ఉందని అయితే ఐఏఎస్‌ల సమ్మె తదనంతర పరిణామాల నేపథ్యంలో వాయిదా పడిందని చెప్పారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి అనంతరం పాలక ఆప్‌తో బ్యూరోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. ఐఏఎస్‌ల సమ్మెను నివారించాలని, ఢిల్లీపై కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్ సహా ఆయన మంత్రివర్గ సహచరులు ధర్నా చేపట్టారు.