-
బాబు, లోకేష్ కు నోటీసులు..?
-
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్ నోటీసులు అంటే?బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు. -
అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.ఎన్నికల కోడ్‌ను మోదీ, రాహుల్ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 29, ఉదయం 11 గంటల లోపు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్‌ను ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని పేర్కొంది. ECI issues notice to BJP President JP Nadda seeking party’s response on complaints of violation of model code of conduct by PM Modi during campaign in Rajasthan.BJP asked to respond by April 29. pic.twitter.com/9TmNOoWlE7— Arvind Gunasekar (@arvindgunasekar) April 25, 2024 -
షర్మిలకు ఎన్నికల కమిషన్ షాక్
-
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్: ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా
ఇజ్రాయెల్‌పై ఇరాన్ 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్‌తో భీకరదాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం భారీగా ఎత్తును డ్రోన్లు, మిసైల్స్‌తో విరుచుకుపడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్‌ను 99 శాతం అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. దాడి చేసే ముందు అమెరికాతో సహా ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు తాము 72 గంటల ముందస్తు హెచ్చరిక నోటీసు ఇచ్చినట్లు ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడికి ముందే అమెరికాకు 72 గంటల హెచ్చరిక నోటీసు ఇచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ నుంచి తమకు ఎలాంటి హెచ్చరిక నోటీసులు రాలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఉన్నతధికారి ఒకరు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో ముందస్తుగా ఇరాన్ తమను హెచ్చరించలేదని.. దాడిచేసిన తర్వాతే తమకు ఇరాన్ సమాచారం అందించిదని అన్నారు. మరోవైపు ఇరాన్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేయాలని వార్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ మరింత అప్రమత్తంగా ఉందని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. ప్రమాదకర, రక్షణాత్మక చర్యల కోసం కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు. ఇక.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను ఇరాన్ ఐక్యరాజ్యసమతి వేదికగా సమర్థించుకుంది. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది. దాదాపు 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన ఇరాన్‌పై అదను చూసి.. తగిన రీతిలో ప్రతీకార దాడులకు దిగుతామని ఇజ్రాయెల్ మంత్రి బిన్నీ గంట్జ్ తెలిపారు. -
పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు..
-
మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ అధికారుల సమన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించారు. ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణాకు సంబంధించి హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్ 27వ తేదీన హాజరు కావడానికి అంగీకరించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఫ్రిబవరి ఐదో తేదీన చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్టు గుర్తించారు. ఆ వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. అయితే, పాటెక్ ఫిలిప్ వాచ్‌కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు. ఇక, బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీలను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం చూసి వారే ఖంగుతున్నారు. దీంతో ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరును వెల్లడించారు. ఇదే క్రమంలో మార్చి 12న అలోకం నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. స్పందించిన హర్ష.. ఈ సందర్భంగా రెండు వాచీలను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్‌ను లగ్జరీ వాచ్ డీలర్‌గా, నవీన్‌కుమార్ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక, ఈ వాచీల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించాయి. కాగా, చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత నెల 28వ తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. దీంతో, ఏప్రిల్ 27వ తేదీన హాజరవుతానని ఈనెల మూడో తేదీన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, పరిమాణాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచీల అక్రమ రవాణాలో తనకు ప్రమేయం లేదన్నారు. ఇవన్నీ నిరాధారమైనవని అన్నారు. అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. మరోవైపు.. హర్షను విచారించే వరకు నవీన్ కుమార్‌కు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది. -
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. -
124 ఏళ్ల భవనం కూల్చివేతకు నోటీసు.. కోర్టును ఆశ్రయించిన యజమాని!
ముంబైలోని ‘సాత్ బంగ్లా’ అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 124 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు బంగ్లాలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒకదానిని కూల్చివేసేందుకు బీఎంసీ సిద్ధమవుతోంది. దీంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. సముద్రతీరానికి దగ్గరలో నిర్మించిన ఈ బంగ్లాలో పలు గదులు, గ్లాస్ వర్క్‌తో కూడిన హాలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్‌లు, బసాల్ట్ స్టోన్ ఫ్లోరింగ్ ఉన్నాయి. ఈ బంగ్లాను ‘1900 ఏడీ’లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ భవనం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కాగా గత ఫిబ్రవరి 29న రతన్ కుంజ్ పేరుతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బీఎంసీ దాని యజమానికి నోటీసు జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, కూలిపోయే అవకాశం ఉందని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ ఆస్తి సహ యజమానులు షాలు రాహుల్ బరార్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు ఈ నోటీసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మా ఆడిట్, ఇన్‌టేక్ నివేదికలో ఈ ఆస్తిని భద్రంగా చూస్తామని పేర్కొన్నాం. భవనానికి మరమ్మతులు చేశాం. ఈ కూల్చివేత నోటీసు మాకు పెద్ద దెబ్బ లాంటిది. మా చివరి శ్వాస వరకూ ఈ బంగ్లాను కాపాడుకునేందుకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ బంగ్లాను ‘తలాటి బంగ్లా’ అని పిలిచేవారు. సొరాబ్జీ తలాటి పార్సీ కుటుంబం దీనికి ఈ పేరు పెట్టింది. 1896లో దేశంలో ప్లేగు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ‘ఏడు బంగ్లాలు’ నిర్మితమయ్యాయి. ఈ భవనం పూర్వ యజమానులు గ్వాలియర్ మహారాజా, కచ్ మహారాజా, దాదాభాయ్ నౌరోజీ, రుస్తమ్ మసాని, సొరాబ్జీ తలాటి, చైనాస్, ఖంబటాస్. ఇటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అవసరమని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిని చారిత్రక భవనాలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు. -
సీమా హైదర్‌కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!
పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్‌లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్‌లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ తెలిపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. -
సీబీఐ విచారణకు 26న ఢిల్లీ రాలేను
సాక్షి, హైదరాబాద్: ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా ఈనెల 26న ఢిల్లీలో విచార ణకు హాజరుకావడం సాధ్యం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీ సుల రద్దు లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఆదివారం కవిత సీబీఐకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇటీవల సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా రాసిన లేఖలో కవిత కీలకాంశాలను ప్రస్తావించారు. తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం వల్ల తాను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత చెప్పారు. గతంలో ఈడీ నోటీసులు జారీ చేస్తే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని, అది పెండింగ్‌లో ఉందన్నారు. తనను విచార ణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో సీబీఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పు డు విచారణకు సహకరించానని, సీబీఐ దర్యా ప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ‘ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ (బీఆర్ఎస్) కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించండి’ అని కవిత సీబీఐకి సమాధానమిచ్చారు. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్ ! హాజరు కాకుంటే..
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు
-
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
-
అమెజాన్ కు కేంద్రం నోటీసులు
-
ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు కార్మిక శాఖ నోటీసు
పలమనేరు(చిత్తూరు జిల్లా): తాను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్లో 20 ఏళ్లు విలేకరిగా వెట్టిచాకిరి చేశానని, కనీసం జీతం కూడా ఇవ్వకుండా తనను తొలగించారని, ఈ మేరకు సంస్థపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశానని ఆర్ఎస్ లోకనాథం అనే వ్యక్తి శుక్రవారం తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పలమనేరు పట్టణానికి చెందిన ఆర్ఎస్ లోకనాథం 20 ఏళ్లు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్లో పనిచేశారు. ఇటీవల చానల్‌లోని పలువురిని కుదించి పలమనేరు రిపోర్టరే మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలని ఆదేశించారు. దీంతో లోకనాథం కారు అద్దెకు తీసుకుని ముఖ్యమైన కార్యక్రమాలను కవర్ చేశారు. ఇందుకు సంబంధించిన అద్దె బిల్లులను బ్రాంచ్ మేనేజర్ పెట్టుకుని డబ్బు డ్రా చేసుకోవడంతో కడుపుమండిన బాధితుడు తమ యాజమాన్యం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే లోకనాథంపైనే ఆగ్రహం వ్యక్తంచేసి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై బాధితుడు తిరుపతిలోని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీఎల్) బాబూనాయక్కు గత నెల 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీసీఎల్ గత నెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. -
టీసీఎస్ సంచలన నిర్ణయం?, ‘ ఆ 900 మంది ఉద్యోగుల శాలరీ నిలిపేసిందా?’
ఉద్యోగుల విషయంలో టెక్ దిగ్గజం టీసీఎస్ అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2 వేల మంది ఉద్యోగుల్ని రీలొకేట్ చేసిందంటూ ఐటీ ఉద్యోగుల సంఘం ‘నైట్స్’ ఆరోపించింది. తాజాగా, వారిలో చెప్పిన మాట వినలేదన్న కారణంతో 900 మంది ఉద్యోగుల జీతాల్ని నిలిపివేసిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం టెక్ కంపెనీల్లో చర్చాంశనీయంగా మారింది. ఇటీవల కాలంలో చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపు నిస్తున్నాయి. 2 వేల మంది బదిలీ అయితే, గత ఏడాది నవంబర్‌లో టీసీఎస్ 2వేల మంది టెక్కీలకు వర్క్ ఫ్రమ్ హోంను రద్దు చేసింది. ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 2 వేల మంది ఉద్యోగుల్ని ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసింది. ఇందుకోసం 15 రోజులు గడువు విధించింది. గడువు ముగిసే లోపు ఉద్యోగులు బదిలి చేసిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అంశంపై టీసీఎస్ ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. ఐటీ ఉద్యోగుల్ని కాపాడండి ఈ తరుణంలో నైట్స్ తాజాగా టీసీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహరాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఉద్యోగుల రీలొకేట్ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ టీసీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, ఆ సంస్థ అనైతిక పద్దతుల నుంచి ఐటీ ఉద్యోగుల్ని కాపాడాలని కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు. 900 మంది ఉద్యోగుల జీతాల నిలిపివేత ఈ నేపథ్యంలో ఉద్యోగుల పట్ల టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు బదిలీ నోటీసులు పంపిన కొద్ది నెలలకే తమ కంపెనీ విధానాలకు అనుగుణంగా లేరంటూ 900 మందికి పైగా జీతాలు చెల్లించకుండా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై టీసీఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జీతాల్ని నిలిపి వేసి “రీలొకేషన్‌ను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల జీతాలను టీసీఎస్ అనైతికంగా నిలిపివేసింది. బలవంతపు బదిలీలను అంగీకరించమని లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్న టీసీఎస్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని నైట్స్ తీవ్రంగా ఖండిస్తుంది. రీలొకేషన్ వల్ల ఉద్యోగులకు కలిగి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అంతరాయం, ఒత్తిడి, ఆందోళనలన్నింటినీ కంపెనీ విస్మరిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది. నా జీతం 6వేలే మరోవైపు ఓ జాతీయ మీడియా సంస్థ బాధిత ఉద్యోగుల్లోని కొందరితో గూగుల్‌మీట్‌లో మాట్లాడింది. ‘‘మమ్మల్ని రీలొకేట్ చేసింది కానీ ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కంపెనీ పోర్టల్ అల్టిమాటిక్స్లో టైమ్ షీట్‌ను అప్డేట్ చేయలేదనే కారణంతో కొంతమంది ఉద్యోగులకు డిసెంబర్ నెలకు కేవలం రూ. 6వేలు మాత్రమే చెల్లించింది’’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. మాట వినలేదని బాధిత ఉద్యోగులలో ఓ ఉద్యోగికి టీసీఎస్ ఓ మెయిల్ పంపింది. అందులో ఇలా ఉంది.. “ఈ ఈమెయిల్ మిమ్మల్ని టీసీఎస్ ముంబై బ్రాంచ్ రీలొకేషన్‌కు సంబంధించింది. 14 రోజుల్లోపు సంబంధిత బ్రాంచ్‌కు సమాచారం అందించి.. ఈ కాపీలో ఉన్న వివరాల్ని మీరు పూర్తి చేసి మెయిల్‌కు రిప్లయి ఇవ్వండి’’ అని సారాంశం. ఈ మెయిల్ వచ్చిన కొద్దిరోజులకు మరో మెయిల్ వచ్చింది. మీరు ఇప్పటి వరకు బదిలీ చేసిన బ్రాంచ్‌కి రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యారని గుర్తించాం. కంపెనీ నిర్ణయాన్ని పాటించనుందుకు మీ జీతాన్ని తక్షణమే నిలిపి వేస్తున్నాం అని మెయిల్లో తెలిపింది. చేతిలో ప్రాజెక్టేలేదు.. “ఆర్ధిక సమస్యల కారణంగా మా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 3-4 నెలలు బెంచ్‌లో ఉన్నాం. ఆ సమయంలో, నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా వేరే ప్రాంతానికి వెళ్లమని సంస్థ ఆదేశించింది. బెంచ్‌లో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏం లాభం’’ అని మరో ఉద్యోగి ప్రశ్నించాడు. -
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్‌గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్‌లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్‌గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్‌గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్‌లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
దయచేసి 'న్యూ ఇయర్' రోజు ఇటువైపు వెళ్లకండి!
కరీంనగర్: న్యూ ఇయర్ సందర్భంగా లోయర్ మానేరు డ్యాం, కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలి పారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 01(సోమవారం) ఉదయం 5 గంటల వరకు ఎల్ఎండీ కట్ట, తీగల వంతెనపై ఆ ంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు జరుపుకునేందుకు వాటి పైకి అనుమతించబోమన్నారు. వాహనదారులు గమనించి, ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అలాగే, రోడ్లమీద వేడుకలు నిర్వహించడం, డీజేలను వినియోగించడం, బైక్ సైలెన్సర్లను మార్చి శబ్ధ కాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ వంటి వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ముందస్తు అ నుమతి లేకుండా జనసమూహంగా ఏర్పడి, కార్యక్రమాలు చేపట్టినా, ప్రైవేట్ పార్టీలు నిర్వహించినా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా! -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ
-
జొమాటోకి గట్టి షాక్.. ఆ చార్జీలపైనా జీఎస్టీ కట్టాల్సిందే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) షాకిచ్చింది. రూ.401.7 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించనందుకు డీజీజీఐ తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకి పన్ను నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలు వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలు సేవల కేటగిరీ కిందకు వస్తాయని, వీటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. పెనాల్టీలు, వడ్డీ కూడా.. జీఎస్టీ బకాయిలతోపాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్ను చెల్లించలేకపోవడంపై 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరిమానాలు, వడ్డీని కూడా చెల్లించాలని జొమాటోను డీజీజీఐ ఆదేశించింది. జొమాటో స్పందన డీజీజీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జొమాటో స్పందించింది. తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. "డెలివరీ ఛార్జ్‌ని డెలివరీ భాగస్వాముల తరపున కంపెనీ వసూలు చేస్తుంది. కానీ కంపెనీ నేరుగా డెలివరీ సర్వీసులు అందించదు. కాంట్రాక్టు నిబంధనలు, షరతుల మేరకు డెలివరీ భాగస్వాములు కస్టమర్లకు డెలివరీ సేవలు అందిస్తారు." అని పేర్కొంది. లీగల్, ట్యాక్స్ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని షోకాజ్‌కు నోటీసుకు తగినవిధంగా స్పందన సమర్పిస్తామని ప్రకటనలో పేర్కొంది. -
లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో నిర్దేశించిన షరతులను లోకేశ్ ఉల్లంఘించారని న్యాయస్థానానికి తెలియజేసింది. రెడ్‌బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరిస్తూ.. భయపెట్టేందుకు ప్రయత్నించారని వివరించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోకేశ్ ఆరోపణలు చేశారని పేర్కొంది. సీఐడీ స్పెషల్ పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి ఈ పిటిషన్ గురించి శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. ఉద్దేశపూర్వకంగానే బెదిరించారు.. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ 14వ నిందితునిగా ఉన్నారు. విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని లోకేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద గతంలో నోటీసు ఇచ్చాం. అందులో పలు షరతులు విధించాం. ఈ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినైనా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయకూడదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాం. ఆ తర్వాత ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అతన్ని 2 రోజుల పాటు విచారించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఈనెల 19న ఏబీఎన్, ఈటీవీ తదితర చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను, అతని పాత్ర గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను బెదిరించారు. సాక్షులను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారు. కోర్టులను కించపరిచేలా పలు ఆరోపణలు కూడా చేశారు. 53 రోజుల పాటు తన తండ్రి చంద్రబాబును రిమాండ్‌కు పంపడమన్నది రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యవస్థలను మేనేజ్ చేయడం’ ద్వారానే జరిగిందని లోకేశ్ అన్నారు. నిందితులను రిమాండ్‌కు పంపడం న్యాయ ప్రక్రియలో భాగం. కానీ న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని లోకేశ్ మాట్లాడారు. ఆయన ఆరోపణల వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అలాగే ఓ రెడ్ బుక్‌ను సిద్ధం చేస్తున్నామని.. తాము అధికారంలోకి వస్తే అందులో ఉన్న వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమంటూ లోకేశ్ బెదిరించారు. చంద్రబాబు, లోకేశ్‌లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఇంటర్వ్యూలను, అందుకు సంబంధించిన వివరాలను సీడీలో కోర్టు ముందుంచాం. వాటిని పరిగణనలోకి తీసుకుని లోకేశ్ అరెస్ట్‌కు ఆదేశాలివ్వండి’ అని దుష్యంత్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. నేరుగా అరెస్టు చేయవచ్చు కదా? ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ.. 41ఏ కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘిస్తే, మీరే నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని దుష్యంత్ బదులిచ్చారు. అలా అయితే ముందు తాను లోకేశ్ ఇంటర్వ్యూలను చూసి, ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి చెప్పారు. ఇంటర్వ్యూలను చూసిన తర్వాత లోకేశ్‌కు నోటీసులు జారీ చేసి.. వారి వివరణ కూడా తెలుసుకుంటామన్నారు. అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబూ ఉల్లంఘించారు.. పోలీసులను, సాక్షులను పలు ఇంటర్వ్యూల్లో లోకేశ్ బెదిరించిన విషయాన్ని సీఐడీ హైకోర్టు దృష్టికి కూడా తెచ్చింది. ఆయన ఇంటర్వ్యూలను పెన్ డ్రైవ్‌లో ఉంచి వాటిని ఓ మెమో రూపంలో సీఐడీ స్పెషల్ పీపీ దుష్యంత్ శుక్రవారం హైకోర్టు జడ్జి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు ముందుంచారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఎంతో పరపతి కలిగిన వ్యక్తులని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులను విధించిందని గుర్తు చేశారు. కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదని స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిందన్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు వెలువరించే ముందు చంద్రబాబు, లోకేశ్‌లు మాట్లాడిన మాటలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని దుష్యంత్ కోర్టును కోరారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయని.. ఈ దశలో ఈ కేసుతో సంబంధం లేని వివరాలతో దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ మెమోపై అభ్యంతరాలుంటే వాటిని తమ ముందుంచాలని ప్రణతిని ఆదేశించారు. వాటిని పరిశీలించాక చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్‌లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్‌రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement