Sankalp Reddy
-
నా సినిమాల్లో దేశభక్తి అలా కుదురుతోంది!
‘‘ఇండియన్ ఇంటెలిజెన్సీ బ్యూరో ప్రతినిధులు పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఓ స్పై ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ఫుల్ కావడం వల్ల వేలాదిమంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ మిషన్ తాలూకు విషయాలను తెలుసుకోవాలంటే ‘ఐబీ 71’ సినిమా చూడాలి. ఓ చారిత్రాత్మక ఘటనతో తీసిన ఈ చిత్రంలో దేశభక్తి తాలూకు మూమెంట్ప్ ఉంటాయి’’ అన్నారు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన హిందీ థ్రిల్లర్ ‘ఐబీ 71’. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సంకల్ప్మాట్లాడుతూ– ‘‘ఘాజీ’ ఇన్సిడెంట్‌కు ముందు కశ్మీర్లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తీసిన చిత్రమే ‘ఐబీ 71’. ‘ఘాజీ’, ‘రాజీ’, ఇప్పుడు ఈ ‘ఐబీ 71’.. ఇవన్నీ ఇండియా–పాకిస్తాన్ (1971) యుద్ధానికి ముందు జరిగిన ఘటనల నేపథ్యంలో వచ్చిన సినిమాలు. ఈ ఘటల తాలుకూ విషయాలు అప్పట్లో న్యూస్‌పేపర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆ సమాచారం ఆధారంగా, కొత్తమంది వ్యక్తుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’, ఇప్పుడు ‘ఐబీ 71’ కథల్లో భాగంగానే దేశభక్తి అంశం మిళితమై ఉంది. అంతేకానీ ప్రత్యేకంగా దేశభక్తి నేపథ్యాల్లో చేయాలని నేనీ సినిమాలు చేయలేదు. అలా కుదురుతోంది.. అంతే. బహుశా అంతర్లీనంగా నాలో ఉన్న దేశభక్తి ఓ కారణమేమో! హిందీలో నాకు ‘ఐబీ 71’ తొలి సినిమా. తెలుగులో నా తొలి సినిమా ‘ఘాజీ’ అండర్‌వాటర్ బ్యాక్‌డ్రాప్, రెండో సినిమా ‘అంతరిక్షం’ స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ‘ఐబీ 71’ బ్యాక్‌డ్రాప్ ఆకాశం. అలాగే భూమి, నిప్పుల బ్యాక్‌డ్రాప్‌లో కూడా సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు. -
ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా సినిమా, వీడియో చూశారా?
విద్యుత్ జమాల్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఐబీ 71’. దలీప్ తాహిల్, అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు. టి–సిరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విద్యుత్ జమాల్ నిర్మించిన ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐబీ ఆపరేషన్1: ఇంటెలిజెన్స్ ఇన్ యాక్షన్’ అనే వీడియోను విడుదల చేశారు. ‘‘1971లో ఇండియా – పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. అయితే ఈ వార్‌లో ఇండియా గెలవడానికి కారణమైన ‘ఇంటెలిజెన్స్ బ్యూరో సీక్రెట్ మిషన్స్ ఆధారంగా, వాస్తవ ఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
సీక్రెట్ మిషన్
తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్‌పీహెచ్’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్ చేశారు. స్పైజానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్‌లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఓ సీక్రెట్ మిషన్ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న తెలుగు డైరెక్టర్లు
హిందీ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా అరుదు. తెలుగు దర్శకులు హిందీకి వెళ్లడం కూడా అరుదే. అయితే ఇప్పుడు ఒకేసారి ఐదుగురు దర్శకులు హిందీ చిత్రాలు చేస్తున్నారు. హిందీ పరిశ్రమ మనవాళ్లకు ‘స్వాగ్ సే స్వాగత్’ పలికింది. అంటే... ఆత్మీయ స్వాగతం పలికింది. ఆ ఆహ్వానం అందుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగులో వీవీ వినాయక్ స్టార్ డైరెక్టర్. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. తొలి సినిమా ‘ఆది’ (2002)తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న వీవీ వినాయక్ ఆ తర్వాత ‘దిల్’(2003), ‘ఠాగూర్’(2003), ‘బన్నీ’(2005), ‘కృష్ణ’ (2008) ‘అదుర్స్’ (2010), ‘ఖైదీ నంబరు 150’ (2017) వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హిందీ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ఆయన దర్శకుడిగా బీ టౌన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఇటు సాయి శ్రీనివాస్‌కు కూడా హిందీలో ‘ఛత్రపతి’యే తొలి సినిమా కావడం విశేషం. ఇక ‘అర్జున్‌రెడ్డి’ (2017) సక్సెస్‌తో డైరెక్టర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కభీర్ సింగ్’ (2019)గా రీమేక్ చేసి, బాలీవుడ్‌లోనూ నిరూపించుకున్నారు. ఇప్పుడు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు సందీప్. మరోవైపు తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సాధించి ఇండస్ట్రీ దృష్టిని వెంటనే తన వైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా బీ టౌన్ దర్శకుల లిస్ట్‌లో చేరారు. విద్యుత్ జమాల్ హీరోగా‘ఐబీ 71’ అనే స్పై థ్రిల్లర్‌ను తీయనున్నారు సంకల్ప్. జాతీయ అవార్డు సాధించిన మరో తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా హిందీకి హాయ్ చెబుతున్నారు. ‘మళ్ళీ రావా’(2017) వంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల మెప్పు పొందిన గౌతమ్ 2019లో నానీతో తీసిన ‘జెర్సీ’కి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరియే దర్శకుడు. ఈ ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వక్ సేన్ ‘హిట్’ (2020) చిత్రంతో దర్శకుడిగా హిట్టయ్యారు శైలేష్ కొలను. తెలుగు ప్రేక్షకులు ‘హిట్’ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలనుయే డైరెక్టర్. ఇందులో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయమైన చిత్రం ‘మత్తువదలరా’ (2019)తో దర్శకుడిగా పరిచయమయ్యారు రితేష్ రాణా. ఈ చిత్రం హిందీ రీమేక్‌తో దర్శకుడుగా రితేష్ బీ టౌన్లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌కు డైరెక్షన్ మార్చారు. ఇదిలా ఉంటే.. ఈ దర్శకులందరూ హిందీలో డైరెక్ట్ సినిమా ద్వారా పరిచయమవుతుంటే, ప్యాన్ ఇండియన్ సినిమాల ద్వారా మరికొందరు హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు. -
కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!
నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన యాంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’. నాలుగు కథలున్న ఈ యాంథాలజీను తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మీ మంచు, జగపతి బాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, ఈషా రెబ్బా, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీ ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ నలుగురు దర్శకులు. నందినీ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీలో ఎక్కువ శాతం వీక్షకులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అని సర్వేలో ఉంది. పెనం మీద నీళ్లు వేస్తే ఆవిరైపోయినట్టు అయిపోతుంది కంటెంట్. ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ లేదు. ఆ డిమాండ్ చాలా ఉంది. ఓటీటీ అవకాశం వచ్చినప్పుడు ఆడియన్స్ చూస్తారా? చూడరా? అని ఆలోచించలేదు. కొత్త ఫార్మాట్లో కథ చెప్పగలుగుతున్నాం అని ఎగ్జయిట్ అయ్యాను. మమ్మల్ని మేం టెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది. కొత్తదారిలో వెళ్లొచ్చు అనిపించింది. ఎంత సమయంలో కథ చెబుతున్నాం అనేది చాలెంజ్ కాదు అనిపించింది. యాడ్ ఫిల్మ్‌లోనూ ఒక కథ చెప్పొచ్చు. 30 నిమిషాల్లో కథ చెప్పడం బావుంది’’ అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే సినిమా కథకు ఇది సరిపోతుందా? సరిపోదా అని ఆలోచించుకోవాలి. కానీ చాలా కథలు 20–30 నిమిషాల్లో చెప్పేవి ఉంటాయి. దాన్ని సినిమాగా చేయలేం. ఇలాంటి యాంథాలజీల్లో, డిజిటల్లో ఈ కథలు చెప్పొచ్చు. ఇది చాలా బాగా అనిపించింది. ఈ యాంథాలజీ చేస్తూ దర్శకులుగా మమ్మల్ని మేం కనుగొన్నాం అనిపించింది. ఇది భారీ మార్పుకు దారి తీస్తుంది. మనం కథల్ని చెప్పే విధానంలో మార్పు వస్తుంది. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ధైర్యం చేసేయాలి. మేం చేశాం. ఇలా చేసినప్పుడు కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటాం. స్టార్స్ కూడా ఓటీటీలో చేయాలి. చిన్న తెరపై కనిపిస్తే స్టార్డమ్ తగ్గిపోతుంది అనుకోవద్దు. ప్రతీ స్క్రీన్‌కి వెళ్లి.. కథల్ని ఇంకా ఎంత కొత్తగా చెప్పగలం అని ప్రయత్నిస్తూనే ఉండాలి’’ అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘30 నిమిషాల్లో కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో చెప్పే కథలు ఇంకా చాలా ఉన్నాయనిపించింది. అందరి కంటే లాస్ట్ నా పార్ట్ షూట్ చేశాను. మార్చిలో షూట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత షూట్ చేయడం మరో చాలెంజ్. కోవిడ్ టెస్ట్ వల్ల కాస్త బడ్జెట్ యాడ్ అయింది (నవ్వుతూ). మారుతున్న టెక్నాలజీ మనకు బలం ఇస్తుందా? లేక దానికి మనం బలం ఇస్తున్నామా అనే ఆలోచనతో నా కథను తెరకెక్కించాను’’ అన్నారు నాగ్ అశ్విన్. సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ –‘‘అన్ని కథలు థియేటర్‌కి సెట్ కావు. అలాంటి కథలు ఓటీటీలో ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు చూసుకోవచ్చు. ఈ పిట్ట కథలు అలాంటివే. చిన్న కథలోనూ సంపూర్ణంగా అనిపించే ఫీలింగ్ కలిగించొచ్చు. ఈ కొత్త ఫార్మాట్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలు ఇంకా చెప్పాలనుంది’’ అన్నారు. -
హిందీకి..
‘ఘాజీ, అంతరిక్షం’ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను, ప్రత్యేకతను చాటుకున్నారు యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. తన మూడో సినిమాను బాలీవుడ్లో చేయడానికి సంప్రదింపులు చేస్తున్నారు. ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ సినిమా కూడా కమిట్ అయినట్లు సమాచారం. విద్యుత్ జమాల్ హీరోగా ఓ సినిమా తీయడానికి కథ సిద్ధం చేయమని విద్యుత్ తండ్రి సంకల్ప్‌ని కోరారట. ఆ కథను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారట సంకల్ప్. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ఏది ముందు సెట్స్ మీదకు వెళ్తుందో వేచి చూడాలి. -
వెబ్‌లో అడుగేశారు
నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ అయిన హిందీ ఆంథాలజీ (ముగ్గురు లేదా నలుగురు దర్శకులు చిన్న చిన్న కథలను ఓ సినిమాగా రూపొందించడం) ‘లస్ట్ స్టోరీస్’. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకురాబోతోంది. ఈ ఆంథాలజీని నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చే స్తారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించే కథలో ఈషారెబ్బా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పార్ట్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈషారెబ్బాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా డిజిటల్ ఎంట్రీకి ఇదే తొలి వేదిక కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించే భాగంలో అమలా పాల్ నటిస్తున్నారు. -
తెలుగులో లస్ట్ స్టోరీస్
‘ఘాజీ, అంతరిక్షం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్‌రెడ్డి. మూడో చిత్రాన్ని బాలీవుడ్లో చేసే అవకాశం అందుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు లాక్ చేసిన ఆయన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పనిలో ఉన్నారు. మరోవైపు ఆయన నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించనున్నారట. గత ఏడాది బాలీవుడ్లో సంచలనం రేపిన ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వర్షన్‌ని సంకల్ప్ డైరెక్ట్ చేయనున్నారు. బాలీవుడ్లో నాలుగు విభాగాల్లో తెరకెక్కిన ‘లస్ట్ స్టోరీస్’ కి కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. విక్కీ కౌశల్, కియారా అద్వానీ, మనీషా కోయిరాలా, భూమి ఫడ్నేకర్, సంజయ్ కపూర్, రాధికా ఆప్టే తదితరులు నటించిన ‘లస్ట్ స్టోరీస్’ తొలి భాగం గత ఏడాది జూన్ 15న ప్రారంభమై బాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. బాలీవుడ్ ‘లస్ట్ స్టోరీస్’ ని నిర్మించిన ఆర్ఎస్వీపీ ప్రొడక్షన్ హౌస్ తెలుగులోనూ నిర్మించనుంది. నాలుగు భాగాలుగా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌లో ఓ డైరెక్టర్‌గా సంకల్ప్ రెడ్డి ఫిక్సయ్యారు. మరో ముగ్గురు డైరెక్టర్స్ ఎవరన్నది ప్రకటించాల్సి ఉంది. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఎపిసోడ్ మార్చి 2020కి ముగుస్తుంది. ఈ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందే వేచి చూడాలి. -
సంకల్ప్.. ఈ సారి నేలమీదే, కానీ..!
రానా ప్రధాన పాత్రలో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమా ఘాజీ. తొలి అండర్‌వాటర్ వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఘాజీ తరువాత రెండో ప్రయత్నంగా మరో ప్రయోగం చేశాడు సంకల్ప్. వరుణ్ తేజ్ హీరోగా స్పేస్‌బ్యాక్ డ్రాప్లో అంతరిక్షం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సంకల్ప్ తన మూడో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తొలి సినిమాను సముద్రంలో, రెండో సినిమాను అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కించిన సంకల్ప్ మూడో సినిమాను మాత్రం నేల మీదే చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ సినిమాలో కూడా తన మార్క్ కనిపించేలా అంటార్కిటికా మంచులో జరిగే పరిశోదనల నేపథ్యంలో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
కొత్త ఏడాదిలో ప్రకటిస్తాడట..!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్ తిన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు తన నెక్ట్స్ మూవీ ఏ దర్శకుడితో అన్న విషయాన్ని కూడా ప్రకటించని బన్నీ న్యూ ఇయిర్ వేడుకల సందర్భంగా అభిమానులు తీపి కబురు చెప్పనున్నాడట.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుదన్న ప్రచారం గట్టిగానే జరిగింది. అయితే విక్రమ్, నానితో సినిమా ఎనౌన్స్ చేయటంతో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ప్రస్తతుం అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా దర్శకులంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు పరశురాం పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా అంతరిక్షం సక్సెస్ తరువాత సంకల్ప్ రెడ్డితో బన్నీ సినిమా అంటూ కొత్త ప్రచారం మొదలైంది. మరి ఈ దర్శకుల్లో బన్నీ ఎవరి ఫైనల్ చేస్తాడు..? కొత్త ఏడాది ఎలాంటి ప్రకటన చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అలా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది
‘‘పిల్లలతో పాటు పెద్దలను ‘అంతరిక్షం’ సినిమా మెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ సినిమా ఇది. దర్శకుడు సంకల్ప్ అద్భుతంగా రూపొందించారు’’ అని క్రిష్ అన్నారు. క్రిష్ సమర్పణలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితీరావ్ హైదరీ, లావణ్య ముఖ్య పాత్రలలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపీహెచ్’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిష్ మాట్లాడుతూ –‘‘అంతరిక్షం’ సరికొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ‘గమ్యం, కంచె’ తర్వాత మా బ్యానర్లో మరో గొప్ప చిత్రంగా నిలిచింది’’ అన్నారు. ‘‘ఓ వినూత్న ప్రయతాన్ని అందరూ ఆదరించడం ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. వాటినీ స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో అవి పునరావృత్తం కాకుండా చూసుకుంటాం’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘మరికొన్ని వైవిధ్యమైన ప్రయోగాలు చేయడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. మన బడ్జెట్లోనే కొత్త ఆలోచనలతో సినిమా తీయవచ్చని నిరూపించింది. కొన్ని లాజిక్కులు మిస్ అయ్యాయి అంటున్నారు. పూర్తి లాజిక్స్‌తో తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది’’ అన్నారు సంకల్ప్ రెడ్డి. ‘‘కొత్త ప్రయత్నంలో భాగం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాన’’న్నారు అదితీరావ్ హైదరీ. -
‘అంతరిక్షం’ మూవీ రివ్యూ
టైటిల్ : అంతరిక్షం జానర్ : సైన్స్‌ఫిక్షన్ స్పేస్ థ్రిల్లర్ తారాగణం : వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, రెహమాన్, శ్రీనివాస్ అవసరాల సంగీతం : ప్రశాంత్ విహారి దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి నిర్మాత : క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి రెండో ప్రయత్నంగా తొలి తెలుగు స్పేస్ మూవీ అంతరిక్షంను తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సంకల్ప్ మరోసారి మ్యాజిక్ చేస్తాడన్న నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకాన్ని సంకల్ప్ రెడ్డి నిలబెట్టుకున్నాడా..? వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడా..? కథ : దేవ్ (వరుణ్ తేజ్) ఓ స్పేస్ సైంటిస్ట్. రష్యాలో ట్రైన్ అయిన వ్యోమగామి. ఎన్నో ఆశలతో చంద్రుడి మీద నీటి జాడలు తెలుసుకునేందుకు విప్రయాన్ అనే శాటిలైట్‌ను ప్రయోగిస్తాడు. కానీ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి) కూడా ప్రమాదంలో చనిపోతుంది. దీంతో దేవ్ స్పేస్ రిసెర్చ్‌కు దూరమవుతాడు. కానీ ఐదేళ్ల తరువాత రిసెర్చ్ సెంటర్‌కు దేవ్ అవసరం పడుతుంది. మిహిరా శాటిలైట్ కక్షనుంచి పక్కకు తప్పుకొని మరో శాటిలైట్‌ను డికొట్టబోతుందని తెలుస్తోంది. మిహిరాను దేవ్ మాత్రమే కరెక్ట్ చేయగలడని అతన్ని పిలిపిస్తారు. రియా(అదితిరావ్ హైదరి), కరణ్ (సత్యదేవ్), సంజయ్ (రాజా)లతో కలిసి స్పేస్‌లోకి వెళ్లిన దేవ్. మిహిరాను ఎలా సరిచేశాడు.? స్పేస్‌లో దేవ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రతీ సినిమాతో నటుడిగాను ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో టెంపర్ కంట్రోల్ లేని సైంటిస్ట్‌గా, ప్రేమికుడిగా, స్పేస్‌లో సాహసాలు చేసే వ్యోమగామిగా అద్భుతంగా నటించాడు. దేవ్ పాత్రకు ప్రాణం పోశాడు. రియా పాత్రలో అదితిరావ్ హైదరి సూపర్బ్ అనిపించింది. లుక్స్ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు సాధించింది. లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో సత్యదేవ్, రాజా, రెహమాన్, అవసరాల శ్రీనివాస్ తమ పాత్రల పరిదిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఘాజీ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ మరోసారి అదే తరహా ప్రయోగం చేశాడు. అంతరిక్షం కోసం సంకల్ప్ తయారు చేసుకున్న కథనం దాదాపు ఘాజీలాగే సాగుతుంది. సినిమా ప్రారంభంలోనే మిహిరాకు సంబంధించిన డిటెయిల్స్ తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన దర్శకుడు తొలి భాగాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు. ఎక్కువ భాగం పాత్రల పరిచయంతో పాటు స్పేస్ మిషన్ అవసరం ఏంటి అన్న విషయాలను వివరించేందుకు కేటాయించాడు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరి కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. సెకండ్ హాఫ్ అంతా అంతరిక్షంలోనే నడుస్తూ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది. వ్యోమగామలు ఎలాంటి కోడ్స్ వాడతారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు లాంటి అంశాల్లో సంకల్ప్ చేసిన రిసెర్చ్ తెర మీద కనిపిస్తుంది. ద్వితియార్థంలో పెద్దగా కథ లేకపోయినా.. తన కథనంతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు దర్శకుడు. సినిమాకు మరో మేజర్ ప్లస్‌పాయింట్ సినిమాటోగ్రఫి. స్పేస్‌లో ఉండే పరిస్థితులను తెర మీద కళ్లకు కట్టినట్టుగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్. గ్రాఫిక్స్ అద్భుతమనే స్థాయిలో లేకపోయినా తమకున్న బడ్జెట్ పరిధిలో మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ప్రశాంత్ విహారి సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన మ్యూజిక్ సినిమాటోగ్రఫి సెకండ్ హాఫ్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
లైఫ్ ఈజీ అవ్వడానికి కారణం అదే
‘తొలిప్రేమ’ షూటింగ్ టైమ్‌లో సంకల్ప్ కలిశాడు. ‘అంతరిక్షం’ సినిమా లైన్ చెప్పక ముందే కొన్ని ఫొటోలు చూపించాడు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ నేపథ్యంలో సినిమా అనుకుంటున్నా అని స్టోరీ చెప్పాడు. కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్న నేను కథ వినగానే చాలా ఎగై్జట్ అయ్యాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ► ‘అంతరిక్షం’ పూర్తి కథ రెడీ చేయడానికి, స్క్రీన్‌ప్లేకి సంకల్ప్ టైమ్ తీసుకున్నాడు. బెంగళూరులోని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలను కలిసి వివరాలు సేకరించాడు. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు లోపల చిన్న భయం ఉండేది. తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. తప్పకుండా వారికి నచ్చు తుందనే నమ్మకంతో చేశా. ► ఇదొక వ్యోమగామి కథ. సినిమాలో కథ, ఎమోషన్స్ చాలా బాగున్నా దానికి అంతరిక్షం నేపథ్యం జోడించడం ఇందులో హైలైట్. సెకండ్ హాఫ్ మొత్తం స్పేస్ నేపథ్యంలోనే ఉంటుంది. వాస్తవ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని సంకల్ప్ హీరో పాత్ర సృష్టించాడు. ఇందులో దేవ్ అనే సైంటిస్ట్‌గా కనిపిస్తా. దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనే అతని కల ఎలా నెరవేరిందన్నదే కథ. ఈ పాత్ర చేయడానికి నాకెలాంటి రిఫరెన్స్‌లు లేవు. స్పేస్ నేపథ్యంలోని కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశా. తమిళ ‘టిక్ టిక్ టిక్’ సినిమా కూడా బాగుంది. ఆ సినిమా దర్శక, నిర్మాతల సూచనలు కూడా తీసుకున్నాం. ► వ్యోమగామి సూట్ వేసుకోవడానికే చాలా టైమ్ పట్టేది. సూట్, హెల్మెట్‌తో పాటు బ్యాక్ ప్యాక్ అన్నీ కలిపి దాదాపు 15 కిలోల బరువు ఉండేవి. ఆ సూట్ వేసుకున్నప్పుడు రెండు మూడు రోజులు ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది. ఇప్పటి వరకూ నేను చేయని సరికొత్త పాత్ర ఇది. నటుడిగా నాకు సవాల్‌గా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. ► జీరో గ్రావిటీ ఎఫెక్ట్ కోసం వ్యాక్యూమ్ రూమ్స్ రెంట్‌కి తీసుకుని షూటింగ్ చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమాల్లాగా ఒక సర్టెన్ హైట్‌కి వెళ్లి చిత్రీకరించుకోవచ్చు. అలా చేయాలంటే బడ్జెట్ 400 నుండి 500 కోట్లు అవుతుంది. మా సినిమా బడ్జెట్ దాదాపు 25 కోట్లు. మాకున్న బడ్జెట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్‌తో మంచి ఔట్పుట్ తెచ్చాం. షూటింగ్లో ఎక్కువ రోజులు తాడుతో గాల్లో వేలాడటం కోసం ముందుగానే ప్రాక్టీస్ చేశాం. ► తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ సినిమా ‘అంతరిక్షం’ కావడంతో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. పోస్టర్లు, ట్రైలర్ చూసి సినిమాకు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మా సినిమా వారికి మంచి విజువల్ వండర్లా అనిపిస్తుంది. అంతరిక్షం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అని బి,సి తరగతుల ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా మా సినిమా ఉంటుంది. ► ఈ సినిమాలో పరిస్థితులే విలన్. టీమ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే కథాంశం. మన లైఫ్ ఇంత ఈజీ అయిందంటే అది స్పేస్ రీసెర్చ్ వల్లే. నేను ప్రయోగాలు చేస్తున్నానని అనుకోవడం లేదు. రొటీన్ సినిమాల్లా కాకుండా సరికొత్త పాయింట్‌తో నా సినిమాలు ఉండాలనుకుంటా. ► సింపుల్‌గా సినిమా చేసేసి డబ్బులు సంపాదిద్దాం అనే ఆలోచన రాజీవ్రెడ్డిగారికి లేదు. వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఆలోచిస్తారు. క్రిష్‌గారు కూడా అంతే. ఇందులో లావణ్య త్రిపాఠి టీచర్‌గా కనిపిస్తుంది. సినిమాలో నా పాత్రకి, అదితి పాత్రకి మధ్య లవ్ యాంగిల్ ఏం ఉండదు. ‘ఎఫ్ 2’ సినిమాలో వెంకటేశ్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం వెరీ హ్యాపీ. వాళ్లు సింగిల్ టేక్‌లో సీన్ చేసేసేవారు. నేను ఒక్కోసారి రెండు మూడు టేక్‌లు తీసుకునేవాడిని. నా తర్వాతి సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఉంటుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్‌గారి తనయుడు అల్లు వెంకటేశ్ నిర్మిస్తారు. ఆ చిత్రం తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తా. హరీష్ శంకర్‌గారు ఓ సినిమా రీమేక్ గురించి చర్చించారు. ఇంకా ఫైనల్ కాలేదు. నా సినిమా కథలన్నీ నాన్నగారు (నాగబాబు) వినరు. చెల్లి నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమా కథ నాకు తెలుసు. ప్రణీత్ యంగ్ డైరెక్టర్. వారిని ప్రోత్సహిద్దామనే ఆ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా. -
అంతరిక్షానికి చిట్టిబాబు
స్టార్ హీరోలు తోటి హీరోల ఈవెంట్లలో పాల్గొనడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. పరిశ్రమలో హీరోల మధ్య, వారి అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉందనడానికి ఆడియో ఆవిష్కరణ వేడుకలు, ప్రీ రిలీజ్, సినిమా సక్సెస్మీట్లు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా తమ్ముడు వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్‌కు అన్న రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అంతరిక్షం 9000 kmph. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. డిసెంబర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
అంతరిక్షం 2 చేయాలనుంది
‘‘ఘాజీ రిలీజైన మూడు నెలల తర్వాత స్పేస్‌కు సంబంధించిన ఆర్టికల్ చదువుతుంటే ‘అంతరిక్షం’ చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆర్టికలేంటో చెబితే సినిమా కథ తెలిసిపోతుంది, ప్రస్తుతానికైతే చెప్పను (నవ్వుతూ). ‘గ్రావిటీ, ఇంటర్స్టెల్లార్’, తమిళంలో వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ లాంటి ఏ సినిమాకు మా చిత్రం సంబంధం లేదు. కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి అన్నారు. వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై క్రిష్, జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. యు సర్టిఫికెట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► వైజాగ్‌లో మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఎలా ‘ఘాజీ’ సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందో.. ఏదో స్పేస్ ఆర్టికల్ చదువుతుంటే ఈ సినిమా చేయాలనిపించింది. ఇప్పటి వరకూ వచ్చిన స్పేస్ సినిమాలతోపోలుస్తారని తెలుసు. కానీ వాటి నుంచి ఇన్స్పెర్ అవ్వలేదు. ► నా ఫస్ట్, సెకండ్ రెండు సినిమాలు ఏదో ఓ ఈవెంట్ రిలేటెడ్ ఐడియాలే ఉన్నాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా కొత్త ఐడియాలు రాకపోతే ఫార్ములా సినిమాలే తీస్తానేమో. ఇప్పుడే కాదు ఫ్యూచర్లో. ► ‘ఘాజీ’ చిత్రానికి నేషనల్ అవార్డ్ ఈ ఏడాది మే 1న వచ్చింది. తర్వాతి రోజే సినిమాను స్టార్ట్ చేశాం. 1500 సీజీ షార్ట్స్ ఉన్నాయి. అయినా కూడా 70 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. అందులో30 రోజులు జీరో గ్రావిటీ సీన్స్ చిత్రీకరించాం. సినిమా షూట్ చేయడానికి సమయం ఎక్కువ తీసుకోలేదు. ► సినిమాకు సంబంధించి బాగానే రీసెర్చ్ చేశాను. నెట్లోనే మనకు కావల్సిన కంటెంట్ ఉంది. యుట్యూబ్లోనూ చాలా మ్యాటర్ ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడాను. ► స్పేస్‌లో ఉన్నది ఉన్నటుగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. వీలైనంత ల్యాజిక్ ఉండేలా చూసుకున్నాం. ఒక్కసారి ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అయితే లాజిక్ పట్టించుకోడు. బోర్ కొట్టిస్తున్నాం అంటే లాజిక్స్ వెతికే పనిలో పడతారు. ► దేవ్ అనే పాత్రకు వరుణ్ తేజ్ అయితేనే బావుంటుంది అనిపించింది. కథేంటో అని క్లుప్తంగా చెప్పాను. తర్వాత నాలుగు నెలల్లో కథ పూర్తి చేశా. ► ఘాజీలో లవ్‌స్టోరీ ఉండదు. కానీ ఇందులో ప్రేమతో పాటు దేశభక్తి లవ్‌స్టోరీ అన్నీ ఉంటాయి. ► స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలో, ప్రీ–ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో క్రిష్‌గారు సహాయం చేశారు. నిర్మాతల సహకారం కూడా బావుంది. షూటింగ్లో నాకు పెద్ద చాలెంజ్‌లు ఎదురవ్వలేదు కానీ, యాక్టర్స్ మాత్రం చాలెంజెస్ ఫేస్ చేశారు. ‘రంగస్థలం’లో ఆర్ట్‌వర్క్ చూసి రామకృష్ణ, మోనికాలను ఎంపిక చేసుకున్నాను. ► బాలీవుడ్లో రెండు ఆఫర్స్ ఉన్నాయి. టిని పూర్తి చేయాలి. టాలీవుడ్‌కు టెంపరరీగా బ్రేక్ తీసుకుంటున్నాను. నిర్మాతలకు కథ కూడా చెప్పాను. అక్కడికి వెళ్తే 2 ఏళ్ల సమయం కేటాయించాలి. మరీ ఆలస్యం అయితే ఇక్కడే సినిమాలు చేస్తాను. ‘అంతరిక్షం 2’ కూడా చేయాలనుంది. -
‘అంతరిక్షం 9000 KMPH’ ట్రైలర్ లాంచ్
-
‘గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి’
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వ్యోమగామిగా నటిస్తున్నాడు. ‘అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది డిసెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మిరా అనే శాటిలైట్ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్ దేవ్ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. -
అంతరిక్షంలో ఏం జరిగింది?
‘ఫిదా, తొలిప్రేమ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఈ టీజర్‌లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. అంతరిక్షంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘అంతరిక్షం’లో పిల్లలతో మెగాహీరో
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో హిట్లు కొట్టాడు మెగాహీరో వరుణ్ తేజ్. తన మొదటి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన మొదటి సినిమాను సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తేజ్‌తో కలసి స్పేస్ కాన్సెప్ట్‌తో ‘అంతరిక్షం’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వరుణ్ ఫస్ట్‌లుక్, టైటిల్ ప్రకటించినప్పటినుంచీ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి, అదితీ రావు హైదరీ నటిస్తున్నారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రషూటింగ్కు సంబంధించిన ఫోటోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు. ఈ డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. Our @IAmVarunTej & @Itslavanya on the sets of #Antariksham9000Kmph #అంతరిక్షం9000kmph#AntarikshamOnDec21st pic.twitter.com/dU9Pnq6Fts — First Frame Entertainments (@FirstFrame_Ent) September 24, 2018 -
మునిగి తేలుతూ...
సాధారణంగా అంతరిక్షంలో తేలడం సహజం. కానీ వరుణ్ తేజ్ మాత్రం తేలడం బదులు మునిగిపోతున్నారు. కారణం ప్రేమ. ప్రస్తుతం అంతరిక్షంలో డ్యూయెట్స్ పాడుకుంటున్నారట వరుణ్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపిహెచ్’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో ఓ పాటను, కొన్ని సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సంకల్ప్. ఇందులో మూడు పాటలుంటాయని సమాచారం. అందులో ఒక పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా కంప్లీట్ అవుతుందని సమాచారం. దాంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. షూటింగ్‌తో పాటుగా ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. ఇందులో వరుణ్‌తేజ్, అదితీరావ్ హైదరీలు వ్యోమగామిగా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, కెమెరా: జ్ఞానశేఖర్ వీయస్. -
మెగా హీరో లేటెస్ట్ మూవీ టైటిల్ ఫిక్స్
తన అంతరిక్ష ప్రయాణాన్ని వెండితెరపై చూపించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మూవీ టైటిల్‌ను ‘అంతరిక్షం’ అని రివీల్ చేశారు. వరుణ్ తేజ్ అంతరిక్షంలో ఉన్న ఓ ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అంతరిక్షం’ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీలో అదితి రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు. ఈ డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. Christmas 2018 release... First look poster + title announcement of Telugu film #Antariksham9000KMPH... Stars Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi... Directed by Sankalp Reddy... 21 Dec 2018 release. pic.twitter.com/OwSuu5bcCr — taran adarsh (@taran_adarsh) 15 August 2018 -
రంగం సిద్ధం
తన అంతరిక్ష ప్రయాణాన్ని వెండితెరపై చూపించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు హీరో వరుణ్ తేజ్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీరావు హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15 ఉదయం 9.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయాగ్రాహకుడు. -
‘అంతరిక్ష ప్రయాణంలో తొలి ఘట్టం’
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఆగస్టు 15న ఓ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వనున్నారు. తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ లోగోనూ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Get Ready for AN ENTHRALLING SPACE ADVENTURE 🚀👨🚀🌌 🛰 Unveiling 'Title' & 'Release Date' On August 15th 🇮🇳 at 9:30 AM.@IAmVarunTej @aditiraohydari @Itslavanya @gnanashekarvs @FirstFrame_Ent #SankalpReddy @YRajeevReddy1 @DirKrish @prashanthvihari pic.twitter.com/EZp215JIei — First Frame Entertainments (@FirstFrame_Ent) 12 August 2018 -
ప్రేమ విహారాలు
ఇద్దరు భామలతో స్పేస్‌లో ప్రేమ విహారం చేస్తున్నారట వరుణ్ తేజ్. మరి ఆ ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడతారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్ష్యం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా కనిపించనున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గురువారం మొదలైన కొత్త షెడ్యూల్ ఈ నెల 14 వరకూ జరగనుంది. ప్రత్యేకంగా వేసిన స్పేస్ సెట్లో ఈ షూటింగ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్, అదితీ, లావణ్య ముగ్గురూ పాల్గొంటున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్ అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసి తనకు అప్పగించిన మిషన్ రిజల్ట్ తెలుసుకునే రోజును ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్ 21న వరుణ్, సంకల్ప్ రెడ్డి తమ స్పేస్ జర్నీలోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లనున్నారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ స్పేస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘తొలి తెలుగు స్పేస్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశాం. ఈ రెండు షెడ్యూల్స్‌లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో డూప్ లేకుండా వరుణ్ తేజ్ కొన్ని ఫైట్స్ చేశారు. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, డిసెంబర్ 21న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ‘అంతరిక్షం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి.