sarpanch
-
తెలంగాణ మాజీ సర్పంచ్ల ఆందోళన
-
మాజీ సర్పంచులు అరెస్ట్ .. అసలు కారణం ఇదే ?
-
ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులతో మహిళా VRO ఆత్మహత్యాయత్నం
-
ఇంగ్లిష్ స్పీచ్‌తో అదరగొట్టిన మహిళా సర్పంచ్..ఆశ్చర్యపోయిన ఐఏఎస్ ఆఫీసర్!
ఓ సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంగ్లీష్ స్పీచ్‌కి అందరూ ఫిదా అయ్యిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..రాజస్తాన్ బార్మర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి విచ్చేశారు. ఆ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్‌కి ఆంగ్లంలో స్వాగతం పలికింది. " ఈరోజులో తాను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్ స్వాగం పలుకుతారు. ఓ మహిళగా ఆమెను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా" అంటూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నీటి సంరక్షణపై కూడా ప్రసంగించింది. ఆ వేదికపై మహిళా సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. అంతేగాదు ఒక్కసారిగా ఆ వేదిక మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ సర్పంచ్ ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు. కాగా, 2015లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (UPSC) పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే అగ్రస్థానంలో నిలిచి కలెక్టర్‌గా అజ్మీర్ నుంచి కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే బార్మర్ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. बाड़मेर में IAS टीना डाबी @dabi_tina के सामने जब राजपूती पोशाक और घूँघट में जालीपा महिला सरपंच सोनू कँवर ने जब अपना उद्बोधन अंग्रेज़ी से शुरू किया तो उपस्थित सब लोग चौंक गए और टीना डाबी के चेहरे की मुस्कान बयां कर रही है l..जिला कलेक्टर खुद को ताली बजाने से नही रोक पाए pic.twitter.com/fLYuo0gqJo— Kailash Singh Sodha (@KailashSodha_94) September 14, 2024 (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
పెరిగిపోతున్న టీడీపీ అరాచకాలు.. గ్రామ సభలో వైఎస్సార్సీపీ సర్పంచ్ పై దాడి
-
టీడీపీ దాడిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆవేదన
-
పంద్రాగస్టుకు ఎర్రకోటపై నారీశక్తి ప్రదర్శన
ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈసారి ఎర్రకోటపై జరిగే వేడుకలలో నారీశక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కానుంది. వివిధ సమస్యల నుంచి తమ పంచాయతీలకు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రతినిధులు ఎర్రకోట నుంచి మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వనున్నారు.పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఎంపికచేసిన 150 మంది మహిళా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ అధ్యక్షురాళ్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షురాళ్లు తదితర మహిళా పంచాయతీ ప్రతినిధులు ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతోంది.ఇటీవల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళా పంచాయతీ ప్రతినిధులను ఆహ్వానించింది. వీరికి ఆగస్టు 14న న్యూఢిల్లీలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి ‘పంచాయతీరాజ్‌లో మహిళా నాయకత్వం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. -
పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్, షోపియాన్లలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ అజాజ్ అహ్మద్ షేక్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం షోపియాన్‌లోని హీర్పోరాలో చోటుచేసుకుంది. #WATCH | Anantnag, J&K: Terrorists fired upon and injured a lady Farha, resident of Jaipur and spouse of Tabrez at Yannar. Injured evacuated to hospital for treatment.(Video source: Local) https://t.co/7UUq9YXR8Y pic.twitter.com/im1NZ2hSEm— ANI (@ANI) May 18, 2024 జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజాజ్ అహ్మద్ షేక్ ఇటీవలే బీజేపీలో చేరారు. అతనిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటన అనంత్‌నాగ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి యన్నార్ ప్రాంతంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఫర్హా అనే మహిళ, ఆమె భర్త తబ్రేజ్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలు జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఈ రెండు ఉగ్రవాద దాడులపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో తన స్పందనను తెలిపారు. ‘ఈరోజు పహల్గామ్లో ఇద్దరు పర్యాటకులు గాయపడిన ఘటనను, షోపియాన్‌లోని హీర్పోరాలో సర్పంచ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.Terrorist fired upon a person Aijaz Ahmad at Heerpora, Shopian. Injured evacuated. Area cordoned off. Further details to follow: Kashmir Zone Police pic.twitter.com/Y31BJouz0J— ANI (@ANI) May 18, 2024 -
ఐరాసలో జగన్ విజన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్ ది ఎస్డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. -
ఐరాస సదస్సుకు ఏపీ సర్పంచ్
సాక్షి, అమరావతి: అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీన నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ (సీపీడీ) సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారికి దక్కింది. ‘భారత్‌లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐరాస నుంచి ఆహా్వనం అందింది. మే 1వ తేదీన ఆమె న్యూయార్క్‌కు బయలుదేరతారు. హేమకుమారి 2021 ఏప్రిల్‌లో పేకేరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజీలో 2014–19 మధ్య ఐదేళ్లపాటు ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్‌గా పనిచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేసింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమారితో పాటు తిప్రుర రాష్ట్రానికి చెందిన సెపాహిజాల జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్‌దత్తా, రాజస్థాన్‌లోని ఝుంజున్ జిల్లా లంబిఅహీర్ సర్పంచ్ నీరూ యాదవ్‌కు ఆహా్వనాలు అందాయి. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి భారత్ ప్యానల్ తరఫున మన రాష్ట్రంలోనూ, దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతారు. జగన్ పాలనలో అంతర్జాతీయ వేదికలపై అరుదైన గౌరవాలు ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నతస్థాయి అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి అనేక ఆరుదైన గౌరవాలు దక్కాయి. 6 నెలల క్రితం న్యూయార్క్ నగరంలోని యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే లారీ డ్రైవర్ కూతురు, సెక్యూరిటీ గార్డు కూతురు, కౌలు రైతు కొడుకు తదితర 10 మంది పేద విద్యార్థులకు అవకాశం దక్కింది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. మనబడి నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. బడిలో స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి సర్కారు బడి స్థాయిని కూడా ప్రైవేట్ అంతర్జాతీయ స్కూళ్ల స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు సైతం ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనే స్థాయికి ఎదిగారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
సర్పంచ్‌లకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్/ ఢిల్లీ, సాక్షి: తెలంగాణ సర్పంచ్‌లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేపటి నుంచి తమ స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టును స్టే కోరారు వాళ్లు. అయితే.. అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. తెలంగాణలో సర్పంచుల పదవీకాలం నేటితో ముగియనుంది. వాళ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను(శిక్షణతో సహా) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికలు జరిగేంత వరకు తమ పదవీకాలం పొడిగించాలని సర్పంచ్‌లు విజ్క్షప్తి చేయగా.. ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ ఎన్నికల నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే.. ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: డ్యూటీ ఎక్కకముందే స్పెషల్ ఆఫీసర్లకు వార్నింగులా? ఇక రేపటి నుంచి ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగతుండడంతో.. ఇవాళే అన్ని గ్రామ పంచాయితీలలో హడావిడి నెలకొంది. జనరల్ బాడీ సమావేశాలు పెట్టి.. హుటాహుటిన పెండింగ్ అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుకుంటున్నాయి ఆ గ్రామ పంచాయితీలు. ఇప్పటికే వాళ్ల వద్ద ఉన్న రికార్డులను, స్టాంప్స్ అండ్ లెటర్ ప్యాడ్స్ సరెండర్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో.. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ అధీనంలోకి గ్రామ పంచాయితీలు వెళ్లనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల లోపు అన్ని గ్రామ పంచాయితీలలో ఛార్జ్ తీసుకోనున్నారు ప్రత్యేక అధికారులు. ఇప్పటి వరకు సర్పంచ్ ఉపసర్పంచ్ లకు జాయింట్ గా చెక్ పవర్స్ ఉండగా.. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ - విలేజ్ సెక్రెటరీకి ఆ పవర్ బదిలీ అవుతుంది. ఇక.. ఎల్లుండి(ఫిబ్రవరి 2వ తేదీ) స్పెషల్ ఆఫీసర్స్ తో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తిరిగి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేంతవరకు పంచాయితీలన్నీ వీళ్ల పర్యవేక్షణలోనే పని చేస్తాయి. కిషన్‌రెడ్డి అభ్యంతరం ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించడం రాజ్యాంగానికి విరుద్ధమని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో స్పెషల్ ఆఫీసర్ల తో గ్రామ పంచాయితీల పాలన రాజ్యాంగానికి విరుద్ధం. ఎన్నికలు నిర్వహించలేకపోతే ఇప్పుడున్న సర్పంచులనే కొనసాగించాలి. గ్రామ పంచాయితీలు లేకుంటే గ్రామ సభలు ఎలా పెడతారు?. లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలనేవి తప్పనిసరి. ఎన్నికల లోపే గ్రామ సభల్లో లబ్ధి దారుల ఎంపిక పూర్తి చేసి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. -
నాడు సర్పంచ్.. నేడు న్యాయమూర్తి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కర్రి సంతోషలక్ష్మి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సంతోషలక్ష్మి ఇదివరకు సర్పంచ్‌గా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రం చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే న్యాయమూర్తి కావాలన్న ఆశయంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త దువ్వాడ వెంకటకుమార్ చౌదరి ప్రోత్సాహంతో ఆమె విజయం సాధించారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ హనుమంతు లజపతిరాయ్, రాజ్యలక్ష్మి, పీఎసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, సర్పంచ్ దువ్వాడ పద్మావతి, ఎంపీటీసీ బమ్మిడి రాజ్యలక్ష్మి, బి.మోహన్‌రావు, దువ్వాడ జయరాం చౌదరి తదితరులు అభినందనలు తెలియజేశారు. -
ఈ సర్పంచ్ వెరీ స్పెషల్
రాజకీయాన్ని సంపాదనకు మార్గం అనుకునే ప్రస్తుత రోజుల్లో ఓ సర్పంచ్ తీరు ఆదర్శంగా నిలిచింది. సరైన రోడ్డు సదుపాయం లేక గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన ఆమె తన సొంత నిధులతో వంతెన నిర్మించారు. నాతవరం మండలంలోని వైబీ అగ్రహారం ఊరగెడ్డపై సర్పంచ్ కోసూరి విజయ నిర్మించిన వంతెన గ్రామస్తుల వెతలను తొలగించింది. వారి మన్ననలు పొందేలా చేసింది. అనకాపల్లి: మండలంలోని వైబీ అగ్రహారం పంచాయతీకి దశాబ్దాలుగా సరైన రోడ్డు సదుపాయం లేదు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనే లేదు. ఈ పంచాయతీ మొదటి నుంచీ టీడీపీకి కంచుకోట. టీడీపీ మండల అధ్యక్షుడే ఈ గ్రామానికి 15 ఏళ్లుగా సర్పంచ్. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పంచాయతీని ఈసారి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆశీస్సులతో కోసూరి విజయ గెలిచారు. ఇంతటి నమ్మకాన్నిచ్చిన పంచాయతీ ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోయే మంచి పని చేయాలని సర్పంచ్ విజయ, ఆమె భర్త బుజ్జి నిర్ణయించుకున్నారు. 5 కి.మీ. దూరం తగ్గింది దీంతో గ్రామానికి అనుకుని ఉన్న ఊరగెడ్డపై వంతెన నిర్మిస్తే మండల కేంద్రానికి వెళ్లే దూరం 5 కి.మీ. తగ్గనుండటంతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ సొంత నిధులు రూ.3.40 లక్షలు వెచ్చించి వంతెనతోపాటు, అనుసంధాన రోడ్డును పూర్తి చేశారు. వంతెన అందుబాటులోకి రావడంతో మండల కేంద్రానికి వెళ్లే దూరం, సమయం తగ్గడంతోపాటు, ఈ ప్రాంతంలో సుమారుగా 500 ఎకరాల భూముల్లో రైతుల పండించే వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఇపుడు ఒకటిన్నర కి.మీ. ప్రయాణిస్తే పంట ఉత్పత్తుల్ని గమ్యస్థానానికి చేరవేయొచ్చు. మరోవైపు నాయుడుపాలెం, మన్యపురట్ల, లింగంపేట, మండల కేంద్రం నాతవరానికి దగ్గర దారి ఏర్పడింది. పెరిగిన భూముల ధరలు వంతెన నిర్మాణంతో చుట్టు పక్కల వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు మార్గం సుగమం కావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత భూముల ధరలు పెరిగిపోయాయి. నేరుగా పంట పొలాల్లోకి వాహనాలు పోయే మార్గం ఏర్పాటయింది. సర్పంచ్ తన సొంత నిధులతో నిర్మించిన వంతెనను ఆర్భాటాలకు తావులేకుండా వార్డు సభ్యులు, గ్రామపెద్దలతోనే ప్రారంభించి, రాకపోకలు సాగించడం గమనార్హం. దీనిపై సర్పంచ్ విజయ సాక్షితో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రచారం వద్దని, గ్రామస్తుల హృదయాల్లో తాము చేసిన మంచి నిలిచిపోతే చాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అఽందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
సర్పంచ్ల సతమతం..
నేలకొండపల్లి: పంచాయతీల్లో నిధుల్లేక పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చెత్త తరలించే ట్రాక్టర్లు ఇంధనం నింపడానికి డబ్బులేవు. గుప్పెడు బ్లీచింగ్ పౌడర్ చల్లలేని పరిస్థితి నెలకొంది. 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధా రణ నిధులను గత ప్రభుత్వం తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణకు ముందుగా నిధులు ఖర్చు చేసి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు మన ఊరు – మన బడి, పల్లె ప్రగతి పనులకు కూడా ప్రజాప్రతినిధులే ఖర్చుచేశారు. పనులు పూర్తయ్యాక అధికారులు పరిశీలించాల్సి ఉంది. బిల్లులు కార్యదర్శులు ఖజానాకు అప్లోడ్ చేసిన తరువాత కార్యదర్శి, సర్పంచ్‌లు సంయుక్తంగా సంతకం చేసి నిధులు తీసుకోవాల్సి ఉంటుంది. ఖజానాలో ఏడాదికి పైగా సరిపడా నిధుల్లేక సర్పంచ్‌లు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పంచాయతీల్లో చిన్న సమస్యల పరిష్కారానికి ఉపయోగించే సాధారణ నిధులు (జనరల్ ఫండ్) సైతం లేక సర్పంచ్‌లు ఏమీ చేయలేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 గ్రామ పంచాయతీల్లో చాలామంది సర్పంచ్‌లు రూ.లక్షలు అప్పు చేసి అభివృద్ధి పనులు చేశారు. కొన్ని చోట్ల చెక్కులు పంపించినప్పటికీ పాసింగ్ కాక నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.కోట్ల పెండింగ్ బిల్లుల వస్తాయా? లేదా అనే అనుమానంతో సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు పదవీ కాలం ముగిసే గడువు దగ్గరకు వచ్చింది. జవనరి 31తో వారి పదవీ కాలం అయిపోతుండటంతో చేసిన పనులకు బిల్లుల పరిస్థితి ఏమిటో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. పాలకవర్గాలు ఏర్పడిన తరువాత కరోనా వెంటాడి రెండేళ్ల పాటు ఏమీ చేయలేని పరిస్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. మిగతా సమయంలో అప్పటి పాలకులు పంచాయతీలను చిన్న చూపు చూశారని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఒక పక్క పాలకవర్గాల గడువు ముంచుకొస్తోంది. కేవలం 41 రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రతీ పంచాయతీ సర్పంచ్ అప్పులు చేసి అభివృద్ధి చేసిన వాటికి బిల్లులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఈలోగా బిల్లుల బకాయిలు చెల్లించకుంటే ఎన్నికల తరువాత కొత్త, పాత వారికి మధ్య భేదాభిప్రాయాలతో పల్లెల్లో మరో పంచాయితీ మొదలయ్యే అవకాశాలు ఉంటాయిని పలువురు చెబుతున్నారు. -
19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..
చిన్నతనంలో చెప్పలేనన్ని కష్టాలు ఫేస్ చేసింది ఆమె. నిత్యం మద్యం సేవించే తండ్రి, దారుణమైన పేదరికంతో పలుబాధలు పడింది. మూడో తరగతి నుంచి చదువు మానేయక తప్పని స్థితి. బాల్యంలోనే పెళ్లి చేస్తారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంది. తన జీవితం మారకపోతుందా అనే ఆశతో అలానే కాలం వెళ్లదీస్తూ ఉంది. అనుకున్నట్లే ఊహించని విధంగా ఎన్జీవో రూపంలో ఆమె జీవితం మారింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని తన గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై బాలికల విద్య కోసం అహర్నిశలు కృషి చేసింది. ఎందరో బాలికలను బడికి పంపేందుకు ఆమె కథే ప్రేరణగా నిలిచింది. ఆ సాధారణ మహిళ ఎలా ఇన్ని కష్టాలు దాటుకుని సర్పంచ్ స్థాయికి చేరుకుందంటే..? రాజస్థాన్‌లో పాలి జిల్లాలోని సక్దారా గ్రామానికి చెందిన ప్రవీణ అనే మహిళ కేవలం 19 ఏళ్లకే ఏడు గ్రామాలకు సర్పంచ్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకోసం అమె లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ప్రవీణ తండ్రి మద్యనికి బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు. తనకు నలుగురు తోబుట్టువులు. ఇంటిలోని పేదరికానికి మూడో తరగతి నుంచి బడి మానేయాల్సి వచ్చింది. కానీ ప్రవీణలో ఎలాగైనా చదువుకోవాలి, ఎప్పటికైన చదువుకోగలను అనే ఆశ బలంగా ఉండేది. కుటుంబం కోసం పశువులు మేపుతున్న తన ఆశను మాత్రం చంపుకోలేదు. అందుకోసమే ఎన్జీవో రూపంలో ప్రవీణ ఊరుకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేబీవీ) ప్రారంభమైంది. ఆ ఎన్జీవోలోని ఓ వ్యక్తి ఆ పాఠశాలలో ప్రవీణ ఉచితంగా చదువుకోవచ్చని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించడంతో ఆమె ఆశ నెరవేరింది. అక్కడే ఆమె తన విద్యాభాసాన్ని పూర్తి చేసింది. ప్రవీణ మైనర్‌గా ఉండగానే భవన నిర్మాణ కార్మికుడితో పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయినప్పటికీ తనలాగా చదవుకోవాలన్న కోరికతో ఉన్న బాలికలుగా తనవంతుగా సాయం చేస్తూనే ఉండేది. తనలా మరెవరూ చదువు కోసం పరితపించకూడదని అనుకుంది. అయితే ఆమె అత్తంటి వారి కుటుంబంలో ఆమె మాత్రమే ఉన్నత విద్యావంతురాలు. అదే ఆమెకు సర్పంచ్‌గా పోటీ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తానన్న హామీతో కనివినీ ఎరుగని మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచింది. ఆ చదువు వల్లే తాను సర్పంచ్‌గా పోటీ చేయగలిగాను. లేదంటే ఇంటి పనులు చేసుకుంటూ పశువులు మేపు కోవాల్సిందేనని చెబుతోంది ప్రవీణ. ఈ స్థాయికి చేరుకోవడంతో తన అత్తింటివారు కూడా తనను చూసి గర్వపడుతున్నారని అంటోంది. తన అత్తమామల కుటుంబంలో కూడా బాలికలను పాఠశాలలకు పంపిచడం అనేది లేదని కానీ తాను సర్పంచ్‌గా పోటీ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదని చెబుతోంది. తన అత్తింటివారు ఆర్థికంగా ఏమి అంత ఉన్నవాళ్లు కాకపోయిన తన ప్రయాణంలో మాత్రం ఆటంకం కలిగించనందుకు వారిని మెచ్చుకోవాలని సంతోషంగా చెప్పింది. అలాగే తాను చెప్పినట్లుగానే విద్యకు గరిష్ట బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపింది. అంతేగాక బాలికల కోసం పాఠశాల కూడా నిర్మించానని గర్వంగా చెప్పింది. అంతేగాక తాను గ్రామంలో పాఠశాలకు వెళ్లని బాలికలను వెదికి వారి తల్లిదండ్రలును ఒప్పించి మరీ పంపడం లేదా ఎన్జీవోలతో కలపడం వంటివి చేస్తానని చెబుతోంది. దీంతోపాటు బాలికలను పంపించలేని కుటుంబాలకు ఏమైన ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయో అనేది కనుక్కుని ఆ సాయం కూడా అందేలే చేస్తున్నట్లు వివరించింది. అలాగే తమ గ్రామాల్లోని ఉపాధ్యాయులు కూడా విద్య ప్రాముఖ్యత గూర్చి చెప్పమని తనను పాఠశాలకు ఆహ్వానిస్తుంటారని కూడా వెల్లడించింది. ఎందుకంటే తాను అలాంటి బాలికల్లో ఒక్కతిని కాబట్టి వారికి అర్థమయ్యేలా వివరించగలనన్న ఉద్దేశ్యం కాబోలు అంటోంది. ఆమె ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రచారం కోసం పనిసచేస్తోంది. ఆమె ఒక్కసారి ఆ ప్రచారఫౌండేషన్ దినోత్సవానికి హజరై ప్రసగిస్తుండగా.. అక్కడ చాలామంది అమ్మాయిలు ఫీల్డ్ వర్కర్లు తన కథను వారి తల్లిదండ్రులకు వివరించారని, ఆ తర్వాతే తమను కూడా స్కూల్‌కి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చినట్లు ప్రవీణకి తెలిపారు. అప్పుడే తెలిసింది తన కథకు ఇంతమంది స్ఫూర్తినిచ్చిందా అని ప్రవీణ ఆశ్చర్యపోయింది. ఇక ప్రవీణ 2014 నుండి 2019 వరకు రాజస్థాన్‌లోని ఏడు గ్రామాలకు సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ఏడాదితో ఆమె సర్పంచ్ పదవీ కాలం ముగియనుందని అయినప్పటికీ బాలికల చదువు కోసం తన పోరాటం మాత్రం ఆగదని సగర్వంగా చెప్పింది ప్రవీణ. (చదవండి: ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఐకాన్!ఏకంగా డిప్యూటీ మంత్రిగా..!) -
మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్,లక్షల ప్యాకేజిని వదిలి..
ఛావీ రాజావత్ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా ఊరు తనవైపు లాగింది.. మా తాత బ్రిగేడియర్ రఘుబీర్‌సింగ్ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్మెంట్ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. మహిళకు రిజర్వ్ అని.. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. వర్షపు నీటి సంరక్షణ ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు సేకరించి, ఖర్చు చేశాం. మహిళలు ముందు గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు చెప్పేదాన్ని. మహిళల బృందం డిజైనర్ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లప్రాధాన్యత నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది. అందరికీ బ్యాంకు ఖాతా.. సర్పంచ్ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్ వర్క్‌లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్‌గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను. ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్ లుక్‌లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్‌లో చెప్పాను. రెండుసార్లు సర్పంచ్‌గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్ లీడర్. -
ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్!
పెళ్లి అనగానే డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను విపరీతంగా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని. అంతే కాదు పల్లెల్లో వాటి వల్ల పేరుకున్న చెత్తతో ఎక్కడలేని మురికి. జబ్బులు. అందుకే ఉత్తరాదిలో చాలామంది మహిళా సర్పంచ్‌లు ‘బర్తన్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఊరికి ఇంతని స్టీలు పెళ్లి సామాను ఇచ్చి అందరూ వాటిని ఫ్రీగా వాడుకునేలా చేస్తున్నారు. ఇది దక్షిణాదికి అందుకోవాల్సి ఉంది. ఇండోర్‌లో మునిసిపల్ అధికారులు రెగ్యులర్‌గా కేటరింగ్ వాళ్లను, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్లను, రెస్టరెంట్లను సందర్శిస్తారు. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే మొహమాటం లేకుండా ఫైన్ వేస్తారు. ఈ ఫైన్ ఐదు వందలతో మొదలయ్యి 12 లక్షల వరకూ ఉంటుంది. హోటళ్ల వారికి వాళ్లు ఒకటే చెబుతారు– ‘మీరు రోజూ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల చేసే ఖర్చును స్టీలు వాడకం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు’ అని. ఇండోర్‌కు క్లీన్ సిటీగా పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టాలని అధికారుల తాపత్రయం. అంతే కాదు, వారు ఒక ‘బర్తన్ బ్యాంక్’ను కూడా ఏర్పాటు చేశారు. బర్తన్ అంటే గిన్నెలు. పెళ్లికి కావాల్సిన వంట, వడ్డన కోసం కావాల్సిన అన్ని పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు అన్నీ ఒక చోట పెడతారు. 24 గంటల ముందు చెప్పి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించుకున్నాక శుభ్రం చేసి తిరిగి చెల్లించాలి. ఏవైనా డ్యామేజీ అయినా పోయినా డబ్బు కట్టాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఈ బ్యాంక్‌కు పోటెత్తుతున్నారు. ఇదంతా ఎలా మొదలైంది? రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా తదితర రాష్ట్రాలలో కొత్తగా పదవుల్లోకి వచ్చిన మహిళా సర్పంచ్‌లు పల్లెల్లో చెత్తగా పేరుకు పోతున్న ప్లాస్టిక్‌ను చూసి ఇది మొదలెట్టారు. రాజస్థాన్‌లోని జున్జును అనే పల్లెకు నీరూ యాదవ్ అనే ఆవిడ సర్పంచ్ అయ్యాక ఈ సంవత్సరం మొదలులో ‘బర్తన్ బ్యాంక్’ మొదలెట్టింది. ఊరి పెద్దలను ధిక్కరించి నిధులను ఇలాంటి పనులకు ఉపయోగించడం మొదలెట్టిన నీరూ యాదవ్ ‘బర్తన్ బ్యాంక్’ వల్ల ఊరు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రాక్టికల్‌గా చూపించాక అందరూ ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అలా ఈ ఉద్యమం రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ‘ప్లాస్టిక్ వద్దు చెత్త వద్దు’ నినాదంతో మహిళా సర్పంచ్‌లు తమ గ్రామాల్లో బర్తన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామానికి 1000 స్టీలుప్లేట్లు, రెండు వేల కూర గిన్నెలు, రెండు వేల స్టీలు గ్లాసులు, 2 వేల స్పూన్లు, 50 మంచి నీటి జగ్గులు, ఐదారు వంట డేగిసాలు ఏర్పాటు చేస్తూ... గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ బ్యాంక్ నుంచి ఉచితంగా గిన్నెలు పొందే సదుపాయం కల్పిస్తున్నారు. . దీదీ బర్తన్బ్యాంక్ చత్తిస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా అంబికా పూర్లో స్వయంఉపాధి మహిళా బృందాలు తమ ఇళ్లల్లో శుభకార్యాల కోసం ‘దీదీ బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ మహిళల ఈ బ్యాంక్‌లో ఏర్పాటు చేసుకున్న పాత్రలను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే రాను రాను జిల్లా అంతా అందరు ప్రజలూ వాడుకునేలా ఈ ‘దీదీ బర్తన్ బ్యాంక్’లు విస్తరించాయి.‘ప్లాస్టిక్ చెత్త మురుగు నీటికి పెద్ద ప్రతిబంధకం. అది మట్టిలో కలవదు. దానిని రీసైకిల్ చేయడం కూడా వృథా. ఇలాంటి ప్లాస్టిక్‌కు స్టీలు వస్తువులతో విరుగుడు చెప్పాలి’ అంటారు ఈ మహిళలు. ఒడిస్సాలో ఒడిస్సాలో బర్తన్ బ్యాంక్ ఉద్యమం జోరు మీద ఉంది. నౌపాడ జిల్లాలో భలేస్వర్ అనే పంచాయితీ సర్పంచ్ అయిన సరోజ్ దేవి అగర్వాల్ ఊరి పెద్దలను ఎదిరించి మరీ పంచాయితీ నిధుల నుంచి 75 వేలు మంజూరు చేసి ‘బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసింది. ‘ప్రతి ఊళ్లో ఇలాంటి బ్యాంక్ ఉండాలి’అంటుందామె. అయితే ఈ బర్తన్ బ్యాంక్‌లు రెండు విధాలుగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కామన్‌గా పాత్రలను ఉంచేస్తే మరికొన్ని చోట్ల ఇంటికి ఇన్నని స్టీలు సామాన్లు ఇచ్చేస్తున్నారు. అంటే పెళ్లికి ఎవరికి పళ్లాలు వాళ్లు తెచ్చుకుని తిని తీసుకెళ్లిపోయేలా. ఇది కూడా బాగానే ఉందంటున్నారు కొందరు. ఏమైనా ఉత్తరాది సంప్రదాయం దక్షిణాదికి కూడా వ్యాపిస్తే బాగుండు. (చదవండి: ఎవరీ గుర్మిత్ కౌర్!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..? -
ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్ నవ్య
సాక్షి, జనగామ: జానకీపురం సర్పంచ్ నవ్య గుర్తున్నారా? స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపుల ఆరోపణలు.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌గా మారిపోయారామె. ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె ఇవాళ నామినేషన్ వేశారు. కుర్చపల్లి నవ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె.. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నవ్య సర్పంచ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేసి రాజయ్యపై తీవ్ర విమర్శలే చేశారామె. అయితే.. నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదన కూడా ఉంది. కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆ మధ్య మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సర్పంచ్ నవ్య.. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్ -
గ్రామంలో నివాసం ఉండగా నోటీసులిస్తారా?
మునగపాక : తాను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా సేవలందిస్తుంటే బీఎల్వో ప్రవీణ తాను గ్రామంలో లేనంటూ తనకు నోటీసు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మెలిపాక సర్పంచ్ అయినంపూడి విజయభాస్కరరాజు ప్రశ్నించారు. సర్పంచ్ స్థానికంగా నివాసం లేరంటూ బీఎల్వో బుధవారం నోటీసు ఇచ్చారు. దీనిపై విజయభాస్కరరాజు స్పందించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది తాను గ్రామంలో నివాసం లేనంటూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టకుండా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. బీఎల్వోలు తమకు వచ్చిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాల్సి ఉండగా కేవలం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా ప్రవర్తించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి మాటలు నమ్మి, తప్పుడు నోటీసులు అందించిన బీఎల్వోపై చర్యలు తీసుకోవాలని విజయభాస్కరరాజు డిమాండ్ చేశారు. -
సర్పంచ్ శ్రీనివాస్‌పై రౌడీషీట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్‌పై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. గత మార్చి 13వ తేదీనే రౌడీషీట్ ఓపెన్‌చేసినట్లు సోషల్‌మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. పురుమల్ల శ్రీనివాస్‌పై 24కుపైగా కేసులు నమోదు అయ్యాయి. ఫోర్జరీ, చీటింగ్, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, దురాక్రమణలు, భూ దందాల నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు సదరులేఖలో ఉంది. శ్రీనివాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి, కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లేఖ బయటకు రావడం చర్చనీయాంశమైంది. కాగా.. పోలీసులు ముందస్తు వ్యూహంతోనే ఆయనపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. గత సీపీ సత్యనారాయణ పదేపదే శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలతో పీడీయాక్టు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అతను అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడం, పై నుంచి ఒత్తిడితో వెనకడుకు వేసినట్లు తెలిసింది. ఇటీవల శ్రీనివాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే శ్రీనివాస్‌పై నమోదు చేసిన రౌడీషీట్‌ను పోలీసులు తెలివిగా బయటకు తీసినట్లు చర్చ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతనిపై కొన్నిరోజుల్లో పీడీయాక్టు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై సీపీ సుబ్బారాయుడును సంప్రదించగా శ్రీనివాస్‌పై మార్చిలోనే రౌడీషీట్ తెరిచినట్లు స్పష్టం చేశారు. -
‘బలగం’ మూవీ.. సర్పంచ్‌కు కన్నీటి వీడ్కోలు..!
కరీంనగర్: బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించిన కీసరి నర్సింగం అంత్యక్రియలు బుధవారం అభిమానుల కన్నీటి మధ్య పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం కొన్నేళ్లుగా నాటక ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించి అందరి ప్రశంసలు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందారు. నర్సింగంకు భార్య భూమవ్వ, కుమారుడు శ్రీనివాస్, కూతురు అంజలి ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, డీపీఆర్వో మామిండ్ల దశరథం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, సర్పంచ్ లావణ్య–శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రా వు, మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్, నాయకులు రాఘవరెడ్డి, పిట్టల భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా!
‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్‌గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది. మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం. సర్పంచ్ లేని ఊరు భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్ లేడు. ఎందుకంటే నక్సల్ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్‌గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి. నేనొచ్చాను భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్వాడి టీచర్. తండ్రి ప్రభుత్వ టీచర్. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్‌లో బి.ఏ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మంచి వాలీబాల్ ప్లేయర్‌ని నేను. టీచింగ్ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ. బైక్ మీద తిరుగుతూ... ప్రతి ఉదయం టీ తాగి బైక్ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్ అడ్డుపడరు’ అంది. ‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. -
ఉప ఎన్నికల్లోనూ సగానికిపైగా ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు.. రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం. -
దొంగనుకుని సర్పంచ్‌కు దేహశుద్ధి
సాక్షి, వరంగల్: దొంగగా భావించిన గ్రామస్తులు సర్పంచ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లిలో శుక్రవారంరాత్రి చోటుచేసుకుంది. మామిండ్లవీరయ్యపల్లిలో పెంతల సాంబరెడ్డి, యార రవి మధ్య ఇంటిస్థలం విషయమై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. దీనిపై గ్రామపెద్దల సమక్షంలో శుక్రవారం పంచాయితీ పెట్టారు. అనంతరం రాత్రిపూట ఇరువర్గాల పెద్దమనుషులు వేర్వేరుగా దావత్ చేసుకున్నారు. సర్పంచ్ అమరేందర్‌తోపాటు పలువురు మాటుకాసి సాంబరెడ్డి పెద్దమనుషుల దావత్ దృశ్యాలను మొబైల్లో రికార్డు చేస్తుండగా పలువురు గమనించారు. ‘దొంగ, దొంగా’అని అరుస్తూ సర్పంచ్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీసులకు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.