-
నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి..దంపతుల ఆత్మహత్య
బౌద్ధనగర్: ‘మేము చావడానికి కారణం ఆ నలుగు రే. వారిని విడిచిపెట్టకండి’అని సూసైడ్ నోట్ రాసి నాలుగేళ్ల కూతురుతో సహా దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా లక్ష్మీపురానికి చెందిన కొప్పుల సాయికృష్ణ (37), చిత్రకళ(30) దంపతులు. వీరికి తేజస్వి అనే నాలుగేళ్ల పాప ఉంది. ఏడాది నుంచి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివసిస్తున్నారు. సాయికృష్ణ గతంలో ర్యాపిడో బైక్ నడిపేవాడు. ఏడాదిగా ఉద్యోగానికి వెళ్లడం లేదు. భార్య చిత్రకళ నాంపల్లి బిర్లా సైన్స్ సెంటర్లోని టికెట్ కౌంటర్లో ఉద్యో గం చేస్తుండేది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్, పే స్లిప్ అడిగిన నేపథ్యంలో నెలక్రితం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. భర్తకు పని లేకపోవడం, తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేని చిత్రకళ తీవ్ర మనోవేదనకు గురైంది. లేనిపోని కారణాలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించిన నలుగురు ఉద్యోగులు శ్యాం కొటారి, గాతా, హరిబాబు, సంతోష్ రెడ్డిలను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్లో రాసి ఆ నోట్‌ను గోడకు అతికించింది. ముందుగా కూతురుకి ఉరేసి.. ఆ తర్వాత భార్య, భర్త కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి వారున్న ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పక్కింటి వాళ్లు తలుపులు కొట్టారు. అయినా తీయలేదు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తలుపులు బద్దలుగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులై కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. మృతిపై అనుమానాలు: బిర్లా సైన్స్ సెంటర్లో పలు అవకతవకలు జరిగాయని, వాటి గురించి తనకు తెలియడం వల్లనే శ్యామ్ కొఠారి, గీతారావు, హరిబాబు, సంతోష్ రెడ్డిలు కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారని సూసైడ్ నోట్లో పేర్కొంది. తాను పని చేసిన కార్యాలయంలో రూ.కోట్లలో మోసం జరిగిందని పేర్కొంటూ 12 పాయింట్లతో సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించింది. ‘‘ఓ మంత్రితో మాట్లాడేందుకు యత్నించినా కుదరలేదు. ఓ టీవీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా స్పందించ లేదు.’’ అని అందులో పేర్కొంది. అయితే ఆఫీసులో జరిగిన దానికి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఈ వారం హిట్స్
సూయిసైడల్ స్క్వాడ్ : ట్రైలర్ నిడివి : 2 ని. 31 సె. హిట్స్ : 2,26,64,135 నాలుగు రోజుల్లో రెండు కోట్లు! పెద్ద హిట్టే. నో డౌట్.. సినిమా కూడా హిట్ అయినట్లేనని హాలీవుడ్ క్రిటిక్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న టూడీలో, త్రీ డీలో, ఐమాక్స్ త్రీడీలో విడుదల కాబోతున్న అమెరికన్ సూపర్‌హీరో ఫిల్మ్ ‘సూయిసైడల్ స్క్వాడ్’ ట్రైలర్ ఇది. కథ, దర్శకత్వం డేవిడ్ ఏయర్. డిసి కామిక్స్ ఆధారంగా ఆయన కథ అల్లుకున్నారు. కథేమిటో పూర్తిగా బయటికి రాలేదు కానీ, ప్రభుత్వ సీక్రెట్ ఏజెన్సీ ఒకటి కొంతమంది సూపర్ విలన్లతో ‘సూయిసైడ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి వారి ద్వారా అత్యంత ప్రమాదకరమైన పనులను చేయిస్తుంటుంది ఒక గాసిప్. వార్నర్ బ్రదర్స్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నారు. సెలెనా గోమెజ్ : హ్యాండ్స్ టు మైసెల్ఫ్ నిడివి : 3 ని. 47 సె. హిట్స్ : 60,85,799 అమెరికన్ సింగర్ సెలెనా గోమెజ్ రెండో స్డూడియో ఆల్బమ్ ‘రివైవల్’లోని మూడో పాట ‘హ్యాండ్స్ టు మైసెల్ఫ్’ యూట్యూబ్‌లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. అప్లోడ్ అయిన మూడు రోజుల్లోనే హిట్స్ అరవై లక్షలు దాటాయి. అప్‌బీట్‌లో సాగే ఈ డాన్స్, సింథ్పాప్.. సంగీత ప్రియులనే కాకుండా, విమర్శకులనూ ఆకట్టుకుంటోంది. ‘కాంట్ కీప్ మై హ్యాండ్స్ టు మైసెల్ఫ్.. నో మేటర్ హౌ హార్డ్ అయామ్ ట్రయింగ్..’ అంటూ పాట మొదలౌతుంది. పాప్ రూపంలోని మార్ధవ గీతం ఇది. సెలైంట్‌గా మనసును కొల్లగొడుతుంది.. సెలెనా రూపంలాగే! ది ఎమోజీ ఛాలెంజ్ నిడివి : 4 ని. 30 సె. హిట్స్ : 22,77,801 ఇదొక గెస్ గేమ్. ఆడే ఆట కాదు. చూసే ఆట. ప్యూడైపీ అనే స్వీడన్ కమెడియన్ (అసలు పేరు ఫెలిక్స్ అర్విద్ జెల్బర్గ్) తన స్నేహితురాలితో కలిసి ఆడిన ఈమోజీ ప్లే. కొన్ని ఎమోజీలను పక్కపక్కన పెట్టి వాటి అర్థాన్ని ఊహించడం ఇందులోని ఆసక్తికరమైన అంశం. కాస్త కష్టంగా, కాస్త సరదాగా, కొంచెం బ్రెయిన్ టీజర్‌గా, కొంచెం చిలిపిగా ఈ ఆట సాగిపోతుంది. 26 ఏళ్ల ప్యూడైపీ ‘లెటజ్ ప్లే’ పేరుతో యూట్యూబ్‌లో ఇలాంటి గేమ్స్ ఇంకా అనేకం అప్లోడ్ చేశాడు. తెరె బిన్ లాడెన్ : డెడ్ ఆర్ అలైవ్ (ట్రైలర్) నిడివి : 2 ని. 38 సె. హిట్స్ : 15,09,907 నిజ జీవితంలో బిన్ లాడెన్‌ది సీరియస్ క్యారెక్టర్. ‘తెరె బిన్ లాడెన్-డెడ్ ఆర్ ఎలైవ్’ చిత్రంలో మాత్రం అతడిది హ్యూమరస్ క్యారెక్టర్. ఈ ట్రైలర్ చూస్తే కామెడీ ఎంత టెరిఫిక్‌గా ఉంటుందో తెలుస్తుంది! 2010లో వచ్చిన ‘తెరె బిన్ లాడెన్’కి ఈ మూవీ సీక్వెల్. చాలా వరకు అవే పాత్రలు ఉంటాయి. కానీ స్క్రీన్‌ప్లే పాత వాసనలు కనిపించవు. ఒసామా బిన్ లాడన్ని చంపేశామని అమెరికా చెబుతుంటే, కాదు అతడు బతికే ఉన్నాడు అనే వాదన ఒకటి మొదలౌతుంది. ఇంతకీ లాడెన్ బతికే ఉన్నాడా? చనిపోయాడా అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. దర్శకత్వం అభిషేక్ శర్మ. చిత్రం విడుదల ఫిబ్రవరి 19.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement