పాకిస్తాన్ అణుబాంబులకు భయపడుతున్నారు
విపక్ష నేతలకు రాత్రిపూట పీడకలలు వస్తున్నాయి: మోదీ
ముజఫర్‌పూర్/హాజీపూర్/సరణ్: పిరికిపందలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ అణుబాంబులకు భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ సహా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు పాకిస్తాన్ అణుశక్తిని తలచుకొని చూసి బెంబేలెత్తిపోతున్నానని, వారికి రాత్రిపూట పీడకలలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
సోమవారం బిహార్‌లోని ముజఫర్‌పూర్, హాజీపూర్, సరణ్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. పిరికిపందలు, భయస్థులైన మన ప్రతిపక్ష నాయకులు ఉగ్రవాదంపై పాకిస్తాన్‌కు క్లీన్‌చిట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పాకపాకిస్తాన్ భూభాగంపై మన సైన్యం చేసిన సర్జికల్ దాడుల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, సైనికుల సాహసాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. అణ్వా యుధాలను వదిలించుకోవాలంటూ వామపక్ష నాయకులు ఇస్తున్న పిలుపును ప్రధానమంత్రి తప్పుపపట్టారు. బహిరంగ సభల్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
గాజులు కూడా లేవా!
‘‘పాకిస్తాన్ గాజులు తొడుక్కొని లేదని మన విపక్ష నాయకులు అంటున్నారు. అయితే, ఆ దేశం గాజులు తొడుక్కునేలా చేస్తాం. కడుపు నింపుకోవడానికి పాకిస్తాన్‌కు తిండి లేదని, ఆహారా ధాన్యాలు లేవని నాకు తెలుసు. పాకిస్తాన్‌కు విద్యుత్ సైతం లేదు. గాజులు కూడా లేవన్న సంగతి ఇప్పుడు తెలిసింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికో ప్రధానమంత్రి మారుతారట! ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులు అనే ఫార్ములాను తీసుకొస్తున్నారు. నిజంగా అలా సంవత్సరానికో ప్రధానమంత్రి మారిపోతే దేశం ముందుకెళ్లడం సాధ్యమేనా? అలాంటి విధానం మనకు సరిపడదు.
ప్రపంచదేశాల్లో మన ప్రతిష్ట పెరిగింది. అభివృద్ధి వేగవంతమైంది. మన దేశ ప్రతిష్టను ఇంకా పెంచడంతోపాటు ప్రగతిని కొనసాగించే ప్రభుత్వం కావాలి. అది బీజేపీ కూటమితోనే సాధ్యమవుతుంది. రాజకీయ నాయకుల నివాసాలు, కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు చేసి, స్వా«దీనం చేసుకున్న డబ్బంతా ముమ్మాటికీ పేదలకే చెందుతుంది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల కార్యాచరణపై ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. వారి అవినీతి, అక్రమ సొమ్మును స్వా«దీనం చేసుకోవడమే ఇందుకు కారణం.
గతంలో కాంగ్రెస్ పాలనలో ఈడీ కేవలం రూ.35 లక్షలు స్వా«దీనం చేసుకుంది. ఒక స్కూల్‌బ్యాగ్‌లో ఆ డబ్బును సర్దొచ్చు. మేము అధికారంలోకి వచ్చాక ఈడీ రూ.2,200 కోట్లు స్వా«దీనం చేసుకుంది. ఆ డబ్బును తరలించాలంటే 70 చిన్నపాటి ట్రక్కులు కావాలి. ప్రతిపక్ష నేతలకు వారసులు ఉన్నారు. ఆ వారసుల బాగు కోసమే వారు తపన పడుతుంటారు. నాకు వారసులు లేరు. సామాన్య ప్రజలే నా వారసులు. కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి, ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తున్నాయి. నేను బతికి ఉన్నంతకాలం ఇలాంటి ఆటలు సాగనివ్వను’’. అని మోదీ వివరించారు.
పట్నా గురుద్వారాలో భక్తుల సేవలో మోదీ
ప్రధాని మోదీ సోమవారం బిహార్ రాజధాని పటా్నలోని తఖ్త్ శ్రీహరిమందిర్‌జీ పట్నా సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. సంప్రదాయ తలపాగా ధరించి, దర్బార్ సాహిబ్‌లో సిక్కుల పవిత్ర గ్రంథం ఎదుట ప్రణమిల్లారు. ప్రార్థనలు చేశారు. అనంతరం వంటశాలలో గరిటె తిప్పారు. కూర వండారు. రొట్టెలు కాల్చారు. లంగర్‌లో భక్తులకు స్వయంగా ఆహారం వడ్డించారు. పట్నా సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడం, ఇక్కడ ప్రార్థనలు చేయడం గొప్ప ఆధ్యాతి్మక అనుభూతినిచ్చాయని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సిక్కు గురువుల బోధనలు మనకి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, మనల్ని ముందుకు నడిపిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment