సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ) : నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా దక్షిణాదిన ఈ ఏడాది మే, జూన్ నెలల్లో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసి దక్షిణ ప్రాంతీయ గ్రిడ్ సామర్థ్యాన్ని నిరూపించామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో విద్యుత్ రంగ అభివృద్ధి నిమిత్తం శుక్రవారం విశాఖపట్నంలో మొదలైన సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) 47వ సమావేశం శనివారం ముగిసింది.
ప్రాంతీయ కమిటీకి చైర్మన్‌గా ఉన్న విజయానంద్ అధ్యక్షతన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌పీసీతో పాటు 45వ టెక్నికల్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీసీసీ) సమావేశం కూడా జరిగింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులకు రాష్ట్ర విద్యు త్ సంస్థలైన ట్రాన్స్‌కో, డిస్కంలు ఆతిథ్యం ఇచ్చా యి.
ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ప్రభు త్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని.. దీనికి ఖర్చుచేసే మొత్తాన్ని రైతుల ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు బదిలీ చేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం అమలుచేస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ. పృథి్వతేజ్ ప్రతినిధులకు వివరించారు.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ..
ఇక దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ రంగ సంస్థలు, వాటి నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాలు, సమస్యలు, వాటి పరిష్కారం కోసం పరస్పరం సహకరించుకోవడం, అందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.. దక్షిణ గ్రిడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎస్‌ఆర్‌పీసీ, ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ సంస్థల నుంచి అవసరమైన సలహాలు పొందడం వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు చర్చించారు.
అలాగే, అంతర్రాష్ట్ర విద్యుత్ రవాణా చేసే ఇంట్రా స్టేట్ లైన్‌లకు సెంట్రల్ పూల్ నుంచి ట్రాన్స్‌మిషన్ చార్జీలను పొందేందుకు గతేడాది డిసెంబర్ 6న ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని కమిటీ తీర్మానించింది.
Comments
Please login to add a commentAdd a comment