రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు! | Sakshi
Sakshi News home page

AI: రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ ట్రాఫిక్ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు!

Published Sun, Oct 15 2023 4:42 PM

AI Traffic Camera Clicks Romantic Couple Photo - Sakshi

ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని ఉపయోగించుకుంటూ మనుషులు తమ పనిని మరింత సులభతరం చేసుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ ఫోటోలను గమనించి చలానాలు విధిస్తున్నారు. ఇటీవల ఒక AI ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఏఐ కెమెరా తీసిన ఫోటోలో ఓ క్యూట్ రొమాంటిక్ జంటను చూడవచ్చు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైరిజల్యూషన్ కెమెరా రాత్రి సమయంలో కూడా అద్భుతంగా వైట్ అండ్ బ్లాక్ ఫోటో తీసింది. ఇందులో బైక్ రైడర్ హెల్మెట్ ధరించాడు, వెనుక ఉన్న అమ్మాయి హెల్మెట్ ధరించలేదు. ఈ కారణంగా వారికి జరిమానా విధించారు.

ఈ ఫోటోలు అమ్మాయి నవ్వుతుండటం చూడవచ్చు. వండి భ్రాంతన్‌మార్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. డబ్బులిచ్చి పెట్టుకునే పెయిడ్ ఫోటోగ్రాఫర్లు కూడా ఇంతమంచి ఫోటో తీయలేరేమో? అయితే ఇది కలర్ ఫోటో అయితే ఇంకా బాగుండేదని వెల్లడించాడు. అయితే జరిమానా అందుకున్న వ్యక్తి ఇలాగే భావించాడా? లేదా అనే తెలియాలి.

ఇదీ చదవండి: యూజ్‌లెస్‌ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్‌ అయ్యాను..

ఏఐ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేరళలో ప్రమాదాలలలో మరణించే వారి సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన సంఖ్య కూడా బాగా తగ్గింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 500, టూ వీలర్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తే  రూ. 1,000. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే రూ. 2000 జరిమానా విధించబడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement