హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరం కీలకమైన అమెరికా మార్కెట్లో దాదా పు 30 కొత్త ఔషధాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధి ఉన్నా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రెండంకెల స్థాయిలో సాధించగలమని ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. ప్రస్తుతానికి ధరలపరమైన ఒత్తిళ్ల కారణంగా ఆదాయ వృద్ధి కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చని పేర్కొన్నారు.
అటు చైనా మార్కె ట్లో తాము ఏటా రెండంకెల స్థాయిలో ఫైలింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో 40,50 ఫైలింగ్స్ ఉండొచ్చని వివరించారు. సాధారణంగా ఉత్పత్తులకు అనుమతి లభించాలంటే .. దరఖాస్తు చేసుకున్న తర్వాత 18–24 నెలలు వరకు సమయం పడుతుందని ఇజ్రేలీ తెలిపారు. గతేడాది నాలుగు ఉత్పత్తులకు అనుమతి లభించిందని, ఈ ఏడాది కూడా దాదాపు అదే స్థాయిలో లేదా అంతకు మించి ఉండొచ్చని ఆశిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తున్నామని.. వచ్చే, ఆపై ఆర్థిక సంవత్సరాల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment