Larsen & Toubro hires more than 3,000 engineering trainees in FY23 - Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: ప్రముఖ కంపెనీలో భారీగా ఉద్యోగాలు!

Published Tue, Nov 22 2022 7:10 AM

Good News: Larsen And Toubro Hires More Than 3000 Engineering Trainees - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్‌ ట్రెయినీలను తీసుకున్నట్లు ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్‌ చేసుకున్న 1,067 మందితో పోలిస్తే ఈసారి ట్రెయినీల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. మహిళా ఇంజినీర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగి 248 నుండి 1,009కి చేరినట్లు ఎల్‌అండ్‌టీ తెలిపింది. మొ­త్తం సిబ్బందిలో ప్రస్తుతం మహిళా ఉద్యోగుల వాటా 7.6 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 

చదవండి: ఊహించని షాక్‌.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్‌ డిమాండ్‌, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు!

Advertisement
 
Advertisement
 
Advertisement