గూగుల్ తన యూజర్లకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అర్జెంట్‌గా గూగుల్ క్రోమ్‌ను ప్లేస్టోర్‌లో అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్ -94 అప్‌డేట్ గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హఠాత్తుగా బుధవారం ఈ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయి, ఐవోఎస్, విండోస్‌తో పాటు మాక్‌ఓస్ వెర్షన్‌లను సైతం కొత్త ఫీచర్స్‌తో ఒకేసారి అప్‌డేట్ అందించింది.
ప్రైవసీ, కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తూనే క్రోమ్-94.. బగ్స్‌ను(దాదాపు 32) సైతం ఫిక్స్ చేసేసింది గూగుల్. ఇక 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త వెర్షన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్‌లను వెబ్‌సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. హాట్‌న్యూస్: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..!
మరో విశేషం ఏంటంటే.. ఇది HTTPS-First modeకి సంబంధించిన వెర్షన్. అంటే.. సురక్షితంకానీ వెబ్‌సైట్లను ఓపెన్ చేసినప్పుడు ఫుల్ పేజీ అలర్ట్‌ను చూపించే వెర్షన్‌గా లేటెస్ట్ అప్‌డేట్ ఘనత సాధించింది. తద్వారా యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ ప్రకటించుకుంది. వెబ్‌సైట్ ఆరంభంలో ఉండే హెచ్‌టీటీపీఎస్ అనే లెటర్ష్.. సంబంధిత వెబ్‌సైట్ అసలా? నకిలీనా? అనే విషయం తెలియజేస్తుందని తెలుసు కదా!.
ఒక్కోసారి సురక్షితంకానీ వెబ్‌సైట్లను సైతం ఓపెన్ కావడానికి క్రోమ్ అనుమతిస్తుంది. అలాంటప్పుడు గతంలో గూగుల్ అలర్ట్ ఏదో నామమాత్రంగానే.. చిన్నగా వచ్చేది. కానీ, ఒక్కోసారి అది గమనించకుండా యూజర్లు ముందుకెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు కొత్త అప్‌డేట్ ద్వారా ఫుల్‌పేజీ అలర్ట్ ఇస్తారు. తద్వారా యూజర్ మరింత జాగ్రత్త పడొచ్చు. అలాంటి సైట్ల నుంచి వెనక్కి వచ్చేయొచ్చు.
ఓవైపు సేఫ్ బ్రౌజింగ్. మరోవైపు వెబ్‌కోడెక్స్ ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లకు అందించనుంది క్రోమ్ 94. అంటే.. మానిటర్, ఇతర స్క్రీన్‌ల మీద వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్‌వేర్ డీకొడింగ్‌ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
చదవండి: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే!
ఇదీ చదవండి: ఫోన్ స్టోరేజ్ నిండిందా? డోంట్ వర్రీ.. వీటిలో ట్రై చేయండి
Comments
Please login to add a commentAdd a comment