-
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
షాకిచ్చిన గూగుల్..నౌకరి.కామ్ యాప్ మాయం!
భారత్‌లోని ప్రముఖ లార్జెస్ట్ వెబ్సైట్ నౌకరి.కామ్ యాప్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గూగుల్, భారత్‌లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్‌లోని కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్ ప్లే స్టోర్‌ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్ నుంచి సంబంధిత సంస్థల యాప్స్‌లను తొలగిస్తామని ప్రకటించారు. నిబంధనల్ని పాటించాం.. ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్‌కు చెందిన 99 ఎకర్స్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు. భారత్‌లో 10 యాప్స్ తొలగింపు తాజాగా ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించడంపై సంజీవ్ బిక్చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరి, 99 ఎకర్స్తో కలిపి మొత్తం 10 యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. -
2500 యాప్స్ తొలగించిన గూగుల్ - నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
చాలీ చాలని జీతాలతో పనిచేసే చాలామంది ఉద్యోగులు అత్యవసర సమయంలో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడం.. లేకుంటే కొన్ని యాప్స్ నుంచి ఇన్స్టంట్ లోన్స్ తీసుకోవడం ఎక్కువైపోతోంది. బ్యాంకుల్లో లోన్ తీసుకునే వారి విషయం పక్కన పెడితే.. యాప్స్ ద్వారా లోన్స్ తీసుకున్న వారు ఏకంగా ప్రాణాలే తీసుకున్న సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, తాజాగా దీని గురించి కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' లోక్‌సభలో మాట్లాడారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్‌లను తొలగించినట్లు డిసెంబర్ 18న లోక్‌సభలో వెల్లడైన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్‌ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి వెల్లడించారు. ఫేక్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వాటిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జనం కూడా ఫ్రాడ్ లోన్ యాప్‌ల గురించి అవగాహన పెంచుకోవాలని, అలాంటప్పుడే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: 2024లో బంగారం డిమాండ్ మరింత పైపైకి - కారణం ఇదే అంటున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, భారత ప్రభుత్వ చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) గూగుల్‌తో భాగస్వామ్యం చేసింది. ఈ యాప్‌లన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వ నియమాలను లోబడి పనిచేయాల్సి ఉంటుంది. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్‌లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్‌లో 18 లోన్ యాప్‌లను స్పైలోన్ యాప్‌లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్‌వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్‌లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్‌ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్‌లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
- ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
Advertisement