కోటీశ్వరులు కావాలనుందా..? | Sakshi
Sakshi News home page

కోటీశ్వరులు కావాలనుందా..?

Published Thu, Dec 28 2023 8:45 PM

One Crore Corpus With Minimal Amount And Time - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్‌లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్‌ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం.

భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్‌ సృష్టించవచ్చు.

మ్యూచువల్‌ఫండ్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్‌ జనరేట్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట.

ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?

ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement