ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాపై మరోసారి విరుచుకుపడింది. ఆదివారం క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు వెల్లడించారు. గాజాలో హమాస్ మిలిటెంట్లపై యుద్ధం మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన మరుసటి రోజే సైన్యం దాడులు ఉధృతం చేయడం గమనార్హం.
ఆదివారం ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంపై క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. 55,000 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా పశి్చమాసియాలో మాత్రం ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాదులు పశ్చిమ దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఎర్ర సముద్రంలో భారీ కంటైనర్ షిప్‌ను ధ్వంసం చేయడానికి హౌతీ ముష్కరులు ప్రయోగించిన రెండు యాంటీ–షిప్ బాలిస్టిక్ క్షిపణులను మధ్యలోనే కూలి్చవేశామని అమెరికా సైన్యం ఆదివారం ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత ఇదే నౌకపై దాడి చేయడానికి నాలుగు పడవలు ప్రయతి్నంచాయని వెల్లడించింది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని, తమ ఎదురు కాల్పుల్లో సాయుధ దుండగులు హతమయ్యారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment