ఇటీవలే గ్రీస్ దేశంలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 50కిపైగా మందికి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు దేశంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఈజిప్టులోని కైరో నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కాగా, నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు.
AFP: Two people were killed and several others injured Tuesday in a #train_accident north of #Cairo, #Egypt's #health_ministry said.
A ministry statement said there were "two dead in the train accident at #Qalyub, while the injured are in a stable condition." pic.twitter.com/ILBz8R0xs4— Usama Farag (@VOAFarag) March 7, 2023
Comments
Please login to add a commentAdd a comment