పక్షులకు, జంతువులకు ఏదైన సమస్య వస్తే మనుషుల మాదిరి ఆస్పత్రులకు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం వంటివి ఉండవు. ప్రత్యేకంగా పెంచుకుంటేనో లేక పార్క్‌లో ఉంటేనో వాటి సంరక్షకులు వాటి బాగోగులు గమనించి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకువెళ్లడం జరుగుతోంది. వాటికి మహా అయితే ట్రీట్‌మెంట్ చేసి పంపిచేస్తారు గానీ స్కానింగ్‌లు వంటి ఉండవు. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్ చేయించుకున్న తొలి పక్షిగా కూడా నిలిచింది.
వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోని అడ్వెంచర్ పార్క్‌లో ఉంటున్న చకా అనే పెంగ్విన్ పక్షి నిలబడటం, కదలికలకు సంబదించిన సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు వెటర్నరీ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ఐతే ఎందువల్ల ఈ సమస్యను ఎదర్కొంటుందనేది తెయకపోవడంతో దానికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. అందులో భాగంగా ఈ చకా అనే పెంగ్విన్‌కి ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా..అది ఏ మాత్రం భయపడకుండా ఏం జరుగుతుందా అని నిశితంగా గమనించింది. ఈ
పరీక్షల తదనంతరం నెమ్మదిగా బ్యాలెన్స్ అవ్వడం, మిగతా పెంగ్విన్ పక్షుల మాదిరి చకచక నడవడం వంటివి చేయగలుగుతోంది. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని అడ్వెంచర్ పార్క్ పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించుకున్న తొలిపక్షి. ఈ స్కానింగ్ ప్రక్రియ అనేది సముద్ర జాతికి చెందిన పక్షులు, జంతువుల తోపాటు అభయరణ్యాలు, పార్క్‌ల్లో పెరిగే జంతువులు వంటి వాటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు వైద్యులు.
(చదవండి: అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment