Geetha Movie First Look Poster Released By VV Vinayak: ‘‘గీత’ సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. నా శిష్యుడు విశ్వ దర్శకుడిగా, నా మిత్రుడు రాచయ్య నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి. యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. కుమారి 21F ఫేమ్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్, సునీల్ ముఖ్యపాత్ర చేసిన చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ (మూగ సాక్ష్యం) అన్నది ఉప శీర్షిక. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ సినిమాల ఫేమ్ సాయికిరణ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు.
డైరెక్టర్ వీవీ వినాయక్ శిష్యుడు విశ్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వినాయక్ విడుదల చేశారు. రాచయ్య మాట్లాడుతూ ‘‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి’’ అన్నారు. ‘‘గీత’ సినిమా అవకాశం మా గురువు వినాయక్‌గారే ఇప్పించారు. రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు విశ్వ. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్ అందించగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, కెమెరా: క్రాంతికుమార్.కె.
Comments
Please login to add a commentAdd a comment