ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత ‘తీవ్రం’గానే ఉంది. దీపావళి తర్వాత, దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభం తిరిగి తలెత్తింది. నగరం విషపూరిత పొగమంచుతో నిండిపోయింది. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో అన్ని వయసుల వారూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (బుధవారం) ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిలో కాలుష్యాన్ని కొలిచే సగటు వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) ‘తీవ్రమైన’ కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉదయం 6 గంటలకు నమోదు చేసిన డేటా ప్రకారం ఎక్యూఐ ఆర్‌కే పురంలో 417, ఆనంద్ విహార్‌లో 430, ఐజీఐ విమానాశ్రయంలో 403, నరేలాలో 430, పంజాబ్ బాగ్‌లో 423గా నమోదైంది.
ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో ప్రతి సంవత్సరం చలికాలం ప్రవేశించడంతోనే వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తుంది. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల దుమ్ము, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి కాలుష్య కారకాలుగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది?
#WATCH | Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB).
— ANI (@ANI) November 15, 2023
(Visuals from IIT Delhi, shot at 6:30 am) pic.twitter.com/AxgNPrXBOv
Comments
Please login to add a commentAdd a comment