ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్‌పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్‌లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది.
ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే..
#WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category.
— ANI (@ANI) November 16, 2023
(Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ
Comments
Please login to add a commentAdd a comment