దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గత నెల రోజులుగా కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. దీపావళికి ముందు కురిసిన వర్షంతో ఇక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, దీపావళి నుండి కాలుష్యం ‘అతి పేలవమైన’ స్థాయికి చేరడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
శుక్రవారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 300 కంటే ఎక్కువగా ఉంది. అంటే అతి పేలవమైన కేటగిరీలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత స్థాయి 360 దాటింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 350, ఆర్‌కె పురంలో 325, పంజాబీ బాగ్‌లో 332, ఐటీవోలో 328గా ఉంది. శనివారం నుంచి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఏక్యూఐ శుక్రవారం 324గా ఉంది.
ప్రస్తుతం ఢిల్లీలో గాలి వేగం తక్కువగా ఉంది. పగటిపూట గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్య కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో ఢిల్లీవాసులు ప్రాణాంతక కాలుష్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలోమీటర్లు ఉండవచ్చు. బలమైన గాలి ప్రభావం కారణంగా కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి.
శుక్రవారం ఆకాశం నిర్మలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 25.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం కూడా ఉదయం తేలికపాటి పొగమంచు, పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. శని, ఆదివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే?
Comments
Please login to add a commentAdd a comment