జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారం తర్వాత కూడా ముఖ్యమంత్రిని నిర్ణయించుకోలేకపోతున్నారని రాజస్థాన్ కేర్‌టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎంను డిసైడ్ చేయడంలో ఇంత ఆలస్యం చేసి ఉంటే బీజేపీ నేతలు తమపై అరుపులు, కేకలు పెట్టేవాళ్లని గెహ్లాట్ ఎద్దేవా చేశారు.
కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగామెడి కేసులో విచారణ జరిపేందుకుగాను ఎన్‌ఐకు ఎన్‌ఓసీ ఇచ్చే ఫైల్‌పై తాను సంతకం చేయలేదని చెప్పారు. ‘ఎన్నికల్లో గెలిచి వారం దాటినా ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రి రాలేదు. కొత్త సీఎం ఎన్‌ఐఏ ఫైల్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. త్వరగా సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోండి’అని గెహ్లాట్ కోరారు.
‘బీజేపీలో క్రమశిక్షణ లేదు. వారం రోజులు గడుస్తున్నా మూడు రాష్ట్రాల్లో ఇంత వరకు సీఎంను ఎంపిక చేయలేదు. ఇదే పని మేం చేసి ఉంటే ఎన్ని మాపై వారు ఎన్ని విమర్శలు చేసి ఉండే వాళ్లో తెలియదు. ఎన్నికల్లో వారు ఓట్లు పోలరైజ్ చేసి గెలిచారు. అయినా కొత్త ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది’ అని గెహ్లాట్ తెలిపారు.
#WATCH | Congress leader and Rajasthan caretaker CM Ashok Gehlot arrives in Delhi to take part in a meeting to review the party's performance in recently held assembly polls in the state
— ANI (@ANI) December 9, 2023
"...For around seven days now, they (BJP) have not been able to announce CM faces in the… pic.twitter.com/BIv6B8kd0J
ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..!
Comments
Please login to add a commentAdd a comment