రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్‌లోని 50 స్థానాలకు గాను గతసారి బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 26 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టివేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ విజయానికి కారణాలేమిటి? కాంగ్రెస్ ఓటమికి కారణాలేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు దీనిపై విశ్లేషణ అందించారు.
బీజేపీ విజయానికి ఐదు కారణాలు
పార్టీలో ఐక్యత నెలకొంది. నేతలంతా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు.
ప్రధాని మోదీ పాలనే అజెండాగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి దిగడం లాభదాయకంగా మారింది.
టికెట్ల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన నేతలందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా మారింది.
ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా అన్ని ప్రాంతాలలో పర్యటించారు.
‘సనాతనం’ అంశంతో ఓట్లర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కలిసివచ్చింది.
కాంగ్రెస్ ఓటమికి ఐదు కారణాలు
రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య తలెత్తిన వర్గపోరు కారణంగా కార్యకర్తల ఐక్యతలో చీలిక ఏర్పడింది.
టిక్కెట్ల కేటాయింపులో సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రత్యక్షంగా నష్టపోయారనే వాదన వినిపిస్తోంది.
బ్యాడ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా టిక్కెట్లు కేటాయించారు.
పార్టీ నేతలు మితిమీరిన ప్రకటనలు చేయడంతో ప్రజలు వాటిని నమ్మలేదు.
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం కాంగ్రెస్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఇది కూడా చదవండి: రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment