ఢిల్లీ: కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే.. ప్రతిష్ట పొందుతోందని దుయ్యబట్టారు. ఇరు దేశాల మధ్య వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు.
'ఉగ్రవాదుల కార్యకలాపాలను యధేచ్చగా జరగనిచ్చేలా అవకాశాన్ని కల్పించడం, ఉగ్రవాదులకు ఫండింగ్ సమకూర్చడం వంటి చర్యలకు కెనడా స్వర్గధామంగా మారింది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను పంచుకోవాలని కోరితే స్పందన లేదు. కేవలం రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం మానుకోవాలని కెనడాను కోరుత్నునాం.' అని అరింధమ్ బాగ్చి తెలిపారు.
కెనడా-భారత్ వివాదం..
ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారులను కెనడా నుంచి బహిష్కరించారు.
కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేనడా ప్రయాణాలపై పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?
Comments
Please login to add a commentAdd a comment