భార్యతో నవాజ్ మోడీతో విడాకులు ప్రకటించినప్పటినుంచి మౌనంగా ఉన్నరేమాండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా ఎట్టకేలకు స్పందించారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా కంపెనీ బిజినెస్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు. కంపెనీని సజావుగా నడిపించేందుకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.
ఈ మేరకు ఉద్యోగులు, బోర్డు సభ్యులకు హామీ ఇస్తూ ఈమెయిల్ సమాచారం అందించారు రేమాండ్ బాస్.. వక్తిగత అంశాలకు సంబంధించి మీడియాలో పలు నివేదికలు వస్తున్నాయని, అయితే వాటిపై తాను వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం తనకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల రేమాండ్ షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలోనే గౌతమ్ ప్రకటన రావడం గమనార్హం.
విడాకులు, భార్య నవాజ్ మోడీ, తండ్రి, రేమాండ్స్ గ్రూపు ఫౌండర్, విజయ్‌పత్ ఆరోపణల తరువాత రేమండ్ స్టాక్ 12 శాతం పడిపోయింది. కాగా ఈ దీపావళి మునుపటి దీపావళిలా ఉండబోదు. 32ఏళ్ల బంధానికి స్వస్థి అంటూ నవాజ్ మోడీతో విడిపోతున్నట్లు సింఘానియా ట్విటర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment