కుటుంబ తగాదాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాపారం కుటుంబం రేమాండ్ గ్రూపు. భారతీయ వస్త్ర పరిశ్రమలో రేమాండ్ అనే బ్రాండ్‌ను, దానికొక ఇమేజ్‌ను తీసుకొచ్చిన వ్యక్తి రేమండ్ వ్యవస్థాపకుడు, సంస్థ మాజీ ఛైర్మన్, దేశీయ కుబేరుల్లో ఒకరు విజయపత్ సింఘానియా. గార్మెంట్ అండ్ టెక్స్‌టైల్ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని లక్షలాదిమంది భారతీయులకు చేరువయ్యారు. "ది కంప్లీట్ మ్యాన్", "ఫీల్స్ లైక్ హెవెన్..ఫీల్స్ లైక్ రేమాండ్" ట్యాగ్‌లైన్‌లతొ అద్బుతమైన దుస్తులను అందించిన ఘనత ఆయనదే.
రూ.1200 కోట్ల సామ్రాజ్యం
ప్రఖ్యాత ఏవియేటర్, సర్క్యూట్ రేసింగ్ లవర్ , సాహస క్రీడల ప్రేమికుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన విజయ్‌పథ్ కొడుకు గౌతం సింఘానియా విబేధాలతో ఆయన జీవితం దుర్భరంగా మారిపోయింది. ఇంటి నుండి గెంటేయడంతో నానా కష్టాలు పడుతున్నారు. ఒకపుడు 12వేల కోట్ల రూపాయల నెట్‌వర్త్‌తో అంబానీలకు (రేమండ్ గ్రూప్ యజమానిగా ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ చాలా చిన్నవాడు) మించిన ధనవంతుడిగా, దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన ఆయన 85 ఏళ్ల వయసులో అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నారు. మానవ సంబంధాలు, కుటుంబంలోని కుటుంబ వివాదాల దుష్పరిణామాలకు రేమండ్ వ్యవహారం, ఒక రిమైండర్.. ఒక హెచ్చరిక లాంటిది .
1900లో వాడియా మిల్లు నుండి ప్రారంభమై రేమండ్ అతి తక్కువ కాలంలోనే కొత్త శిఖరాలకు చేరింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక దుస్తుల కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విమానయానంలో అతని విజయాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఆఫ్ హానర్ , లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కోసం టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
విజయ్‌పత్ పెద్ద కుమారుడు మధుపతి, కుటుంబానికి దూరంగా సింగపూర్‌లో స్థిరపడ్డాడు. రేమాండ్ వ్యాపార వ్యవహరాలను చూసుకుంటున్న రెండో కొడుకు గౌతమ్‌తో మధ్య ఆస్తి వివాదం కోర్టు కెక్కింది. సంబంధాలు దెబ్బతిన్నాయి. అనూహ్యంగా విజయపత్ సింఘానియాను చైర్‌పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి తొలగించడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే గౌతమ్ భార్య నవాజ్‌మోడీతో విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది. తన ప్రియమైన బిడ్డలు, గోప్యత అంటూ గౌతమ్ మౌనంగా తెరవెనుక ఉండిపోతుండగా, అతని భార్య నవాజ్‌మాత్రం తనను హింసించాడని ఆరోపించింది. గ్రూపు బోర్డులో ఉన్న తనకు గౌతమ్ ఆస్తిలో 75 శాతం భరణం కావాలని డిమాండ్ చేస్తోంది.
2015 ఫిబ్రవరి 15 నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. నాజీవితాన్ని శాశ్వతంగా మార్చేసే లేఖంపై సంతకం చేసిన రోజు. నా జీవితంలో చేసిన అత్యంత మూర్ఖపు తప్పు - విజయ్‌పత్ సింఘానియా
రేమాండ్ కుప్పకూలుతోంది.. నా గుండె బద్దలవుతోంది
ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన విజయపత్ సింఘానియా సొంత కొడుకు గౌతమ్‌కు బదులుగా నవాజ్‌కు , ఆమె ఇద్దరు ఆడపిల్లలకు మద్దతుగా నిలవడం విశేషం. తన కుమారుడు గౌతమ్ కంపెనీని నాశనం చేస్తున్నాడని, ఇది చూసి తన గుండె బద్దలవుతోందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి కష్టించి నిర్మించిన సామ్రాజ్యాన్ని కూల్చివేయడం బాధకలిగిస్తోందన్నారు. అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం, భర్త సంపదలో సగం స్వయంచాలకంగా విడిపోయిన భార్యకు వెళ్తుంది. మరి నవాజ్ 75 శాతం కోసం ఎందుకు పోరాడుతోందని అనేది తనకు అర్థం కాలేదని కానీ ? గౌతమ్ లొంగడని వ్యాఖ్యానించారు.
విడాకుల వివాదంతో భారీ నష్టం
రేమండ్ గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.10,985.33 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో రూ 11 వేల కోట్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. రేమండ్ 64 సంవత్సరాలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావడంతో పాటు చాలా స్ట్రాంగ్ స్టాక్‌గా ఉంది. సింఘానియా-మోడీ విడాకుల కథ స్టాక్ ధరను భారీగా దెబ్బతీసింది.నవంబర్ 23 నాటికి రేమండ్ స్టాక్ దాదాపు 5.15 శాతం నష్టపోయింది. ఫలితంగా గత 7 సెషన్లలో దాని మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment