బరేలి: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment