భోపాల్: మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ హై కమాండ్ కూడా ఆయనపై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి తన రాజీనామాను కమల్‌నాథ్ సమర్పించే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ కార్యకర్తలను కలవకుండా కమల్‌నాథ్ వెళ్లి సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కమల్‌నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా,2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 114 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. కమల్‌నాథ్ సీఎం పదవి చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడి మళ్లీ బీజేపీ పగ్గాలు చేపట్టింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 163 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 66 సీట్లకు పడిపోయి ఘోర పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment