ఎర్రుపాలెం: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, మధిరల్లో సోమవారం జరిగిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రధాని పదవినే త్యాగం చేసిన రాహుల్‌పై సభ్యత, సంస్కారం మరిచి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఎప్పుడూ పబ్‌లు, క్లబ్‌ల వెంట తిరిగే కేటీఆర్‌కు పొలాలు పబ్‌లలా, మెకానిక్ షాపులు క్లబ్‌లలా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకున్న కేటీఆర్ వెంట ఈడీ, సీబీఐ పడుతుండటంతో బీజేపీ నాయకులతో అంటకాగుతూ వారి డైలాగ్‌లను వల్లె వేస్తున్నా రని విమర్శించారు.
రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారు.
ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయా అన్న ప్రశ్నకు భట్టి సమాధానం ఇస్తూ ఆయన వ్యాఖ్య లను కట్ చేసి చూపించారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని, తాము అధికారంలోకి రాగానే నూటికి నూరు శాతం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని భట్టి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment