జైపూర్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్‌లోని చురూ సెగ్మెంట్‌కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాహుల్ కుశ్వాన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని రాహుల్ కుశ్వాన్ ‘ఎక్స్’(ట్వీటర్) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు.
అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్‌సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ కుశ్వాన్ పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్‌సభ స్థానంలో రాహుల్ కుశ్వాన్ బదులు పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment