రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్, చండీగఢ్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్‌లు ఆటను ప్రారంభించలేదు. అయితే మూడో రోజు ముగిసే సమయానికి పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 477 పరుగులు చేసింది.
పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ ఆజేయ దిశ్వతకంతో చెలరేగాడు. అన్మోల్‌ప్రీత్ 329 బంతుల్లో 25 ఫోర్లతో 205 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్ సైతం భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ప్రభుసిమ్రాన్ 215 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 171 చేసి ఆజేయంగా ఉన్నాడు.
కాగా అన్మోల్‌ప్రీత్ సింగ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చి ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు అన్మోల్‌ప్రీత్ ఆడాడు. అతడిని ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకుంది. అదే విధంగా ప్రభుసిమ్రాన్ సైతం క్యాష్‌రిచ్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
చదవండి: IND vs ENG: ధోనిని గుర్తుచేసిన రోహిత్.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment