photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో వికెట్ పడగొట్టకుండా అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
సుందర్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 13.4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 118 పరుగులు సమర్పించుకున్నాడు. సుందర్ తర్వాత సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహర్ (9 ఓవర్లలో 94), లక్నో బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (8 ఓవర్లలో 92), రాజస్థాన్ రాయల్స్ పేసర్ కేఎం ఆసిఫ్ (7 ఓవర్లలో 69), గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ (6 ఓవర్లలో 95)లు వికెట్ లేకుండా (కనీసం 6 ఓవర్లు వేసి) చెత్త గణాంకాలతో లీగ్‌లో కొనసాగుతున్నారు.
కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (4-0-22-3), డెవాన్ కాన్వే (77 నాటౌట్) సత్తా చాటడంతో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో సీఎస్‌కే 8 పాయింట్లు (0.355) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment