బిరియానీలో వున్న జెర్రీ
తమిళనాడు: ఊటీలో శుక్రవారం జెర్రి పడిన బిరియాని తిన్న నలుగురు అస్వస్థతకు గురయ్యారు. నీలగిరి జిల్లా ఊటీ పక్కనే వున్న ఎం.పాలాడా పరిసర ప్రాంతాలలో పెద్ద మొత్తంలో క్యారెట్ సాగవుతోంది. రెండువేల మందికి పైగా కార్మికులు అక్కడే వుంటూ పనిచేస్తున్నారు. ఎం.పాలాడ సమీపంలోని నరికుజియాడ ప్రాంతానికి చెందిన కృష్ణస్వామి శుక్రవారం మధ్యాహ్నం మమ్మీ మెస్ నుంచి నాలుగు బిరియానీలు కొన్నాడు.
కృష్ణస్వామి, అతని సహచరులు కలిసి దీనిని తింటున్నారు. అందులో జెర్రి మృతి చెంది ఉంది. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఎం.పాలాడాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందించారు. దీనిపై ఆహార భద్రత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నీలగిరి జిల్లా ఫుడ్ సేప్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ సురేష్, అధికారులు నందకుమార్, శివరాజ్ నేతృత్వంలోని బృందం రెస్టారెంట్‌లో పరిశీలించారు. అక్కడ అపరిశుభ్రంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. వారికి రూ.2000 జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment