హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మే 20 నుంచి జూన 5వరకూ పల్లె, పట్టణ ప్రగతి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment