హైదరాబాద్: ‘విద్యుత్‌పై సమీక్ష చేసి.. ఒక్క నిమిషం కూడా కరెంటు పోనియ్యం.. అని సచివాలయంలో చెప్పి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లగానే కరెంటు పోయింది.. ప్రొటోకాల్ ప్రకారం సీఎం ఉన్న ఏరియాలో కరెంటు పోవద్దు.. రేవంత్‌రెడ్డి మీకే దిక్కు లేదు.. మీరు ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు’ అని బీఆర్‌ఎస్ నేత వై.సతీ‹Ùరెడ్డి ఆదివారం చేసిన ట్వీట్‌తో విద్యుత్ అధికారులు స్పందించారు.
శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్‌బీటీనగర్‌లో కేకే, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వచ్చారని, ఆయన ఉన్నంతసేపు ఎలాంటి కరెంటు అంతరాయం కలగలేదని, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు రీట్వీట్ చేశారు. ఇంటర్నల్ వైరింగ్ లోపంతో టెంపరరీగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు వెలుగుతూ ఆరిపోయాయని, ఇది కరెంటు వైర్ సమస్య వల్ల తలెత్తిందని, అసలు కరెంటు పోలేదని స్పష్టం చేశారు. మేయర్ ఇంటి ముందు, పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరాయంగా వెలిగాయన్నారు.
ఇదిలా ఉండగా కరెంటు పోయినట్లుగా వచి్చన వార్తల పట్ల మేయర్ నివాస సిబ్బంది కూడా స్పందించారు. సీఎం ఉన్నంతసేపు అసలు కరెంటు పోలేదని, ఒక వైర్ కదలిక వల్ల ఫ్లడ్ లైట్లు ఆరుతూ వెలిగాయన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి 11 కేవీ ఫీడర్‌తో స్పెషల్‌గా కరెంటు సరఫరా ఉందని బంజారాహిల్స్ ఏడీఈ ఆర్.హైమానంద వెల్లడించారు. శనివారం సీఎం వచి్చన సమయంలో మేయర్ ఇంటితో పాటు ఎన్‌బీటీనగర్‌లో కరెంటు అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. మేయర్ ఇంటి వద్ద సీఎం ఉన్న సమయంలో మూడుసార్లు కరెంటు పోయిందంటూ జరుగుతున్న దు్రష్పచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment