సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్ అసోసియేషన్. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్‌లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు.
ఇదీ చదవండి: కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది?
Comments
Please login to add a commentAdd a comment